Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఉద్యోగంలో గుడ్ న్యూస్ వింటారు..

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు శనివారం(సెప్టెంబర్ 25).. పలు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు. రి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం..

  • Share this:
    Today Horoscope: నేడు శనివారం(సెప్టెంబర్ 25).. పలు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో.. దిన ఫలాల ద్వారా తెలుసుకుందాం..

    మేష రాశి (Aries): మీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతున్నా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. మిత్రులకు చేసే సహాయం వల్ల మేలు జరుగుతుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. కుటుంబ సమస్య పరిష్కారమయ్యే సూచనలున్నాయి.

    వృషభ రాశి (Taurus): ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. గృహ, వాహన యోగాలున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. క్రీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.

    మిథున రాశి (Gemini): కాలం ప్రతికూలంగా ఉన్నట్టు కనిపించినా పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఖర్చులకు కళ్లెం వేయండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభ కార్యం జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    కర్కాటక రాశి (Cancer):కర్కాటకం: అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత శ్రమ పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా వృద్ధికి అవకాశం ఉంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి.

    సింహ రాశి (Leo): ప్రతి పనికీ శమ, మానసిక ఒత్తిడి తప్పవు. ఉద్యోగంలో మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. వ్యాపారం నిలకడగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో అవరోధాలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సతృ్ఫలితాలనిస్తాయి. వివాదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వవద్దు.

    కన్య రాశి (Virgo): అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో మరింత శ్రద్ద అవసరం. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అరోగ్యం పరవాలేదు.

    తుల రాశి (Libra): వ్యాపారంలో కలిసి వస్తుంది. అన్ని విధాలా విశేష లాభాలున్నాయి. ఉద్యోగపరంగా కష్టానికి తగ్గ ఫలిత౦ ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పోయిన వస్తువులు తిరిగి వస్తాయి. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయ౦లో జాగ్రత్త.

    వృశ్చిక రాశి (Scorpio):గట్టి పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. వ్యక్తిగతంగా ఒక కీలక సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం పెంచుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. కుటుంబపరంగా మేలు జరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుప డుతుంది.

    ధనస్సు రాశి (Sagittarius): అన్ని విధాలా కలసి వచ్చే కాలం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని అవకాశాలు అందివస్తాయి. అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

    మకర రాశి (Capricorn): ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురైనా తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. మీరు కోరుకున్న చోట మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. స్నేహితులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. ఆరోగ్యంపై శ్రద్ద అవనరం.

    కుంభ రాశి (Aquarius): ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి జరుగుతుంది. ఇంటా బయటా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు వీలుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు చేపట్టవచ్చు. మిత్రులకు సహాయం చేస్తారు. అంతా శుభమే జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

    మీనం (Pisces): వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కొద్దిగా ఆలస్యంగా అయినా మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రతిభా పాటవాలతో అధికారులను సంతోషపెడతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు.
    Published by:Sumanth Kanukula
    First published: