విజయదశమి దేశవ్యాప్తంగా అందదు హిందువులు అంగరంగ వైభవంగా నిర్వహించుకును పండుగ. ముఖ్యంగా ఈ రోజుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో, నవదుర్గలు మనకు ఆశీర్వదిస్తారు
అమ్మవారిని పూజించే వారు ఏ పూవుతో పూజిస్తే మంచిదో అనే సందేహం రావచ్చు. వాటి వల్ల అమ్మ కరుణ వారిపై ఉంటుందని అపార నమ్మకం. అయితే, ఏ పూవుతో కొలిస్తే.. అమ్మ చల్లని చూపు మనపై ఉంటుందో తెలుసుకుందాం. విశేషంగా అన్ని రకాల పూలు రంగురంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో సంపెంగ పూవు మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. తెలుపు, పసుపు రంగుల్లో ఈ పూలు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఈ పూలు స్వామివారికి ఈ పూవు ఎంతో ఇష్టమట.
రకరకాల పూలతో కూడా అమ్మవారిని అర్చిస్తారు. వివిధ కూరగాయలతో శాకంబరీ అలంకరణ కూడా చేసుకుంటాం. అమ్మవారిని ఆరాధించడానికి ప్రకృతిలో లభించే ప్రతిపూవు, పండు ఇష్టమే.
కొన్ని ప్రాంతాల్లో హోమాలు, యగ్నాలు కూడా చేస్తారు. వీటి వల్ల పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి. ఇక కలశస్థాపన కూడా చేస్తారు. ఇది పాడ్యమి మొదలు నుంచి నవమి వరకు చంఢీ పారయణం వంటివి చేయాలి.
నైవేద్యం పెట్టాలి. ఇంకోటి పంచోపచారాలు కూడా ఉంటాయి. అదే ధూపం, అఖండ దీపాలు రెండు పెట్టిన తర్వాత అగరబత్తితో ధూపం వేయడం, నైవేధ్యం పెట్టి, తాంబూలం అందించి అమ్మవారికి నమస్కరించాలి. ఇది ప్రతి ఒక్కరూ చేయాలి. అయితే నైవేధ్యంలో ఏం పెట్టాలంటే, పాయసాన్నం, స్నిగ్ధౌన ప్రియ– నెయ్యి అన్నం, గుడాన్న ప్రీత మానస– అంటే బెల్లంతో చేసిన అన్నం, దధ్యోన్నసక్త హృదయా– దద్దోజనం,
ఈ విధంగా అమ్మవారిని సంతృప్తి పరచాలి. అమ్మవారికి అన్నంతో కూడిన నైవేద్యం పెట్టాలి.
ఏదైనా మొక్కు ఉంటే..కలశ స్థాపన చేసుకుని నివేదించాలి. ఇంకా మౌనవ్రతం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇలా చేయనివారు 9 రోజులపాటు బ్రహ్మణుడిని పిలిచి పూజ ఆరాధనలు చే యించాలి. బ్రాహ్మణులకు అన్నసంతర్పణ ఏకాదశిరోజు చేస్తారు. దీనివల్ల అక్షయసిద్ధి కలుగుతుంది. వారి ఇంట అమ్మవారి శక్తి కొలువై ఉంటుంది. మానసిక స్థితిగతులు కూడా స్థిరంగా ఉంటాయి. ఇందులో
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri