Shani puja: శనివారం శనిదేవుడికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు. శనిదేవుడుకి కోపం ఎక్కువ అని కూడా భావిస్తారు. అయితే, ఆ శని భగవాణుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజు కొన్ని నియమాలు పాటించాలి.
అసలు Shani dev శని భగవాణుడి పేరు వినగనే అనేక సందేహాలు వస్తాయి. ఆ కోపంతో కూడిన రూపాన్ని చూస్తేనే.. మనస్సులో భయం పుడుతుంది. హిందు పురాణాల ప్రకారం శని దేవుడు మానవులకు శుభ, అశుభ ఫలాలను అందిస్తాడని అంటారు. మనం మంచి పనులు చేస్తే, మంచి ఫలితాలు.. చెడు పనులు చేస్తే.. చెడు ఫలితాలు ఇస్తాడు. ఇటువంటి వారు శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. శనిదేవుడిని పూజించడానికి ఉత్తమమైన రోజు శనివారం Saturday . కొన్ని సులభమైన పనులు ద్వారా ఆయన ఆశీర్వాదాలు మనపై ఉండటమే కాకుండా అన్ని రకాల ఇబ్బందుల నుంచి రక్షిస్తాడు. అవేంటో తెలుసుకుందాం.
శని దోషం (shani dosha) పడితే... ఎన్నో సమస్యలొస్తాయి. కోరిన కోరికలు తీరవు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు. కోర్టు కేసులు తేలవు, శత్రువులు పెరుగుతారు, రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలుంటాయి. శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమ మైన రోజు శని త్రయోదశి. శనివారం (saturday) రోజున త్రయోదశి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు.
శనివారం భజరంగ్బలికి సింధూరం, మల్లెపూలను సమర్పించాలి. ఈ రోజు హనుమాన్ చాలీసా కూడా చదవలి. హనుమాన్ను పూజించిన వారికి శనిదేవుడి ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన అవసరం లేదని నమ్ముతారు.
రావి చెట్టుకు ఈరోజు నీరు పోయాలి. ఏడు చుట్టు తిరిగి రావి చెట్టుకు నమస్కరించాలి. అంతేకాదు, శనివారం ఎవరైనా పేదలకు ఆహారం పెట్టినా శనిదేవుడు సంతోషిస్తాడు. దీంతో పేదరికం కూడా తొలగిపోతుంది.
ప్రతి శనివారం నూనె, నల్లనువ్వులు శనిదేవుడికి సమర్పించాలి. ఇవే కాకుండా నూనె దానం చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. దీనికి ముందుగా స్నానం చేసి, ఒక గిన్నెలో నూనె తీసుకుని అందులో మీ ముఖం చూసుకోవాలి. ఆ తర్వాత ఆ నూనెను దానం ఇవ్వాలి.
శనివారం శనిదేవుడిని పూజించాలి. ఆయనకు నీలం రంగుపూలను సమర్పించాలి. శనిదేవుడిని పూజించేటపుడు ఆయన విగ్రహానికి ఎదురుగా నిలబడి చేయకూడదు.
శనిదేవుడిని ప్రసన్సం చేసుకోవడానికి సూర్యాస్తమయం తర్వాత ఏదైనా రావి చెట్టు దగ్గర చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించాలి. రావి చెట్టు అందుబాటులో లేకపోతే.. ఏదైనా ఆలయంలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.