Home /News /astrology /

THEIR ZODIAC SIGN MUST BE READY TO FACE CHALLENGES TODAY GH PJC SNR

Horoscope Today: జనవరి 26 దినఫలాలు.. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ రాశి వారు సిద్ధంగా ఉండాలి

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Horoscope Today: వివిధ రాశుల వారు ఈరోజు అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. కొందరు తమ ఇంట్లో ప్రశాంతంగా గడపలేరు. మరికొందరికి తాము వెళ్లాల్సిన దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా మేషం నుంచి మీన రాశి వరకు.. జనవరి 26, బుధవారం నాడు ఎవరికి ఎలా గడుస్తుందో దినఫలాల్లో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
(పూజచంద్ర, జ్యోతిష్య నిపుణులు)

మేషం (Aries): మార్చి 21-ఏప్రిల్ 19
ఏ పనీ చేసే మూడ్ ఉండదు. మానసికంగా బద్ధకంగా, నీరసంగా ఉంటారు. దీనితో ముఖ్యమైన పనులను సైతం అనవసర వాయిదాలు వేస్తుంటారు. యాదృచ్ఛికంగా షాపింగ్ చేస్తారు. మొత్తంమీద ఈరోజంతా పరధ్యానంగా అనిపించవచ్చు.
అదృష్ట చిహ్నం:- ఆల్బమ్

వృషభం (Taurus): ఏప్రిల్ 20-మే20
విలువైన సంబంధాలను నిలబెట్టుకునేందుకు శ్రమించాల్సి రావచ్చు. ఏదైనా ఓ పని గురించి మీ భాగస్వామికి తరచుగా చెప్పాల్సి రావచ్చు. ఈరోజు ఎదురయ్యే ఆటుపోట్ల నుంచి దూరంగా ఉండటం మంచిది. ఉదయం సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

అదృష్ట చిహ్నం:- పాత మోటార్‌సైకిల్

మిథునరాశి Gemini): మే 21- జూన్ 21
మీ జీవితాభివృద్ధికి ఇది ఓ శుభవార్త. మీ బాధ్యతలను పంచుకునేందుకు ఓ కొత్త వ్యక్తి వస్తారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణం పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
అదృష్ట చిహ్నం:- ఒక కీ చైన్

కర్కాటకం (Cancer): జూన్ 22- జూలై 22
ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ కుటుంబంతో గడపాలని గుర్తుంచుకోండి. ఇది మీ బంధాలను స్థిరంగా ఉంచుతుంది. క్రీడా కార్యక్రమాలు ఆసక్తిని కలిగిస్తాయి. మీలోని నాయకత్వ లక్షణాలకు అనుగుణంగా త్వరలో ఓ అవకాశం రానుంది.
అదృష్ట చిహ్నం:- ఎరుపు పగడం

సింహ(Leo): జూలై 23- ఆగస్టు 22
ఇంతకు ముందు మీరెవరినైనా బాధపెట్టినట్లయితే.. వారు ఇప్పటికీ మిమ్మల్ని క్షమించకపోవచ్చు. అయితే సయోధ్యకు ఇది మంచి సమయం. కాలేజీ స్నేహితులంతా తిరిగి కలిసేందుకు ప్లాన్ చేసుకుంటారు.
అదృష్ట చిహ్నం:- ఇంద్రధనస్సు రంగు

కన్య (Virgo): ఆగస్టు 23-సెప్టెంబర్ 22
రాబోయే సవాళ్ల కోసం మీ మనస్సును సిద్ధం చేసుకోండి. విదేశాల నుంచి ఓ అవకాశం మీ తలుపు తడుతుంది. రోజు ముగిసే సమయానికి సమయాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది.
అదృష్ట చిహ్నం:- కాఫీ షాప్

తుల (Libra): సెప్టెంబర్ 23- అక్టోబర్ 23
కొన్ని పరిస్థితుల కారణంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది. అనుకోని పని మీ మీద పడుతుంది. అయితే వినోదం కలిగించే కొన్ని అంశాలు మీ మూడ్​ను మారుస్తాయి.
అదృష్ట చిహ్నం:- ఒక గాజు కూజా

వృశ్చికం (Scorpio): అక్టోబర్ 24 - నవంబర్ 21
మీ పనిలో అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు కాకపోయినా ముందు ముందు ప్రయోజనకరంగా మారుతారు. ఇరుగుపొరుగు వారు కాస్త ఇబ్బంది కలిగిస్తారు. శృంగార విషయాల్లో మంచి న్యూస్​ వింటారు.
అదృష్ట చిహ్నం:- బ్యాటరీ

ధనుస్సు(Sagittarius): నవంబర్ 22 - డిసెంబర్ 21
ఎంత మంచి వార్తయినప్పటికీ మీకు అది కొన్నిసార్లు శుభవార్త కాకపోవచ్చు. ఈ రోజు కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. సుదీర్ఘమైన సంభాషణల్లో పాల్గొనే అవకాశం ఉంది. త్వరగా నిద్ర పోవాలనుకుంటారు.
అదృష్ట చిహ్నం:- పాత ఇష్టమైన నవల

మకరం (Capricorn): డిసెంబర్ 22 - జనవరి 19
కొత్త కూటమి అవకాశం సిద్ధంగా ఉంటుంది. మీరు వెళ్లే దారి స్పష్టంగా కనిపింస్తుంది. కానీ మరొక్కసారి తరచి చూసుకొని ముందుకు సాగండి. మీ పక్కేన ఉన్న ఓ వ్యక్తి మీరు ఆశించిన విధంగా సహకరించకపోవచ్చు.
అదృష్ట చిహ్నం:- ఒక రాగి గాజు

కుంభం (Aquarius): జనవరి 20- ఫిబ్రవరి 18
మీరు కొన్ని విషయాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజు తేలిగ్గా గడిచిపోతుంది. అలసిపోయినట్లు అనిపిస్తే కొంత విరామం తీసుకోండి. జరగబోయే దానిని అంచనా వేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోండి.
అదృష్ట చిహ్నం:- తృణధాన్యాల బౌల్

మీనం (Pisces): ఫిబ్రవరి 19 - మార్చి 20
ఓ స్నేహితుడి కుటుంబ విషయాల్లో మీ సహాయం అవసరం కావచ్చు. మీ తోబుట్టువులను ఎక్కువగా విమర్శించకుండా ఉండేందుకు ప్రయత్నించండి. గతంలో దాచుకున్న డబ్బు ఇప్పుడు ఉపయోగపడుతుంది.
అదృష్ట చిహ్నం:- ఒక క్రిస్టల్ జార్
Published by:Siva Nanduri
First published:

Tags: Horoscope, Horoscope Today

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు