Home /News /astrology /

Zodiac Signs: వామ్మో.. క్షమాపణ చెప్పేదాకా ఈ 3 రాశుల వాళ్ల ఇగో ఒప్పుకోదు.. పగను పెంచి పోషిస్తారు..

Zodiac Signs: వామ్మో.. క్షమాపణ చెప్పేదాకా ఈ 3 రాశుల వాళ్ల ఇగో ఒప్పుకోదు.. పగను పెంచి పోషిస్తారు..

ప్రతీకాత్మక చిత్రం (Image Credit: Facebook)

ప్రతీకాత్మక చిత్రం (Image Credit: Facebook)

Zodiac Signs: స్నేహితుల మధ్యనే కాదు.. బంధువలు మధ్య కూడా చిన్న చిన్న వ్యవహరాలకే అపార్థాలు, కొట్లాటలు జరుగుతుంటాయి. అవి ఏవైనా కావచ్చు.. ఏ విషయంలోనైనా అయి ఉండొచ్చు. అయితే ఇలా గొడవపడిన కాసేపటికీ.. అంతా మర్చిపోయి.. మళ్లీ ఒకటైపోతారు.

    స్నేహితుల మధ్యనే కాదు.. బంధువలు మధ్య కూడా చిన్న చిన్న వ్యవహారాలకే అపార్థాలు, కొట్లాటలు జరుగుతుంటాయి. అవి ఏవైనా కావచ్చు.. ఏ విషయంలోనైనా అయి ఉండొచ్చు. అయితే ఇలా గొడవపడిన కాసేపటికీ.. అంతా మర్చిపోయి.. మళ్లీ ఒకటైపోతారు. స్నేహితుడు అయితే సారీ రా మామ.. అని.. బంధువులు అయితే మొహమాటం కొద్ది.. మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఆ గొడవలను ఎమోషనల్ గా తీసుకోరు. అయితే జ్యోతిష్యం ప్రకారం ఇలాంటి గొడవలు జరిగితే మూడు రాశుల వాళ్లు పగను పెంచుకుంటారట. అప్పటికప్పుడు మాట్లాడినా.. మనసులో కుట్ర, కుతంత్రాలు నింపుకొని.. అవకాశం కోసం ఎదురుచూస్తుంటారట.

    Zodiac Signs: ఆనందంలో వీళ్లకు మించిన వాళ్లు లేరు.. ఆ సంతోషం కూడా ఈ రాశుల వారికి ఇలా వస్తుందట..


    జీవితాంతం పగతో బతకడం చాలా సులభం.. కానీ ఎదుటివారు చేసిన తప్పులను క్షమించి.. వాటిని మర్చిపోయి ధైర్యం చాలా అవసరం. ఇలా పగను పెంచుకునే వారు ఏ రాశి వారు ఉన్నారో తెలుసుకుందాం..  ఇలా చేసేవారు చాలా అరుదు. జోతిష్యశాస్తం ప్రకారం.. మూడు రాశులవారు పగను పెంచుకుంటారట. తమను మోసం చేసినవారిపై, అలాగే తేలికగా తీసుకున్నవారిపై కోపాన్ని పెంచుకుంటారట. మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.

    మిధునరాశి:
    మిధునరాశి చెందిన వ్యక్తులు చాలా దయ కలిగినవారు. వీరికి చాలామందితో శత్రుత్వం ఉంటుంది. పెట్టుకోవద్దు అనుకున్నా.. ఇలా పెరుగుతూనే ఉంటారు. ఇతరులు తమకు చేసిన చెడును వీరి అస్సలు మర్చిపోరు. అలాంటి వారిని తమ జీవితంలో నుంచి చెరిపేయాలని అనుకుంటారు.

    ఎవరైనా కూడా వీరి మాటలను తేలికగా తీసుకుంటే.. క్షణాల్లో కోపం వచ్చేస్తుంది. వీరు కోపం వచ్చినప్పుడు.. ఏం మాట్లాడతారో.. ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. వీళ్ల ఇగో సాటిస్ ఫై అయిందాకా నిద్ర పట్టదు. చివరకు క్షమించు అని చెప్పిందాకా.. పగతో రగిలిపోతారు.

    Mother Love: అమ్మ కోసం ఎదురు చూస్తున్న కొడుకు.. కట్ చేస్తే.. చెప్పుతో చెంప దెబ్బలు.. వీడియో వైరల్..


    వృషభరాశి:
    వృషభరాశి రాశివారు తమను బాధపెట్టిన వారిని అస్సలు క్షమించరు. వీరిని ఇతరులు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా బాధపెట్టినా.. వారి నుంచి విడిపోవడానికి సిద్దంగా ఉంటారు. జీవితంలో మళ్లీ ఆ వ్యక్తి ముఖాన్ని కూడా చూడరు. పగను మాత్రం పెంచుకుంటారు. అవసరం వస్తే.. ఆ పగను ప్రతీకారంగా తీర్చుకుంటారు. శత్రువలపై దాడి చేయడానికైనా సిద్ధ పడతారు.

    Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


    మకరరాశి:
    మకరరాశి రాశివారు ఎవ్వరినీ సులభంగా క్షమించరు. మీరు ఒకసారి వారి నమ్మకాన్ని కోల్పోతే, దాన్ని మళ్లీ తిరిగి పొందటానికి మీకు జీవితకాలం కూడా పడుతుంది. స్నేహం చేస్తే మాత్రం జీవితాంతం వదిలిపెట్టారు. అలాంటి స్నేహానికి ద్రోహం చేస్తే మాత్రం అదే జీవితాంతం మాట్లాడరు.

    ఇక తమకు హాని తలపెట్టిన వారిని ఈ రాశివారు అస్సలు వదిలిపెట్టరు. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. తమ వైపు తప్పు లేకున్నా.. గొడవ పెట్టుకున్నాడు కాబట్టి.. స్వారీ చెప్పాలని కోరుకునే వ్యక్తులు వీళ్లు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Astrology, Horoscope, Rasi phalalu, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు