హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Zodiac Signs: కొత్త ఏడాది ఈ రాశుల వారికి కలిసొస్తుంది.. మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి

Zodiac Signs: కొత్త ఏడాది ఈ రాశుల వారికి కలిసొస్తుంది.. మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయడం ఎవరికైనా కష్టమే అయినప్పటికీ, వారి రాశిచక్ర గుర్తుల(Zodiac signs)ను బట్టి కొంతమేర అంచనా వేయవచ్చని జ్యోతిష్కులు(astrologers) చెబుతున్నారు. వారి ప్రకారం 2021 ఏఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

2020 సంవత్సరం కరోనా (Corona)మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అల్లకల్లోలంగా మరిపోయింది. దీని కారణంగా చాలా మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక, అనేక మంది జీవితం అస్తవ్యస్తమైంది. ఈ ఏడాదంతా ప్రతి ఒక్కరి జీవితంలో పెను విషాదాన్నే మిగిల్చింది. ఇక మరికొద్ది రోజుల్లోనే 2020కి వీడ్కోలు చెప్పి 2021 కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. వచ్చే నూతన ఏడాదిలోనైనా కరోనా వైరస్ నుంచి తప్పించుకుంటామా? కరోనా పూర్తిగా కనుమరుగవుతుందా? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి. రాబోయే నూతన సంవత్సరమైనా తమకు కలిసి రావాలని అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయడం ఎవరికైనా కష్టమే అయినప్పటికీ, వారి రాశిచక్ర గుర్తుల(Zodiac signs)ను బట్టి కొంతమేర అంచనా వేయవచ్చని జ్యోతిష్కులు(astrologers) చెబుతున్నారు. వారి ప్రకారం 2021 ఏఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి(Aries) వారికి 2021 ఏడాది గొప్ప సంవత్సరంగా మిగులుతుంది. ఎందుకంటే, నూతన ఏడాదిలో వీరికి పెద్దగా సమస్యలు రావు. అంతేకాక, ఈ రాశి వారు మరింత సమర్థవంతంగా, సృజనాత్మకంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది. మేష రాశి వారికి ఈ ఏడాది అధిక విజయాలు అందుకునే అవకాశం లభిస్తుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి(Taurus) వారికి 2021 ఏడాది బాగా కలిసి వస్తుంది. ఇది వారిని ఒక వ్యక్తిగా తమను తాము నిర్మించుకునే సంవత్సరంగా మారుతుంది. అంతేకాక, ఇది వారి లక్ష్యాలు, ఆశయాలకు దగ్గరగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ ఏడాదిలో వీరికి సంతోషం, ప్రశాంతత దక్కుతుంది. వారు నిరంతరం ఉత్సాహంగా పనిచేసేలా, వారి శక్తి సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చేస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం

లిబ్రా (Libra)

లిబ్రా రాశి(Libra)కి చెందిన వారు వారి వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం, వారు మరింత శ్రద్ధగా, ఉత్పాదకంగా పనిచేస్తే ప్రమోషన్ పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, వారు తమ శక్తిని విశ్వసించాల్సి ఉంటుంది. జీవితంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోవటానికి ఇతరులపై ఆధారపడకూడదు. ప్రేమ లేదా వివాహం పరంగా ఈ రాశి వారికి ఇది విజయవంతమైన సంవత్సరం అవుతుంది.

స్కార్పియో (Scorpio)

స్కార్పియో రాశి(Scorpio) వారు 2020లో అనుభవించిన దానికి భిన్నంగా 2021లో ఉత్తమంగా రాణించగలుగుతారు. ఈ రాశి వారికి తమ జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. అయితే, నిర్ణయం తీసుకునే సందర్భంలో ఎటువంటి ఆందోళన చెందకుండా వారిపై నమ్మకంతో వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తిపరంగా కూడా ఈ ఏడాది ఈ రాశి వారికి బాగా కలిసొస్తుంది.

క్యాన్సర్ (Cancer)

క్యాన్సర్ రాశి (Cancer) వారు ఈ ఏడాది తీసుకునే నిర్ణయాలు బాగా కలిసొస్తాయి. వీరు తమ ఆలోచనల్లో పరిణతి కనబర్చి, తెలివైనవారు అవుతారు. తద్వారా ఏదైనా చెడు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. లక్ష్యాలను సాధించే క్రమంలో దృఢత్వం, బలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకుంటారు. వీరు వ్యక్తిగత జీవితంలో ఆలోచించి తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం వీరికి మంచే చేస్తుంది.

First published:

Tags: Astrology, Cancer

ఉత్తమ కథలు