Horoscope 20-7-2021: నేటి రాశి ఫలాలు... ఆ రాశి వాళ్లకు మంచి కాలం.. వీళ్లు మాత్రం డబ్బులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు..

Horoscope: నేటి రాశి ఫలాలు

Horoscope today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి. మంచి జరిగే అవకాశం ఉంటే... ఆనందమే. అదే చెడు జరిగే అవకాశం ఉంటే... అప్రమత్తం అవ్వాలి. మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్‌గా ఉండాలి. అలా మనల్ని అప్రమత్తం చెయ్యడంలో రాశిఫలాలు ఉపయోగపడతాయి. మరి 20-7-2021 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో చూడండి.

 • Share this:
  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఉద్యోగంలో మీ శ్రమ ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారపరంగా లాభపడతారు. ఆకస్మిక ధనయోగముంది. చాలా కాలంగా పట్టి పీడిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యానికి డోకా లేదు. శత్రు దోషం పోతుంది. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు.

  వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలతో ఆదాయం పెంచుకుంటారు. ఇంట్లో శుభ కార్యానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికంగా పరవాలేదు.

  మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేకపోయినా పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  మీ ప్రతిభాపాటవాలకు తగిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. చదువులో చక్కని విజయం సాధిస్తారు. పట్టుదలతో అనుకున్నవి చేజిక్కించుకుంటారు. రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అత్యుత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఉన్నత స్థితికి అవకాశం ఉంది. అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

  తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఉంటాయి. సహోద్యోగులు ఇబ్బందులు కలిగిస్తారు. సమయానుకూలమైన నిర్ణయాలతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మిత్రుల సలహాలను పాటించండి. కలహాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
  ఆర్థిక సంబంధమైన విషయాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. అందరినీ కలుపుకునిపోయే తత్వం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి. బంధుమిత్రులతో అపోహలు తలెత్తే సూచనలున్నాయి.

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  మంచి కాలం నడుస్తోంది. మీ నిర్ణయాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. కొత్త సంస్థ నుంచి ఆఫర్లు వస్తాయి. రావనుకున్న బాకీలు వసూలవుతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని కొద్దిగా కూడా నిర్లక్ష్యం చేయవద్దు.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ శక్తికి మించి ఇతరులకు సహాయపడతారు. ఉద్యోగపరంగా కష్టపడాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సలహాలు కలిసి వస్తాయి. ధన యోగం ఉంది. శుభవార్తలు వింటారు. సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఆర్థికంగా బాగుంది. ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఓర్పు, సహనాలతో వ్యవహరించి కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ శ్రమకు తగ్గ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
  అన్ని విధాలా అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. తల పెట్టిన ప్రతి పనీ పూర్తి చేస్తారు. ఆటంకాలు, వ్యతిరేకతలను అధిగమిస్తారు. కుటుంబపరంగా ఎంతగానో కలిసి వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు ఆదాయం గడించేందుకు అవకాశం ఉంది.
  Published by:Sambasiva Reddy
  First published: