THESE ZODIAC SIGN PEOPLE GOT MORE EXPENCES TODAY AND CHANCES FOR CHANGE THE RENTED HOUSE SSR
Today Horoscope:ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి.. అద్దె ఇల్లు మారాల్సిన పరిస్థితి వస్తుంది..
ప్రతీకాత్మక చిత్రం
Today Horoscope: నేడు సోమవారం (డిసెంబర్ 20).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు.. కొందరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు శుభవార్తలు వింటారు.. కోరిక కోరికలు నెరవేరుతాయి. ఓ వ్యక్తిగత సమస్య నుంచి బయట పడతారు. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలసుకుందాం.
మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం జాగ్రత్త వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. బంధుమిత్రులు సహాయమందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.
వృషభం (Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సంతానం పురోగతి సాధిస్తారు. ఖర్చు తగ్గించుకోవాలి.
మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు శ్రమ మీద సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. వాగ్వాదాలకు, విభేదాలకు అవకాశం ఉంది.
కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే, అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, వ్యాపారాల వారు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
సింహం ( Leo): (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి నిపుణులు బాగా రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.
కన్య (kanya): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పొదుపు మార్గం అనుసరిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. బంధువులతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు మాత్రం అదుపు తప్పుతాయి. మధ్య మధ్య వైద్య ఖర్చులు కూడా చేరతాయి. బంధువులు, స్నేహితులు కొందరు మీకు శత్రువులుగా మారతారు. ఉద్యోగం చికాకు కలిగిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో ప్రతిష్ఠ పెరుగుతుంది.
వృశ్చికం (Scorpio ) : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో ఉన్నా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. పెళ్లి సంబంధం ఒక పట్టాన కలిసి రాదు. దూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం పరవాలేదు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. అద్దె ఇళ్లవారు ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి సంబంధం నానుతూ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1, 2)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. తిప్పట ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేపడతారు. వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. డబ్బు నష్టపోతారు.
కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో బాగా శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది.
మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం వారు ఓకే చెబుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.