Tirumala News: తిరుమలలో రచ్చ రచ్చ... అధికారిని చితకబాదిన భక్తుడు

Tirumala Tirupati Devasthanam: అసలే వైకుంఠ ద్వార దర్శన సమయం. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అసలు ఏం జరిగింది? భక్తుల ఆగ్రహానికి కారణమేంటి?

news18-telugu
Updated: December 27, 2020, 7:09 AM IST
Tirumala News: తిరుమలలో రచ్చ రచ్చ... అధికారిని చితకబాదిన భక్తుడు
తిరుమలలో రచ్చ రచ్చ... అధికారిని చితకబాదిన భక్తుడు (File Image)
  • Share this:
TTD News: తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువ కాబట్టి... అప్పుడప్పుడు అధికారులు సహనం కోల్పోయి... భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భాలుంటాయి. ఇలాంటి వాటిపై తరచూ విమర్శలు వస్తున్నా... ఇప్పటికీ కొందరు అధికారులు... కంట్రోల్ తప్పుతున్నారు. నిన్న అలాంటి సందర్భం ఒకటి జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం గర్భగుడిలో ఇది జరిగింది. ఓ విజిలైన్స్‌ అధికారి తీరుతో భక్తులకు విపరీతమైన కోపం వచ్చింది. చివరకు ఆ అధికారిని ఓ భక్తుడు చితకబాదాడు. ఏమైందంటే... శనివారం ఉదయం రూ.10,000 శ్రీవాణి టికెట్టు పొంది దర్శనానికి వెళ్లారు కొందరు భక్తులు. వారిని సరిగా దర్శనం చేసుకోనివ్వకుండా.. జయవిజయులు నుంచి బయటకు పంపేశారు అధికారులు. ఓ అధికారి ఓ భక్తుడితో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో ఆ భక్తుడికి కోపం వచ్చింది. "నువ్వేంటి... నువ్వేంటి" అనుకుంటూ... ఇద్దరూ చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ అధికారిని భక్తుడు పిడిగుద్దులు గుద్దాడు. ఇద్దరూ కింద పడి దొర్లుతూ కొట్టుకున్నారు. అది చూసిన మిగతా ఉద్యోగులు... వెంటనే అలర్ట్ అయ్యి... ఇద్దరినీ విడదీశారు. ఇదంతా చూసి ఇతర భక్తులు ఆశ్చర్యపోయారు. సాక్షాత్తూ శ్రీవారి ఆనంద నిలయంలో అధికారులు ఇలా చేస్తున్నారేంటని ముక్కున వేలేసుకున్నారు. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే... ఈ ఘటనపై రంగంలోకి దిగిన తిరుమల వన్‌ టౌన్‌ పోలీసులు ఏం జరిగిందో ఎంక్వైరీ చేస్తున్నారు.

మరో ఘటనలో శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ సిబ్బంది తమను తోసేశారని ఆరోపించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన తమను బంగారు వాకిలి నుంచే వెనక్కి పంపేశారని భక్తులు మండిపడ్డారు. లఘు దర్శనానికి అనుమతించలేదంటూ ఆందోళన చేశారు. మహిళా భక్తులను సెక్యూరిటీ సిబ్బంది తోసివేశారని ఫైర్ అయ్యారు.


వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. 10 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటోంది. కరోనా కారణంగా ఈసారి తిరుపతిలోని స్థానికులకే వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు ఇస్తామని టీటీడీ ముందుగా చెప్పినా... అప్పటికే క్యూలైన్లలో ఇతర ప్రాంతాల వారు వచ్చి ఉండటంతో... వారికి కూడా టికెట్లు ఇచ్చింది. నిన్న ద్వాదశి కావడంతో... పుష్కరిణిలో తీర్థ ముక్కోటిని నిర్వహించారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. కరోనా కారణంగా చక్రస్నానాన్ని TTD ఏకాంతంగానే నిర్వహించింది. కొద్ది మంది ఆలయ పండితులు, సిబ్బంది మాత్రమే ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:Weekly Horoscope: వారఫలాలు... డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు... రాశి ఫలాలు

భారీ సంఖ్యలో భక్తులు:

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా తగ్గడంతో... టీటీడీ కూడా కరోనా రూల్స్ క్రమంగా సవరిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. ఇవాళ వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎంత మంది వచ్చినా... టీటీడీ అధికారులు... కరోనా రూల్స్ ప్రకారం భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమల షాపింగ్ కాంప్లెక్సులు కూడా ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Published by: Krishna Kumar N
First published: December 27, 2020, 7:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading