TODAY HOROSCOPE 21 JANUARY 2022 THESE ZODIAC SIGNS TRIPS WILL BE POSTPONED DUE TO SOME REASONS PJC GH SK
Horoscope Today: నేటి దిన ఫలాలు.. ఈ రాశుల వారి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం
దినఫలాలు
Daily Horoscope; ఈరోజు వివిధ రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్నవన్నీ జరుగుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు తప్పవు. మరి జనవరి 21, శుక్రవారం నాడు మేషం నుంచి మీన రాశి వరకు.. ఎవరికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఈరోజు వివిధ రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్నవన్నీ జరుగుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు తప్పవు. మరి జనవరి 21, శుక్రవారం నాడు మేషం నుంచి మీన రాశి వరకు.. ఎవరికి ఎలా ఉంటుందో నేటి దిన ఫలాల్లో తెలుసుకుందాం.
* మేషం (Aries):
ఫలితాలు మీకు అనుకూలంగా లేవని తెలిసిన చోట చర్చలు వద్దు. కొత్త ఆలోచనలు మీ మైండ్‌ను ఆక్రమించవచ్చు. ఒత్తిడి నుంచి దీర్ఘకాలిక ఉపశమనాన్ని లభిస్తుంది. మీకు అప్పగించిన పనిని పూర్తి చేయండి.
* వృషభం(Taurus):
అనుకోని సంఘటనల నడుమ పరిస్థితులు చక్కబడతాయి. అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
లక్కీ సైన్-నీలిరంగు లోగో
* మిథునరాశి (Gemini):
ఒక నిర్దిష్ట దినచర్యను అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. దూరప్రాంతాలకు వెళ్లేవారు పర్యటనను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. పని ప్రదేశంలో జాగ్రత్త వహించండి. హోంవర్క్ బాగా చేయాలి.
* కర్కాటకం (Cancer):
కొత్త వ్యక్తుల నుంచి ప్రతిఘటన అనుభవించవచ్చు. అపార్థాలు ఉండవచ్చు. ఇప్పుడే ఏదైనా ముగించకూడదని గుర్తుంచుకోండి.
లక్కీ సైన్- జానపద కథ
* సింహం(Leo):
మీ భావోద్వేగాలను ఎక్కువసేపు అణచుకోకండి. దగ్గరగా ఉన్న వ్యక్తి మీరు వాటిని వ్యక్తపరచడానికి వేచి ఉన్నారు. మీకు తెలిసిన వ్యక్తి నుంచి శుభవార్త వస్తుంది.
లక్కీ సైన్- పెంపుడు జంతువు
* కన్య(Virgo):
మీ ఆర్థిక స్థితి స్థిరంగా పెరుగుతుంది. ఆదాయ వనరులు యాక్టివ్‌గా ఉంటాయి. సరికొత్త అసైన్మెంట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఓ స్నేహితుడు సహాయం కోసం రావచ్చు.
* తుల(Libra):
సరికొత్త సహకారం కనిపించవచ్చు. మీరు దానిని వెంటనే నిర్ణయించే బదులు తిరిగి రావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతూ ఉండవచ్చు.
లక్కీ సైన్- ఆల్బమ్
* వృశ్చికం (Scorpio):
సంగీతం పట్ల ఆసక్తి ఉన్నట్లయితే ఈ రోజు ఆనందించడానికి మంచి రోజు కావచ్చు. అద్దెకు ఉన్న వ్యక్తులు కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కుంటారు. విశ్రాంతి తీసుకోవడానికి ఇంట్లో ఉండేందుకు కష్టపడవచ్చు.
లక్కీ సైన్- అమెథిస్ట్ క్రిస్టల్
* ధనుస్సు(Sagittarius):
ఓ సహాయం మీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. అయితే నిబద్ధతగా ఉండటమనేది మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. ఈరోజు చివరిలో అనుకోకుండా కలిగే తీవ్రమైన పని వల్ల మేల్కొని ఉంటారు.
* మకరం (Capricorn):
అందమైన అలంకరణ వస్తువులు మీ దృష్టిని ఆకర్షించవచ్చు. మీలోని సృజనాత్మక నైపుణ్యాలు మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. ఒక స్నేహితుడు మీ మానసిక స్థితిని పెంచే వ్యక్తి అని తెలుసుకుంటారు. విద్యార్థులు చాలా బిజీగా ఉంటారు.
లక్కీ సైన్- రూబిక్స్ క్యూబ్
* కుంభం (Aquarius):
గతంలోని కట్టుబాట్లు కొన్ని మిమ్మల్ని వెంటాడవచ్చు. మీ సొంత స్థలంలో ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.
లక్కీ సైన్- వెండి నగలు
* మీనం (Pisces):
త్వరలో మీకో ప్రత్యేక గుర్తింపు రానుంది. మీరు సరికొత్త జీవితానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. దానిని ఎంజాయ్ చేసేందుు.. మీ కోసం మంచి విరామ సమయాన్ని ప్లాన్ చేసుకోండి.
లక్కీ సైన్- పామ్ ట్రీ
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.