Home /News /astrology /

TTD Darshan tokens: తిరుమల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త!

TTD Darshan tokens: తిరుమల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త!

Tirumala tirupati devasthanam

Tirumala tirupati devasthanam

Tirumala tirupati devasthanam: టీటీడీ నవంబర్‌ నెలలో రూ.300 దర్శన టిక్కెట్లు, ఉచిత దర్శన టోకెన్లను ఈ నెల 22, 23 తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

తిరుపతి ఏడుకొండ వేంకటేశ్వరుని దర్శనానికి ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. నవంబర్‌ నెలకు సంబంధించిన రూ.300 దర్శన టిక్కెట్లు, ఉచిత దర్శన టోకెన్‌లు ఆన్‌లైన్‌లో విడుదలకు సన్నద్ధమైంది.
తిరుపతి దర్శన టిక్కెట్లను రేపు అంటే 22 అక్టోబర్‌ నుంచి పంపిణీ చేయనున్నారు. కరోనా  ఆంక్షల  (Corona restrictions)  నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వేంకటేశుని దర్శనానికి భక్తుల రాకపోకలపై నిషేదాజ్ఙలు ఉండేవి. కరోనా సడలింపు తర్వాత ఏడుకొండలవాడి దర్శన టిక్కెట్లను గత నెలలో నిలిపివేశారు. ఇప్పడు పునః ప్రారంభించనున్నారు. తిరుపతి బస్టాండ్‌ సమీపంలోని శ్రీ శ్రీనివాస ప్రాంగణంలో టోకెన్ల జారీ చేయనున్నారు.

ఇది కూడా చదవండి:  మీ ఇంట్లో అద్దం ఇక్కడ ఉంటే.. వెంటనే తీసేయండి!

దర్శనానికి వచ్చే భక్తులు కరోనా టీకా ధ్రువీకరణ తప్పనిసరి. భౌతిక దూరంతోపాటు మాస్క్‌ తప్పనిసరి. . ప‌లువురు భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌టంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ (Checking) చేసి వెన‌క్కు పంపుతున్నారు. అందుకే భ‌క్తులు (devotes) ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోరింది. టికెట్లు లేకుండా ఆనేకమంది భక్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తుండ‌టంతో దేవస్థానం ఈ ప్రకటన చేసింది.

ఈ షరతులతో భక్తులకు దర్శనం అనుమతి లభించనుంది. రోజూ 8 వేల టోకెన్‌లు ఇవ్వనున్నారు. కానీ, భక్తులు 30 వేల మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు. కరోనా వల్ల గత నెల 25 న ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టోకెన్‌లు కూడా లభింనున్నాయని ప్రకటించారు.
దీని ప్రకారం భక్తులు   https://tirupatibalaji.ap.gov.in
వెబ్‌సైట్‌ ద్వారా రోజుకు 8 వేల ఉచిత దర్శనం టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత దర్శన టోకెన్లు బుక్‌ చేసుకునేందుకు రిలయన్స్‌ జియో ఉచిత సాంకేతిక సదుపాయాన్ని కల్పించింది.

ఇది కూడా చదవండి:  బ్రహ్మముహూర్తంలో ఈ పని అస్సలు చేయకండి.. లేకుంటే..!

తిరుపతి ఏడుకొండలను సందర్శించడానికి సెప్టెంబర్‌ ఉచిత టోకెన్‌ టోకన్లు కేవలం కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో పంపిణీ చేశారు. టీటీడీ నవంబర్‌ నెలలో రూ.300 దర్శన టిక్కెట్లు, ఉచిత దర్శన టోకెన్లను ఈ నెల 22, 23 తేదీల్లో ఆన్‌లైన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 22న నవంబర్‌ 22న తిరుపతి దర్శనానికి ప్రతిరోజూ 12 వేల టిక్కెట్లు జారీ చేయనున్నారు. 23న ఉచిత దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో రోజుకు పదివేల చొప్పున జారీ చేస్తారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Tirumala

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు