హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Puja: పూజ సమయంలో ధూపం ఎందుకు వేయాలి? లేకపోతే, ఏమవుతుందో..

Puja: పూజ సమయంలో ధూపం ఎందుకు వేయాలి? లేకపోతే, ఏమవుతుందో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Benefits of dhoop: ధూపం స్టిక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే, ఇంట్లో కూడా సులభంగా వీటిని మనం తయారు చేసుకోవచ్చు

సాధారణంగా మనం పూజ చేసినప్పుడు ధూపం (dhoop) వేయడం సహజం. దీనికి వివిధ రకాల ధూప్ కడ్డీలను ఉపయోగిస్తాం. ఇది పూజకు చాలా ముఖ్యం. లేకపోతే ఆ పూజ (puja) అసంపూర్ణం అవుతుంది. దీన్ని వెలిగించిన ఇంట్లో ప్రతికూలత తొలగిపోయి.. సానుకూలత పెరుగుతుందని చెబుతారు. పూజ సమయంలో ఉపయోగించే ధూపం ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం.

ధూపాన్ని కాల్చినప్పుడు కీటకాలు వంటివి ఆ వాసన నుంచి దూరంగా పోతాయి. దీంతో ఆ ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది.

ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు..

పూజ సమయంలో అగరబత్తీలు వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి అక్కడ మనసు కూడా సంతోషంగా ఉంటుంది. అందుకే పూజ సమయంలో ధూపదీపాలను వెలిగించాలి.

ఇది కూడా చదవండి:  మీ మెదడుకు మేలు చేసే 5 రకాల ఫుడ్స్‌!

నెగిటివ్ ఎనర్జీ..

పూజ సమయంలో అగరబత్తీలు వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. శాస్త్రాల ప్రకారం ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది. అందుకే ధూపం కచ్ఛితంగా వెయాలి.

పూజ సమయంలో అగరబత్తీలు వెలిగించడం వల్ల దేవుడు ప్రసన్నమవవుతాడని నమ్ముతారు. గ్రంథాల ప్రకారం దేవతలకు ధూపం సువాసన చాలా ప్రీతికరమైంది. ఇది వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. వారి దయను కురిపిస్తుంది.

ఇది కూడా చదవండిశనిదేవుడికి నీలంరంగు పుష్పాలతో అర్చిస్తే.. అదృష్టం!


ఒత్తిడి తగ్గుదల..

మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధూపం స్టిక్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ధూపం వేయడం వల్ల మీకు ఒత్తిడి సమస్యలు తగ్గుతాయి.

సూర్యకాంతి వల్ల కూడా లాభాలు..

ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల శరీరంతోపాటు ఇల్లు శాంతియుతంగా అనిపిస్తుంది. దు:ఖాలు కూడా దూరమవుతాయి. ఇంట్లోని గొడవలు కూడా తీరిపోతాయి. ప్రమాద సంఘటనలు వంటివి చోటుచేసుకోవు. దీంతోపాటు ఇంట్లో ఏవైనా వాస్తుదోషాలు ఉంటే పోతాయి. సూర్యకాంతి వల్ల కూడా గ్రహాలు, రాశుల చెడు ప్రభావాలు కూడా తగ్గుతాయి.

ధూపం తయారీ..

ధూపం స్టిక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే, ఇంట్లో కూడా సులభంగా వీటిని మనం తయారు చేసుకోవచ్చు. దీనికి చందనం, జటామాసి, రాగం, బెల్లం, క్షౌద్రం వంటి వాటితో కూడా తయారు చేయవచ్చు.

First published:

Tags: SPIRUTUAL

ఉత్తమ కథలు