Home /News /astrology /

THESE ARE 7 BENEFITS OF ALUM THAT HELPS TO REMOVE NEGATIVE ENERGY RNK

Vastu benefits of Alum: పటికతో 7 మార్గాల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu shastra: వాస్తు శాస్త్రంలో, మన దైనందిత జీవితానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు వాస్తు దోషాన్ని తొలగించవచ్చు. ఈ రోజు మనం పటికకు సంబంధించిన కొన్ని వాస్తు నివారణలను తెలుసుకోబోతున్నాం.

వాస్తు శాస్త్రం( vastu shastra) లో, మన దైనందిత జీవితానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు వాస్తు దోషాన్ని తొలగించవచ్చు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి (financial condition) మెరుగుపడుతుంది. డబ్బు, లాభం మూలాలు పెరుగుతాయి. అదేవిధంగా, ఈ రోజు మనం పటికకు సంబంధించిన కొన్ని వాస్తు నివారణలను మీకు చెప్పబోతున్నాము, వీటిని ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆరోగ్యం, ఆదాయాన్ని మెరుగుపరచుకోవచ్చు. పటికలో (Alum) ఔషధ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కనిపిస్తాయి. మీరు దీన్ని ఉపయోగించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాస్తు దోషాలను తొలగించడంలో పటిక ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

1 పటికను ఒక గ్లాస్ బౌల్లో వేసి ఒక మూలన పెట్టాలి. దీన్ని అప్పుడప్పుడూ మారుస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు, ప్రతికూలతలు తొలగిపోతాయి.

2. మీ ఆదాయం దెబ్బతింటోంది, ఆదాయం తగ్గుతోంది, అప్పుల భారం పెరిగింది, ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి, ఇంట్లో పటికను నీటిలో కలిపి తుడవండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

ఇది కూడా చదవండి: అరచేతిలోని గీత మీ ఆర్థిక పరిస్థితి  ఎలా ఉంటుందో చెబుతుంది..


3. వ్యాపారం లేదా ఉద్యోగంలో పురోగతి ఉండకుండా.. ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయా?. నష్టపోయే పరిస్థితి ఏర్పడితే, నల్ల గుడ్డలో పటికను కట్టి, ప్రధాన తలుపు వద్ద వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. ప్రయోజనం పొందుతారు.

4. కుటుంబ సభ్యుల్లో ప్రతికూలత ఉంటే.. ఏదైనా విషయం గురించి భయం ఉంటే, దాన్ని నివారించడానికి, కిటికీలో ఒక గాజు గిన్నెలో పటిక ఉంచండి. ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండదు. ఆ ఇంట్లో భయం పోతుంది.

5. ఐశ్వర్యం కలగాలంటే పటిక నీటితో స్నానం చేయాలని చెబుతారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. చర్మంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, అది నయమవుతుంది.

ఇది కూడా చదవండి: ఈ 4 రాశిచక్రాల వారికి అమేజింగ్ మెమొరీ పవర్ ఉంటుందట..మీరు కూడా ఇదే రాశివారా?


6. పిల్లలకు రాత్రిపూట భయానక కలలు వస్తే, మంగళవారం లేదా ఆదివారం వారి దిండు కింద పటికను ఉంచండి అని జ్యోతిష్య నివారణలలో చెప్పారు.
7. జ్యోతిష్య పరిహారాల్లో పటికపై పచ్చిమిర్చి వేసి, తమలపాకులో చుట్టి రక్షక దారంతో కట్టాలి. ఆ తర్వాత బుధవారం సాయంత్రం రావిచెట్టు కింద
పాతిపెట్టండి. ఇలా చేయడం వల్ల అప్పులు తీరిపోతాయి.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

తదుపరి వార్తలు