Home /News /astrology /

Navaratri 2021: నవరాత్రుల్లో ఈ 5 దుర్గామాత ఆలయాలని దర్శిస్తే.. అశేష లాభాలు!

Navaratri 2021: నవరాత్రుల్లో ఈ 5 దుర్గామాత ఆలయాలని దర్శిస్తే.. అశేష లాభాలు!

Durga temples: నవరాత్రులు కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న మా దుర్గా ఆలయాలను దర్శించుకున్నవారికి అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి.

Durga temples: నవరాత్రులు కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న మా దుర్గా ఆలయాలను దర్శించుకున్నవారికి అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి.

Durga temples: నవరాత్రులు కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న మా దుర్గా ఆలయాలను దర్శించుకున్నవారికి అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి.

Navaratri నవరాత్రుల్లో పెద్ద సంఖ్యలో  భక్తులు కూడా దుర్గామాత Durga mata  ప్రధాన ఆలయాలను దర్శించుకుంటారు. మీరు కూడా దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులవ్వండి. ఆ దేవాలయాలు ఏవో తెలుసుకుందాం.

నవరాత్రుల్లో 9 రోజలు పాటు పవిత్రమైన పూజలు చేస్తారు. ప్రతిరోజు అమ్మవారికి ఒక్కోరూపంలో అలంకరిస్తారు. 9 రోజులపాటు 9 రంగుల వస్త్రాలు ,నైవేధ్యాలు అందిస్తారు. అమ్మ ప్రసన్నమై భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తుంది. వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. మా దుర్గా మాత కొలువుదీరిన 5 ఆలయాలు ప్రత్యేకమైనవి. ఆలయాలకు వెళ్లినపుడు కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించండి.

కామాక్షి శక్తిపీఠం, గౌహతి అసోం..
కామాక్షి శక్తిపీఠం గౌహతికి పశ్చిమాన 8 కీ.మీ దూరంలో నీలాంచల్‌ పర్వతంపై ఉంది. కామాక్షి శక్తిపీఠం అమ్మవారి శక్తిపీఠాల్లో ఉత్తమమైంది.

ఇది కూడా చదవండి: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే .. ప్రశాంతతకు కొదవుండదు!


నైనా దేవి ఆలయం, నైనిటాల్‌..
నైనాదేవి ఆలయం నైనిటాల్‌లోని నాయిని సరస్సు ఉత్తర ఒడ్డున ఉంటుంది. ఈ దేవాలయం 1880లో కొండచరియలు విరిగిపడినాయి. ఆ తర్వాత పునర్నిర్మించారు. ఇక్కడ సతి శక్తిరూపాన్ని పూజిస్తారు. ఈ దేవాలయానికి నైనా దేవిని సూచించే రెండు కళ్లు ఉంటాయి.

జ్వాలా దేవి ఆలయం, హిమాచల్‌ ప్రదేశ్‌..
ఈ ఆలయం హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో కాళీధర్‌ కొండల మధ్య ఉంది. మా జ్వాలా దేవి ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటి. తల్లి సతి శరీర భాగాలు పడిన ప్రదేశం అంటారు. గ్రంథాల ప్రకారం సతి నాలుక ఈ ప్రాంతంలోనే పడింది.

ఇది కూడా చదవండి: మహాశక్తి.. నాగ్‌పూర్‌ దుర్గాదేవి మందిరం!


కర్ణిమాత ఆలయం, రాజస్థాన్‌..
మన దేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు అనేకం ఉన్నాయి. మళ్లీ సందర్శించాలనిపించే ఆలయం రాజస్థాన్‌లో ఉంది. ఇది రాజస్థాన్‌లోని బికనీర్‌ నుంచి 30 కీ.మీ దూరంలో ఉంది. జో«ద్‌పూర్‌ రోడ్డులోని దేశ్‌నోక్‌ గ్రామం సరిహద్దులో ఉంది. ఇది మా కర్ణి దేవి ఆలయం. ఇది కూడా యాత్రాస్థలం. కానీ, మన దేశంతోపాటు ఇతర దేశస్థులు కూడా ఎలుక దేవాలయం అని కూడా పిలుస్తారు.

దక్షిణేశ్వర్‌ కాళీ ఆలయం, కోల్‌కతా..
కోల్‌కతాలోని మా దక్షిణేశ్వర్‌ కాళీ ఆలయం ఇక్కడ ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. దీని నిర్మాణం 1847లో నిర్మించారు. జాన్‌ బజార్‌కు చెందిన మహారాణి రసమణికి ఆలయం నిర్మించాలని ఒక కల వచ్చిందట. దీంతో తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేశారు. 1855లో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Durga temple, Dussehra 2021, Navaratri

తదుపరి వార్తలు