Home /News /astrology /

THERE IS ONE MANTRA IN ASTROLOGY FOR MARRIAGE GIRL FRIEND COMPLETELY ONE MONTH JUST TRY IT ONCE NGS

Dream Girl Mantra: ఇష్టపడిన అమ్మాయితో వివాహం కోసం ఈ మంత్రాన్ని నెల రోజులపాటు పఠిస్తే చాలు..

ఆగస్టులో భారీగా పెళ్లి ముహూర్తాలు

ఆగస్టులో భారీగా పెళ్లి ముహూర్తాలు

Dream Girl Mantra: హిందువుల్లో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని కచ్చితంగా నమ్ముతారు. అయితే ఈ జ్యోతిష్య శాస్త్రంలో మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న ఫలించని వారికి.. కోరుకున్న అమ్మాయితా వివాహం జరగాలని ఆశ పడ్డవారికి ఓ ప్రత్యేక మంత్రం ఉంది.

ఇంకా చదవండి ...
    Dream Girl Mantra: హిందువుల్లో చాలామంది దేవుళ్లను నమ్ముతారు.. పూజిస్తారు కూడా.. అలాంటి వారంతా సెంటిమెంట్లను గౌరవిస్తారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు. ఎందుకంటే మనుషులకు ఎలాంటి సమస్య ఉన్నా.. వాటి అన్నింటికీ పరిష్కారాలు జ్యోతిష్యశాస్త్రంలో (Astrology) ఉంటాయని నమ్ముతారు. సాధారణంగా ఆర్థిక సమస్యల నుంచి బటయ పడేందుకు.. కుటుంబంలో కలహాలు పోవడానికి.. మంచి ఉద్యోగం.. మంచి భవిష్యత్తు కోరుకునే వారికి ప్రత్యేక మంత్రాలు ఉంటాయి. అయితే కేవలం వాటి కోసమే కాదు.. ఎవరైనా పెళ్లి విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా.. కోరుకున్న అమ్మాయితోనే పెళ్లి జరగాలని ఆశపడ్డ వారు.. విశ్వావసు గంధర్వ మంత్రాన్ని జపించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఒక వ్యక్తి పెళ్లి (Marriage) పదే పదే ఆగిపోతున్నా లేదా ఏదో ఒక సమస్య అడ్డుపడుతున్నా.. వారు విశ్వావసు గంధర్వ మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. దీంతో వారికి నచ్చిన నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఏర్పడుతుందంటున్నారు.

    విశ్వావసు గంధర్వ మంత్రం
    మంత్రం: ఓం క్లీం విశ్వావసు గంధర్వ కన్యానామాధిపతి. సువర్ణ సాలంకార కన్యా దేహి మే దేవ్
    మంత్రం: ఓం విశ్వసూర్నామగన్ ధర్వో కన్యానామాధిపతిః. స్వరూపన్ సలంకృతం కన్యా దేహి మే నమస్తే. విశ్వస్వే స్వాహా'
    మంత్రం: పనియ్సయాంజలీన్ సప్త దత్తా, విద్యామీమ జపేత్. సాలంకార వర: కన్యమ్, లభతే మాస్ మంత్రతా:
    విశ్వావసు గంధర్వ కన్యామాధిపతి. సువర్ణ సాలంకార కన్యా దేహి మే దేవ్

    అయిత ఈ మంత్రం ఎప్పుడు? ఎలా జపించాలి..?
    నెల రోజుల పాటు చాలా నిష్టంగా ఈ మంత్రాన్ని జపించాలి. అది కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి విశ్వావసు గంధర్వ మంత్రాన్ని పఠించాలి. మంత్రి మనస్ఫూర్తిగా పఠించిన తరువాత విశ్వావసు గంధర్వుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఉదయం లాగానే సాయంత్రం కూడా ఈ మంత్రాన్ని జపించాలి.

    ఇదీ చదవండి : జూలై నెలలో పుట్టిన వారికి లక్కే లక్కు.. వారి టోటల్ నెంబర్‌ను బట్టి జాతకం ఎలా ఉంటుంది అంటే

    అయితే ఈ మంత్రం జపించటప్పుడు.. ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
    ఈ మంత్రాన్ని జపించడం అనేది సీక్రెట్ గా చేయాలి. అప్పుడు మీకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది. అలాగే ఉదయం, సాయంత్రం కూడా ఈ మంత్రాన్ని జపించాలి.
    ఈ మంత్రాన్ని జపించే విషయం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి.
    నెల రోజుల పాటు ఈ మంత్రాన్ని నిరంతరం పఠిస్తే... మీకు నచ్చిన అమ్మాయిని త్వరలో పెళ్లి జరుగుతుందని చెబుతున్నారు పండితులు
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Astrology, Dreams, Horoscope, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు