2023: వివాహ యోగం ఎవరికి..?
జనవరి 18న శని కుంభ రాశిలోకి, ఏప్రిల్ 23వ తేదీన గురువు మేషరాశిలోకి మారుతున్నారు. ఇక అక్టోబర్ 24న రాహువు మీన రాశిలోకి, కేతువు కన్యారాశిలోకి మారడం జరుగుతోంది. ఈ గ్రహాల కారణంగా రాశిలో మార్పు సాధారణంగా పెళ్లిళ్ల మీద కూడా పడుతుంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన వివాహ ప్రయత్నాలు ఈ కొత్త సంవత్సరంలో ఏ రాశులవారికి సానుకూలపడబోతున్నాయి? పెద్దలు కుదర్చిన వివాహాలు, ప్రేమ వివాహాలు ఎలా ఉండబోతున్నాయి? ఏవి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది? వివాహం జరిగితే ఎవరితో వివాహం జరుగుతుంది? ఇటువంటి రాశులచక్రాల్లో నే కాకుండా ప్రస్తుత గ్రహ స్థితులను బట్టి కూడా సమాధానాలు లభ్యమవుతాయి.
శని ప్రభావం.. సాధారణంగా శనిని తలచుకుంటే భయం వేస్తుంది కానీ, నిజానికి శని వల్ల ఉపయోగాలే ఎక్కువగాఉంటాయి. శని ప్రతిదానినీ ఒక పద్దతి ప్రకారం ముందుకు నడిపిస్తాడు. రుజు మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా ప్రేమలు, పెళ్లిళ్లు ఆచారాలు, సంప్రదాయాల్లో ఒక టీచర్ మాదిరిగా వ్యవరిస్తాడు.
శని సంచారం వల్ల ఏర్పడే ఏలిన్నాటి (ఏడున్నర ఏళ్లు శని, అష్టమ శని, అర్జాష్టమ శని వంటివి ప్రారంభమైనప్పుడు కూడా ఈ [గ్రహం పెళ్లి యోగం పట్టిస్తుంటుంది.
శని, గురు గ్రహాల ప్రభావం వల్ల ఈ ఏడాది పలువురి జీవితాల్లో వివాహపరంగా తప్పుకుండా మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. శని వల్ల ఏదైనా ఆలస్యం అవుతుందే కానీ, అసలు జరగకుండా మాత్రం పోదు. గురు గ్రహం శుభకార్యాలు జరిపిస్తుంది. ఈ రెండు (గ్రహాలను బట్టి ఈ ఏడాది ఏయే రాశుల వారికి వివాహ యోగం పడుతుందో అంచనా వేద్దాం.
మేషం, మిథునం, తుల, ధనుస్సు, మీనం
జనవరి 18 తర్వాత ఈ ఐదు రాశుల వారికి అతి తక్కువ ప్రయత్నంతో చక్కని పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వ్యక్తి జాతక చక్రం కూడా అనుకూలంగా ఉంటే, బహుశా ఫిబ్రవరి, మే నెలల మధ్య వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇందులో మేష రాశివారికి సాధారణంగా పెద్దలకు కుదిర్చిన వివాహం జరిగే సూచనలున్నాయి. సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరగవచ్చు. కొంచెం భారీగా ఖర్చ
అవుతుందని కూడా చెప్పవచ్చు. బాగా దగ్గర వారి నుంచి కానీ, బాగా తెలిసినవారి నుంచి కానీ సంబంధం రావచ్చు. ప్రేమ వివాహాలు సైతం పెద్దల అంగీకారంతోనే జరుగుతాయి.
ఇక మిథున రాశి విషయానికి వస్తే.. ఈ రాశివారికి ఈ ఏడాది ఎక్కువగా ప్రేమ వివాహాలే అయ్యే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలే అయినప్పటికీ పెద్దల అంగీకారంతో, పెద్దల సమక్షంలోనే జరిగే సూచనలున్నాయి. బంధువర్గంలో, ముఖ్యంగా మేనరికం సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంది. పెల్లికి ముందు పెద్దల మధ్య కొద్దిగాభిన్నాభి[ప్రాయాలు, విభేదాలు చోటు చేసుకున్నా చివరికి అంతా ప్రశాంతంగానే ముగుస్తుంది.
తుల రాశి వారికి సంబంధించినంత వరకు.. ప్రేమ వ్యవహారాలు ఈ ఏడాది పెళ్లికి దారి తీయవచ్చు.ఇందులో ఒకరి వైపు బంధువులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఒక పట్టాన నచ్చకపోవచ్చు. అయినప్పటికీ పెళ్లి మాత్రం ఆగదు. పెళ్లి వ్యవహారం పెద్దగా ఖర్చు లేకుండా జరిగిపోయే అవకాశం ఉంది. పెళ్లి జరిగిన తీరు కొద్దిగా అసంతృప్తి కలిగించే అవకాశం కూడా ఉంది. ఒక వేళ పెద్దలు కుదర్చిన పెళ్లి సంబంధమైతే, బాగా పరిచయస్తులతోనో, సహోద్యోగులతోనో సంబంధం కుదరవచ్చు.విదేశీ సంబంధం కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ధనస్సు రాశివారి విషయానికి వస్తే వీరికి సంప్రదాయబద్ధంగా తప్ప మరే విధంగానూ వివాహం జరిగే అవకాశం లేదు. పెద్దలు కుదర్చిన వివాహ సంబ౦ధాలకే ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ప్రేమ వ్యవహారాలు ఉన్నా, అవి ఇరుపక్షం వారి అంగీకారంతోనే పెళ్లికి దారితీస్తాయి. పెళ్లి వ్యవహారం భారీ ఖర్చుతో కూడుకుని ఉంటుంది. మే నెల లోపల ఈ రాశి వారికి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీన రాళివారికి కూడా త్వరలో వివాహ యోగం పట్టబోతోంది. వివాహం సంప్రదాయబద్ధంగా, సింపుల్‌గా జరిగిపోతుంది. సాధారణంగా వీరి వివాహం పెద్దల అనుమతితోనే జరుగుతుంది. తెలిసిన సంబంధమే అవుతుంది. బంధువులు గానీ, స్నేహితులు గానీ కావచ్చు.
వృషభం, కర్కాటకం, సింహం, కన్య
శని, గురువుల రాశి మార్పులు ఈ రాశులకు కూడా వివాహ యోగం కలిగించబోతున్నాయి. అయితే,ఈ రాశుల వారికి ఈ ఏడాదే కొద్దిగా ఆలస్యంగా, గట్టి ప్రయత్నాల అనంతరం వివాహం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా అక్టోబర్ తర్యాత వివాహం జరిగే సూచనలున్నాయి. ఇందులో వృషభ రాశి
వారికి ఉద్యోగ స్థానంలో ఉన్నవారితో లేక సహచరులతో వివాహమయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్రేమ వివాహం కాకపోవచ్చు. ప్రేమల్లో ఉన్నవారు ఈ ఏడాది వెళ్లేదరకూ ఆగడం మంచిదనిపిస్తోంది.
కర్కాటక రాశివారికి.. జూలై తర్వాత మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వీరికి జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు. సాధారణంగా పెద్దలు కుదర్భిన పెళ్తే అవుతుంది. ప్రేమలో ఉన్నవారు కొద్ది కాలం నిరీక్షించడం మంచిది. ఈ ఏడాది వీరికి ప్రేమలు పెళ్లికి దారితీయకపోవచ్చు.సింహ రాశివారికి ఈ ఏడాది అక్టోబర్ తర్వాత పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ లోపల జరగడానికి కూడా కొద్దిగా అవకాశం ఉంది కానీ, ఆ వివాహం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఎక్కువగా ప్రేమ వివాహానికి వీలుంది. కన్యా రాశివారికి కూడా అక్టోబర్ తర్వాతే వివాహ యోగ సూచనలున్నాయి.ప్రేమ వ్యవహారాలు కూడా ఏమంత సంతృప్తికరంగా ముందుకు సాగకపోవచ్చు. పరిచయస్తులతోసంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం, మకరం, కుంభం
ఈ మూడు రాశులవారికి ఈ ఏడాదికి వివాహం జరిగే అవకాశం లేదు. వ్యక్తిగత జాతకాల్లో వివాహానికి సమయం అసన్నమై ఉంటే తప్ప ఈ సంవత్సరంలో వివాహ యోగం లేదనే చెప్పాలి. వృశ్చిక రాశివారు ఈ ఏడాది వివాహ ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది, ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు లేవనే చెప్పాలి.
ప్రేమ వ్యవహారాల్లో కూడా అతి జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. అతి కష్టంమీద, ఎంతో ప్రయత్నం మీద మకర రాశి వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక కుంభరాశి వారికి (పేమ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కాస్తంత ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయి. మరికొంత కాలం ఆగడమే మంచిదని చెప్పవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Horoscope, Monthly Horoscope