Home /News /astrology /

Fengshui vastu: లాఫింగ్‌ బుద్ధుడి ఈ రూపం.. మీ అదృష్టాన్ని మార్చగలదు!

Fengshui vastu: లాఫింగ్‌ బుద్ధుడి ఈ రూపం.. మీ అదృష్టాన్ని మార్చగలదు!

లాఫింగ్‌ బుద్ద

లాఫింగ్‌ బుద్ద

Keeping laughing Buddha at home: ఫెంగ్‌ షుయ్‌లో లక్‌ కోసం కొన్ని ప్రత్యేక విషయాలు ఇంట్లో పెట్టుకోవాలని అంటారు. వాటిలో ఒకటి లాఫింగ్‌ బుద్ధ. నవ్వే లాఫింగ్‌ బుద్ధ ఆనందం, సంతృప్తి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.

ఫెంగ్‌ షుయ్‌ (Fengshui) .. చైనా వాస్తు శాస్త్రం(vastu shatra)  గా పరిగణిస్తారు. ఫెంగ్‌ షుయ్‌ ప్రకారం ఇల్లు, వస్తువులు లేదా ఏదైన ప్రదేశం ప్రతికూల శక్తిని సానుకూల శక్తిగా మార్చడానికి ఉపయోగిస్తారు. ఫెంగ్‌ షుయ్‌లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. వీటిని అదృష్టాన్ని తీసుకువచ్చే శుభప్రదమైన వస్తువులుగా భావిస్తారు.

చైనా భాషలో దీన్ని బుడాయ్‌ అంటారు. ఎవరైనా లాఫింగ్‌ బుద్ధుడి (Laughing Buddha) కడుపుని తాకితే, అదృష్టం, సంపద తీసుకువస్తుందని, విజయం సాధిస్తారని నమ్ముతారు. లాఫింగ్‌ బుద్ధుడు అదృష్టవంతులైన ఏడు జపనీస్‌ షింటో దేవతల్లో ఒకరిగా పరిగణిస్తారు.

ఇది కూడా చదవండి: వైరల్‌ అవుతున్న రాశిఖన్నా బ్యూటిఫుల్‌ పిక్స్‌! ఒకప్పుడు బుమ్రాతో..

ఫెంగ్‌ షుయ్‌ వాస్తు ప్రకారం లాఫింగ్‌ బుద్ద విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఒకరి జీవితంలో అసమతుల్యత తొలగిపోతుంది. జీవితం నుంచి అన్ని దుఃఖాలను తొలగిస్తుంది. అయితే, దాన్ని సరైన స్థలంలో పెట్టకోవడం చాలా ముఖ్యం. మీ జీవితంలో సంపద, శ్రేయస్సు కోసం లాఫింగ్‌ బుద్ధుడిని ఏదిశలో పెట్టుకోవాలో తెలుసుకుందాం.

లాఫింగ్‌ బుద్ధ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవాలి. దీంతో సంపదను ఆకర్షిస్తుంది.
లాఫింగ్‌ బుద్ధుడిని స్టడీ రూంలో ఉంచాలి. దీంతో ప్రశాంతమైన జీవితం కోసం లాఫింగ్‌ బుద్ధ ధ్యానంలో ఉన్నది పెట్టుకోవాలి. ఇలా చేస్తే.. ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం ఉన్న విగ్రహాన్ని బెడ్‌రూం, స్టడీరూంలలో ఉంచుకోవచ్చు.

లాఫింగ్‌ బుద్ధడిని తూర్పు వైపునకు పెట్టాలి. ఇది నవ్వుతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చినపుడు బెడ్‌రూం, హాల్‌లో తూర్పుముఖంగా పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో ఉండేవారు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

బంగారం మోతతో ఉన్న లాఫింగ్‌ బుద్ధడిని ఇంట్లో పెట్టుకోవాలనుకంటే.. లివింగ్‌రూంలో ఉంచండి. ఈ సంచీ మీకు.. మీ కుటుంబ సభ్యులందరికీ ఆనందం, అదృష్టాన్ని తీసుకువస్తుంది. అంతేకాదు, మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే.. నియంత్రించవచ్చు. సానుకూలతను తెస్తుంది.

ఇది కూడా చదవండి: అల్లం వెల్లుల్లి పర్ఫెక్ట్‌ పేస్ట్‌ను ఇలా రెడీ చేయండి!

ఇక కార్యాలయాల్లో తాబేలుపై ఉన్న లాఫింగ్‌ బుద్ధుడిని పెట్టుకుంటే.. శక్తిని అందిస్తుంది. మీ ఆదాయం, వృత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది వ్యాపారంపై గొప్ప ప్రభావం చూపుతుంది.

నవ్వుతున్న బుద్ధుడి ప్రతిమ, దేవతల విగ్రహాలను వంట గది, బాత్రూమ్‌ లేదా టాయిలేట్‌ గోడలకు పెట్టకూడదు. ఫెంగ్‌ షుయ్‌ ప్రకారం ఈ ప్రదేశాల్లో లాఫింగ్‌ బుద్ధుడిని ఉంచడం అశుభంగా పరిగణిస్తారు. అంతేకాదు, లాఫింగ్‌ బుద్ధుడి విగ్రహాన్ని ఇంటి నేలపై ఎప్పుడూ ఉంచవద్దు.
Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు