THESE INDICATIONS SAYS WHO GET MONEY AND GOOD LUCK IN COMING DAYS NGS
Good Luck Sign: ఈ సూచనలు ముందే మీకు కనిపిస్తున్నాయా..? త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం
Good Luck Sign: డబ్బులు సంపాదించడం అందరి కోరిక.. బాగా ఆదాయం రావాలని.. సుఖ:వంతమైన జీవితం లీడ్ చేయాలని అంతా ఆశిస్తారు.. కొందరు కలలు కంటూ ఉంటారు.. అయితే అలా ఆదాయం పెంచుకోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. అయితే ధనం బాగా నిలవాలి అంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి..
Good Luck Sign: వర్షం పడే ముందు వాతావరణం చల్లబడుతుంది.. భారీ వర్షం పడే ముందు మేఘాలు గర్జిస్తాయి. ఇలా ముందే మనకు కొన్ని సూచనలు అందిస్తాయి. అలగే జీవితంలో శుభం జరిగే ముందు.. ధన లాభం కలిగే ముందు కొన్ని ముందే సూచిస్తాయి. అవి ఏంటో తెలుసా.?
Good Luck Sign: డబ్బులు సంపాదించడం అందరి కోరిక.. బాగా ఆదాయం రావాలని.. సుఖ:వంతమైన జీవితం లీడ్ చేయాలని అంతా ఆశిస్తారు.. కొందరు కలలు కంటూ ఉంటారు.. అయితే అలా ఆదాయం పెంచుకోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. అయితే ధనం బాగా నిలవాలి అంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి..
సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి దయ ఉంటే ఆ మనిషి ధనవంతుడు కావడానికి పెద్ద కష్ట పడాల్సిన పని ఉండదు. అలాగే వాస్తు శాస్త్రంలో (Vastu Shastra) అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి. ఈ సంకేతాలను ముందే గమనిస్తే.. సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఉంటుంది. ధనాన్ని పొందే శుభ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.
ముఖ్యంగా చాలామంది ఇళ్లలో బల్లులు ఉంటాయి. అయితే బల్లులంటే చాలా మందికి భయం ఉంటుంది.. కానీ ఒకే గదిలో 3 బల్లులు కలిసి కనిపిస్తే.. మాత్రం అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం. అలా మూడు బల్లులు ఒకే దగ్గర ఉన్నట్టు మీకు కనిపిస్తే.. త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది.
ఇంట్లో నల్ల చీమలు కనిపించడం కూడా చాలా శ్రేయస్కరం. ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే, అది లాభాలకు సంకేతం. అయితే రెండు మూడు నల్ల చీమలు కాకుండా.. ఒకేసారి గుంపుగా ఇలా నల్ల చీమలు కనిపిస్తే చాలా శుభసూచికం.. ముఖ్యంగా ఇంటి పెద్ద పురోగతి చెందుతారు.
ఒక పక్షి ఇంటి పైకప్పు, బాల్కనీ లేదా ప్రాంగణంలో గూడు పెట్టినా అధి శుభమే. అలా జరిగిఆ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. అలాగే పురుషుల కుడి అరచేతిలో దురద వేయడం లేదా..? స్త్రీల ఎడమ అరచేతిలో దురద ఐశ్వర్యాన్ని తెస్తుంది అంటారు. అరచేతిలో ఎక్కువసేపు దురద ఉంటే, మీరు చాలా డబ్బు పొంతుదారని సూచిస్తుంది.
అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపిస్తే చాలా శుభప్రదం. ఇది పని, గౌరవం, డబ్బులో విజయాన్ని తెస్తుంది. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటితో నిండిన కాడను చూడటం, ఆవు దూడకు ఆహారం ఇవ్వడం కూడా శుభాన్ని కలిగిస్తుంది.
ఎవరికైతే లక్షీ అనుగ్రహం ఉంటుందో.. ముందే వారికి ఇలాంటి శుభ సూచకాలు కనిపిస్తాయని చెబుతారు.. వీటిల్లో ఎవరైనా తరచుగా మీకు దర్శనం ఇస్తుంటే.. కచ్చితంగా త్వరలో మీకు మంచి రోజులు వస్తున్నట్టే..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.