Home /News /astrology /

THESE COLOURS OF DOOR CURTAINS BRINGS GOOD LUCK TO THE HOUSE RNK

Colours of curtain: ఆర్థిక ఇబ్బందులు ఉంటే.. బెడ్‌రూమ్‌కు ఈ రంగు కర్టెన్‌ వాడండి!

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Colours of curtain: వాస్తు ప్రకారం ఈ రంగు కర్టెన్లు ప్రధానంగా పూజ గది, బెడ్‌రూం, స్టడీరూం, లివింగ్‌ రూంలలో కర్టెన్లు ఉపయోగించాలి.

వాస్తు (vastu shastra) మన నిత్య జీవితంలో ఏదో విధంగా మమేకమై ఉంటుంది.. వాస్తు ప్రకారం ఇంటి తలుపులు, కిటికీలకు వాలి. ఏ రంగు దేనిని నిర్ధేశిస్తుందో తెలుసుకుందాం.కర్టెన్లు మీ జీవితంలోని అనేక సమస్యలను తొలగిస్తాయి. వాస్తు ప్రకారం కర్టెన్‌ రంగు మీ భావోద్వేగాలు, మనస్సు, ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఈ కర్టెన్ల రంగులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే..మీకు కచ్ఛితంగా వాస్తు ప్రకారం ఇంట్లో కర్టెన్లు (curtains) వేసుకోవాలి. ఇది మాత్రమే కాదు. మీరు ఆర్థిక సంక్షోభం లేదా మెంటల్‌ స్ట్రెస్‌తో బాధపడుతున్నట్లయితే.. మీరు కర్టెన్‌ కలర్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం చాలా మంది జీవితంలో పరదా, గోడల రంగులు చాలా ముఖ్యమైనవి. ఇది ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీని తెస్తుంది. వాస్తు ప్రకరాం ఇంట్లో కర్టెన్ల రంగు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంటికి దక్షిణ దిశ (south direction) లో ఎరుపు రంగు కర్టెన్‌ ఉండటం కుటుంబ సభ్యుల్లో పరస్పర ప్రేమ పెరుగుతుంది. అదే సమయంలో ఇంట్లో శాంతి ఉంటుంది. నిజానికి ఎరుపు రంగు ధైర్యం, బలాన్ని సూచిస్తుంది.

భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుంటే, బెడ్‌రూంలో ఆరెంజ్ (orange), పింక్‌ లేదా బ్లూ కర్టెన్లు ఉంచాలి. వాస్తు ప్రకారం బెడ్‌రూంలో రెడ్‌ కర్టెన్‌లు ఏర్పాటు చేసుకోకూడదు. రెడ్‌ కలర్‌ చాలా శక్తిని విడుదల చేస్తాయి.
వాస్తు ప్రకారం మీ రిలేషన్‌షిప్‌లో ఏదైనా సమస్య ఉంటే.. మీరు కచ్ఛితంగా మీ బెడ్‌రూంలో నారింజ పరదాను ఉంచాలి. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది. దీంతో మీ వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి:  దీపావళి ఏ రోజు నిర్వహించనున్నారు? సమయం..

ఇంట్లో ప్రశాంతత లేకంటే, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే ఇంటికి ఉత్తరం వైపున ఉన్న గదిలో నీలిరంగు కర్టెన్‌ వేయాలి. ఈ రంగు మీ కలలను నెరవేరుస్తుంది. శ్రేయస్సు, సౌకర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఈ రంగు కర్టెన్లు ప్రధానంగా పూజ గది, బెడ్‌రూం, స్టడీరూం, లివింగ్‌ రూంలలో కర్టెన్లు ఉపయోగించాలి. ఈ రంగుల ప్రభావం వల్ల మనిషిలో శాంతి, సహనం అభివృద్ధి చెందుతాయి.
ఇంట్లో భక్తి పెరగడానికి పసుపు రంగు పరదాను పూజగదికి వేయాలి. వాస్తు ప్రకారం పసుపు రంగు జ్ఞానం, కాఠిన్యం, పోషణ, సహనం, ఆధ్యాత్మికతను సూచిస్తుంది.

ఇది కూడా చదవండి:  ఇంటి గోడలపై చీమల వరుస దేనికి సంకేతమో తెలుసా?

వాస్తు ప్రకారం అప్పుల బాధ ఎక్కువ ఉంటే ఉత్తరం వైపు నీలి రంగు కర్టెన్లు వేసుకోవాలి.
కష్టపడి పనిచేసిన తర్వాత కూడా మీ శ్రమకు తగిన ఫలాలు మీకు అందకపోతే, మీరు ఇంటి పడమర దిక్కులో తెల్లటి కర్టెన్‌ వేయాలి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలు తగ్గుతాయి.

వ్యాపారం, ఉద్యోగంలో నష్టాలు జరగకుండా ఇంటి తూర్పు దిశలో ఆకుపచ్చ రంగు కర్టెన్లు వేసుకోవాలి. వాస్తు ప్రకారం గ్రీన్‌ కలర్‌ పాజిటివ్‌ ఎనర్జీకి చిహ్నం. ఈ కలర్‌ హృదయాన్ని, మనస్సును సంతోషంగా ఉంచుతుంది. ఈ రంగు ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది. ఈ కర్టెన్‌ని స్టడీరూంలో పెట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది.

వాస్తు ప్రకారం వైట్‌ కలర్‌ శాంతిని ఇస్తుంది. మీ బెడ్‌రూం ఉత్తర–పశ్చిమ లేదా పడమర దిశలో ఉంటే.. క్రీం కలర్‌ లేదా వైట్‌ కలర్‌ కర్టెన్లు పెట్టుకోవచ్చు. మీరు గదిలో క్రీం లేదా వైట్‌ కర్టెన్లు కూడా ఉపయోగించుకోవచ్చు. నలుపు లేదా ముదురు రంగు కలర్‌లను ఎల్లప్పుడూ ఉపయోగించకూడదు.
Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు