Home /News /astrology /

THESE ZODIAC SIGN PEOPLE BE AWARE OF ACCIDENTS AND TAKE CARE OF YOUR HEALTH SSR

Horoscope Today: ఇవాళ ఈ రాశి వారు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.. అంతేకాదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు సోమవారం. ఇవాళ ఏ రాశి వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? మీనం నుంచి మేషం వరకు దిన ఫలాలు ఇక్కడ తెలుసుకుందాం.

    మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)
    ఆర్థికంగా అనుకూల సమయం. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఆరోగ్యానికి ఢాకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు సునాయాసంగా లాభాలు ఆర్జిస్తారు.

    వృషభం (Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని సమస్య ఎదురవుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో శుభవార్త వింటారు. మిత్రులు సహాయపడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

    మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. అవసరమైన సహాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రశంసలు అందుకుంటారు. అంతరంగిక విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

    కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    వృత్తి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు కలసి వస్తాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది.

    సింహం ( Leo): (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా ముందుకు సాగిపోతాయి. స్వయంకృషితో మంచి పేరు తెచ్చుకుంటారు. సంపద పెంచుకునే ఆలోచన చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడిని తట్టుకుని సత్ఫలితాలు సాధిస్తారు. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం.

    కన్య (kanya): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    వృత్తి ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ప్రతి విషయాన్నీ కుటుంబ సభ్యులతో చర్చించి. వివా సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ధన లాభానికి అవకాశం ఉంది. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండండి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

    తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. ఇంటా బయటా మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

    వృశ్చికం (Scorpio ) : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    శక్తి వంచన లేకుండా కృషి చేసి పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. దగ్గరి బంధువులకు మీ వల్ల మేలు జరుగుతుంది. అనుకోని విధం గా కొద్దిగా డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు.

    ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    మంచి జీవితం కోసం మార్గాలు ఆలోచిస్తారు. అనుకున్న పనులు శ్రమ మీద పూర్తవుతాయి. బంధు మిత్రుల రాకపోకలు ఉంటాయి. ఆదాయం పరవాలేదు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు నష్టం జరగవచ్చు. ఆరోగ్యం పరవాలేదు.

    మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1, 2)
    ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కృషి సత్ఫలితాలనిస్తుంది. ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆరోగ్యం బాగుంటుంది. గృహ ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

    కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి.

    మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    ఉద్యోగ పరంగా మంచి సమయం. వ్యాపారంలో శ్రమ పెరిగినా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. శుభవార్తలు వింటారు. మిత్రులకు మీ వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Astrology, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    తదుపరి వార్తలు