Margashira Purnima: హిందువల నమ్మకం ప్రకారం కొన్ని మసాల్లో కొందరి దేవుళ్లకు ప్రత్యేకంగా భావిస్తారు. అలాగే హిందూ పురాణాల ప్రకారం మార్గశిర మాసానికి (Margashira Masam) ఎంతో విశిష్టత ఉంది. అది కూడా శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన రోజులుగా కూడా భావిస్తారు. అయితే ఈ మాసంలో పర్వదినాల్లో ఉపవాసాలు పాటించి శ్రీకృష్ణుని పూజిస్తే (Lord Srikrishna Pooja).. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు. మార్గశిర మాసం అంటేనే స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యమైనది అని చెబుతారు.. ఈ మాసంలోని కొన్ని తేదీల్లో శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే పుణ్యం లభించడమే కాకుండా పునర్జన్మ లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది (Financial Problems) పడేవారికి ఆ సమస్యలు తీరడంతో పాటు.. ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్లో గ్రహ సంచారాలు జరగడం మార్గశిర మాసంలో జరిగే శ్రీకృష్ణునికి సంబంధించిన వ్రతాలు పాటించాలా వద్దా అనే గందరగోళంలో కొందరు భక్తులున్నారు.
కృష్ణుని పూజకు సరైన సమయం ఇదే:
హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర పూర్ణిమ తిధి డిసెంబర్ 7 ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. అలాగే డిసెంబర్ 8 ఉదయం 9:30 నిమిషాలకు శుభ గడియలు ముగుస్తాయి. తిధి పూర్ణిమ రెండు అనుకూలంగా ఉండడంతో.. ఈ రోజు పౌర్ణమి జరుపుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు రేపు కూడా పౌర్ణమిని పాటిస్తున్నారు. అందుకే ఈ రెండు రోజుల్లో ఏరోజు ఈ వ్రతం చేసినా అద్భుత ఫలితం ఉంటుంది అంటున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పూజను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.
పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు ఇవే:
మార్గశిర మాసంలోని పౌర్ణమి రోజున శ్రీకృష్ణునికి సంబంధించిన వ్రతాన్ని జరుపుకునే వారు తప్పకుండా ఉదయాన్నే స్నానం చేయాల్సి ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారు నది దగ్గర తల స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని పూర్వీకులు పేర్కొన్నారు. స్నానం చేసిన తర్వాత పట్టు వస్త్రాలను ధరించి శ్రీకృష్ణుని ప్రతిమలకు గంధాన్ని అలంకరించి పూజా కార్యక్రమాన్ని చేయాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి : త్వరలో జనసేనలోకి మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు..!
అలాగే పూజా కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణునికి ఇష్టమైన పంచామృతం స్వీట్లు పండ్లు శిరా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుని వ్రతంలో భాగంగా పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభించి శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి చివరిగా చందమామకు పూజలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ జాతకంలో చంద్రుడు బలంగా మారి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ పూజ చేయడానికి ఈ రెండు రోజులు అనుకూలనమైనవే అంటున్నారు. అలాగే పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీకృష్ణునికి సమర్పించిన నైవేద్యాలను ఐదుగురు ముత్తైదువులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కుటుంబంలో శాంతి లభించడంతో పాటు ఆర్థిక సమస్యలు తీరుతాయి అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Astro Tips, Money Astrology