Home /News /astrology /

ప్రపంచంలో ఈ రెండు రాశుల జంటలే.. ది బెస్ట్‌ అంటా..! కానీ, ఈ రాశులు మాత్రం..

ప్రపంచంలో ఈ రెండు రాశుల జంటలే.. ది బెస్ట్‌ అంటా..! కానీ, ఈ రాశులు మాత్రం..

Horoscope:రాశిఫలాలు

Horoscope:రాశిఫలాలు

ఈ రెండు రాశులవారు ఎంతో ప్రేమను ఒకరినొకరు పంచుకుని, ఇతర రాశుల కంటే చాలా గట్టిం బంధం కలిగినవారు.

రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు తగాదాలు, వాదనలు సాధారణం. ఒక్కరిని మరొకరు అర్థం చేసుకుని అప్యాయంగా హత్తుకుపోయేది కేవలం బలమైన జంటలకు మాత్రమే ఉండే లక్షణం. వారు ఒకరి లోపాలను ఎత్తిచూపరు. ౖపైగా వారికి మద్ధతు, గౌరవం ఇస్తారు. ఈ లక్షణాలను జోతిషశాస్త్ర రాశులతో గుర్తించవచ్చు. ఉత్తమ ప్రేమికులుగా పరిగణించే అగ్ర రాశిచక్ర గుర్తులు ఏంటో తెలుసుకుందాం.

కర్కాటకం–తులా రాశి..
ఈ రెండు రాశులవారు మంచి ప్రేమికులు. ముఖ్యంగా కర్కాటక రాశివారు సున్నితమైన మనస్సు కలవారు. ఎమోష్‌నల్‌గా ఉంటారు. మరోవైపు తులారాశి వారు భావోద్వేగం, రొమాన్స్‌ రెండూ కలగలిపి ఉంటారు. వీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వీరిలో ఉండే స్థిరమైన, నిబద్ధత కలిగిన సంబం«ధం, కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశం ఉంటుంది.

మేషం–మిథునం..
ఈ రెండు రాశుల క్యారక్టర్స్‌ ఒకేవిధంగా ఉంటాయి. కానీ, ఒకరికి మరొకరు వ్యతిరేకంగా ఉండే మనస్తత్వం కలిగి ఉంటారు. మేషరాశి వారిలో ఉండే మనోహరమైన వ్యక్తిత్వం మిథునరాశిని ప్రతిఒక్కరితో సామాజికంగా ఉండేలా ప్రేరేపిస్తుంది. ఈ రెండు రాశులవారు కొత్త అనుభూతులను పూర్తిగా ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు కలిసి చేసే పనులను థ్రిల్‌గా ఫీల్‌ అవుతారు. వారు ఒకరినొకరు బాగా బెరీజు చేసుకుంటారు. అందుకే వీరి మధ్యంలో ఎటువంటి మనస్పర్థాలకు ఆస్కారం ఉండదు.

సింహాం– ధనస్సు రాశి..
ఈ రాశులవారికి కాస్త గర్వం ఉంటుంది. బలమైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఘర్షణ పడవచ్చు, కానీ, ఇది బలమైన బంధానికి దారితీస్తుంది. వారు తమలో తాము ఉత్తమ వెర్షన్‌గా ప్రేరెపిస్తారు. ఒకరినొకరు చాలా లోతుగా ప్రేమించుకుంటారు.

వృషభం– కన్యారాశి..
ఈ రాశులవారికి తమ జీవితగమ్యం పై స్పష్టత ఉంటుంది. వారు పనులు సక్రమంగా చేస్తూ లక్ష్యసాధనకు పరితపిస్తారు. వారు, ఒకరినొకరు ఇష్టపూర్వకంగా సంతోషంగా జీవితాన్ని గడపడానికి.. సౌకర్యవంతం, విలాసవంతమైన జీవనశైలిని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ ఉమ్మడి లక్ష్యం తమను గతంలో కంటే మరింత చేరువ చేస్తుంది. ప్రేమను పెంచుతుంది.

కుంభం– మకరరాశి..
ఈ రెండు రాశుల వారు సృజనాత్మక, ఆదర్శ భాగస్వాములు. ఎందుకంటే వీరిద్దరూ ఒకరిపై మరొకరి ప్రేమ అర్థవంతంగా ఉంటుంది. అద్భుతౖమైన ఆలోచనలు చేస్తూ, జీవితంలో ముందుకు వెళ్తుంటారు.అందుకే వీరు త్వరలో గొప్పలక్ష్యాలను చేరుకుంటారు. వీళ్లు ఏదైనా సాధించగలరు. ఒకరికొకరు నమ్మకాలు, విలువలను పంచుకుంటారు. ఇది ప్రతి జంట బలంగా ఉండటానికి సహాయపడేది. అందుకే వీరు ఎళ్లవేళలా కలిసి ఉంటారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Cancer, Love affair, Zodiac sign

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు