Zodiac signs: ఈ రాశుల వారు మీ భాగస్వామిని మోసం చేస్తారు..! వివరాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

Astrology: ఏ రాశి వారు ఎక్కువగా భాగస్వామిని మోసం చేస్తారు. దాని వెనుక ఎలాంటి కారణాలు ఉంటాయి అన్న విషయాలను కూడా వారి రాశులను బట్టి తెలుసుకోవచ్చట. మరి, ఏ రాశి వారు మోసం చేసేందుకు ఎలాంటి కారణాలు ఉంటాయంటే..

  • Share this:
    భార్యాభర్తల బంధంలో అన్నింటికంటే ఎక్కువగా బాధపెట్టేది ఏదైనా ఉంది అంటే అది.. మోసం చేయడం. ఇతరత్రా విషయాల్లో కాస్త అటు, ఇటుగా ఉన్నా.. తమ భాగస్వామి తమను మోసం చేస్తున్నారుని తెలిస్తే మాత్రం చాలా బాధపడతారు. కొందరు గొడవ పడి తేల్చుకుంటే.. మరికొందరు మాత్రం ఆ విషయాన్నే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండిపోతారు. లోలోపలే మదనపడిపోతారు. అయితే మీ భాగస్వామి మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని తెలుసుకోవడం వారి రాశి ద్వారా సాధ్యమేనట. సాధారణంగా మన జీవితం గురించి జ్యోతిష్య శాస్త్రం చాలా విషయాలను వెల్లడిస్తుంది.

    రాశులు మన వ్యవహార శైలిని నిర్ధారిస్తాయి. అందులోనే ప్రవర్తన శైలి కూడా భాగం కాబట్టి.. ఏ రాశి వారు ఎక్కువగా భాగస్వామిని మోసం చేస్తారు. దాని వెనుక ఎలాంటి కారణాలు ఉంటాయి అన్న విషయాలను కూడా వారి రాశులను బట్టి తెలుసుకోవచ్చట. మరి, ఏ రాశి వారు మోసం చేసేందుకు ఎలాంటి కారణాలు ఉంటాయంటే..

    Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి శుభవార్త.. అన్నింటా విజయమే..


    మేషం:
    మేష రాశి వారు ఏదైనా పని చేసే ముందు పెద్దగా ఆలోచించరు. మనసుకు అనిపించింది అలా చేసుకుంటూ పోతారు. అందుకే వీరు ఆలోచించకుండా తమ భాగస్వామిని మోసం చేసేస్తారు. క్యాజువల్ రిలేషన్ షిప్స్ కోసం కూడా భాగస్వామిని చీట్ చేసేందుకు వీళ్లు వెనుకాడరు.

    వృషభం:
    సాధారణంగా ఈ రాశి వారు భాగస్వామికి చాలా నమ్మకంగా ఉంటారు. వారితో ఆనందమైన జీవితాన్ని కూడా గడుపుతారు. కానీ తమ జీవితంలో అన్ని చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని భావించే వీరు ఆలోచనా ధోరణి ఒక్కోసారి వీరిని భాగస్వామిని మోసం చేసి వేరే వ్యక్తితో బంధాన్ని మొదలు పెట్టేలా చేస్తుంది.

    Zodiac signs: ఈ రాశులు విషపూరితం... స్వార్థంతో నిండిన మనస్తత్వం


    మిథునం:
    మిథున రాశి వారు తమ భాగస్వామితో చాలా కొద్ది రోజులకే బోరింగ్ గా ఫీలవుతారు. వీరికి జీవితంలో ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి అనిపిస్తుంటుంది. అందుకే వీరు భాగస్వామిని మోసం చేస్తారు. అయితే వీరు క్యాజువల్ రిలేషన్ షిప్స్ పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. తమ భాగస్వామికి బదులుగా వారిని జీవితంలోకి తీసుకురావాలని భావించరు.

    కర్కాటకం:
    సాధారణంగా ఈ రాశి వారు చాలా సున్నిత మనస్కులు. జాలి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. తమ బంధానికి కట్టుబడి ఉంటారు. కానీ తమ భాగస్వామికి తమకు మధ్య గొడవలు జరిగినప్పుడు అవతలి వారు తమని మోసం చేశారన్న బాధను తగ్గించుకోవడానికి వీరు మోసం చేస్తారు.

    సింహం:
    సింహ రాశి వారికి ఎదుటివారు తమపై ఆసక్తి చూపించడం, తమని పొగడడం, తమని చాలా ముఖ్యమైన వ్యక్తిగా భావించడం అంటే చాలా ఇష్టం. ఒకవేళ భాగస్వామి నుంచి అలాంటివి లభించకపోతే వారు భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉంటుంది.

    కన్య:
    సాధారణంగా కన్యా రాశి వారు తమ భాగస్వామికి నమ్మకంగానే వ్యవహరిస్తారు. కానీ వీరికి ప్రతి విషయంలో పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ తమ భాగస్వామి అలాంటి వ్యక్తి కాకపోతే అలాంటి వ్యక్తులు తారసపడినప్పుడు వీరు భాగస్వామిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

    తుల:
    తులా రాశి వారికి తమను ఎక్కువ మంది ప్రేమించడం అంటే ఇష్టం. వారికి చాలా ఎక్కువ ప్రేమ దక్కాలని కోరుకుంటారు. తమ బంధంలో అలాంటి ప్రేమ దక్కనప్పుడు వారు ఇతరుల వైపు ఆకర్షితులవుతారు.

    వృశ్చికం:
    ఈ రాశి వారు చాలా గమనించిన తర్వాతే ఎవరికైనా తమ జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని అందిస్తారు. కానీ అలా అందించిన స్థానానికి మీరు న్యాయం చేయకపోవడం.. ఇతరుల ఆకర్షణలో పడి వారిని మోసం చేయడం చేస్తే మీపై పైచేయి సాధించేందుకు వారూ మిమ్మల్ని మోసం చేస్తారు.

    ధనస్సు:
    ధనూ రాశి వారు సాహసాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తమ మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్తుంటారు. ఇలాంటి వారు అంత తొందరగా ఒక వ్యక్తిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం చేయలేరు. ఒకవేళ చేసినా భాగస్వామిని మోసం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఎప్పటికప్పుడు జీవితంలో కొత్తదనం కోసం కోరుకుంటూ క్యాజువల్ రిలేషన్ షిప్స్ ని కొనసాగిస్తారు.

    మకరం:
    మకర రాశి వారు చాలా ఇండిపెండెంట్. జీవితంలో చాలా విలువలు కలిగిన వ్యక్తులు వీరు. వీరిని పెళ్లాడితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. అయితే తమ భాగస్వామి తమ జీవిత లక్ష్యాలకు.. తాము అనుకున్న జీవితానికి సెట్ కావట్లేదని భావిస్తే మాత్రం వీరు మరో వ్యక్తితో బంధాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు.

    కుంభం:
    కుంభ రాశి వారు తమ భాగస్వామిని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. చాలా బాగా చూసుకుంటారు. కానీ వారి భాగస్వామి వారిని అర్థం చేసుకోకపోవడం లేదా ఆ ప్రేమని తిరిగి చూపించకపోయినా వీళ్లు మరో వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం గురించి ఆలోచిస్తారు.

    మీనం:
    ఈ రాశి వారు చాలా కరుణ, ప్రేమ కలిగి ఉంటారు. తమ భాగస్వామిని ప్రేమిస్తారు. అయితే భాగస్వామి నుంచి అదే ప్రేమ దక్కకుండా వేరే వ్యక్తి నుంచి అలాంటి ప్రేమ లభిస్తే వారి నుంచి దూరమై ఆ మరో వ్యక్తితో బంధాన్ని కొనసాగించేందుకు వీరు సిద్ధంగా ఉంటారు.
    Published by:Veera Babu
    First published: