Home /News /astrology /

THE SPECIALITY OF NINE COLOURS THAT ARE USED DURING NAVARATRI RNK

Navaratri 2021: నవరాత్రుల్లో ముఖ్యమైన 9 రంగులు.. వాటి ప్రాముఖ్యత!

Navaratri colours: శార్దియ నవరాత్రి అత్యంత ఆసక్తిగా భక్తులు ఎదురు చూసే  పండుగల్లో ఒకటి.

Navaratri colours: శార్దియ నవరాత్రి అత్యంత ఆసక్తిగా భక్తులు ఎదురు చూసే పండుగల్లో ఒకటి.

Speciality of 9 colours of navaratri: నవరాత్రులు సాధారణంగా సంవత్సరానికి నాలుగు సార్లు వస్తుంది. కానీ, కేవలం రెండు చైత్ర నవరాత్రి (మార్చి–ఏప్రిల్‌), శరద్‌ నవరాత్రి (సెప్టెంబర్‌– అక్టోబర్‌) మాత్రమే వైభవంగా జరుపుతారు.

దుర్గామాత Durga mata కు అంకితం చేసిన ఈ తొమ్మిది రోజుల పండుగ విభిన్న ప్రాంతాల్లో వివిధ పేర్లతో మాతను పూజిస్తారు. ఇది ప్రముఖ హిందు పండుగల్లో ఒకటి. నవరాత్రి Navaratri భక్తులకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సంస్కృతంలో నవరాత్రి అంటే ‘తొమ్మిది రాత్రులతోపాటు దుర్గామాత 9 రూపాల'ను పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రులు 2021అక్టోబర్‌ 7న ప్రారంభమయ్యాయి. 15న విజయదశమి వస్తోంది. అయితే, అమ్మవారికి ప్రతిరోజూ ఒక్కోరంగు వస్త్రంతో పూజలు చేస్తాం. ఇప్పుడు ఆ రంగులు వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

పసుపు..
పర్వాత పుత్రి అయిన శైలపుత్రి ఆరాధనతో నవరాత్రి ఉత్సవాలు ప్రారభమవుతాయి. ఈ రోజు పసుపు Yellow  రంగుతో ముడిపడి ఉంటుంది. పసుపు మన జీవితాల్లో ప్రకాశం, ఆనందం, ఉల్లాసాన్ని అందిస్తుంది. శైలపుత్రి అంటే ప్రకృతికి ప్రతీక. పురాణాల ప్రకారం ఆమె సతీదేవి తనను తాను త్యాగం చేసుకున్నాక జన్మించింది. అందుకే ఈమెను పార్వతి అని కూడా అంటారు.

ఇది కూడా చదవండి:  నవరాత్రి మూడవరోజు పూజ.. నైవేద్యం, అలంకారం..


గ్రీన్‌..
నవరాత్రి రెండోజు ఆకుపచ్చ రంగుకు ప్రతీక. ఇది స్వభావాన్ని, శక్తితో ముడిపడి ఉంటుంది. నవరాత్రి రెండో రోజు ఈ రంగును ధరించడం వల్ల జీవితంలో వృద్ధి, సామరస్యం, కొత్త శక్తి లభిస్తుంది.

గ్రే..
ఈ రంగు మూడవ రోజు ధరిస్తారు. ఈరోజు చంద్రఘంట దేవికి అంకితం. అందుకే ఆమెను ఇష్టమైన బూడిద రంగును వేసుకుంటారు. ఇది చీకటి, ప్రతికూలతతో ముడిపడి ఉంటుంది. చెడును నాశనం చేయాలనే ఉత్సాహాన్ని, సంకల్పాన్ని సూచిస్తుంది.

నారింజ రంగు..
నవరాత్రి నాలుగవ రోజు కుష్మాండ దేవతకు అంకితం చేస్తారు. అందుకే దేవి చిరునవ్వుతో ప్రపంచాన్ని సృష్టించిన ఘనత ఆమెది. ఆమెకు సంతోషకరమైన నారింజ రంగుతో ఆరాధిస్తారు. ఈ రంగు ప్రకాశం, సంతోషం, సానుకూల శక్తిని సూచిస్తుంది.

ఇది కూడా చదవండి: దుర్గామాత ఆయుధాలు ధరించడం వెనుక రహస్యం?


తెలుపు..
దుర్గామాత తన కుడిచేతిలో కార్తికేయను పట్టుకుని కనిపిస్తే.. స్కందమాత ఐదో రూపం. దేవి రూపాన్ని పూజించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు దేవి చల్లని ఆశీర్వాదాలు పొందాలంటే ఈ రోజు తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఇది స్వచ్ఛత, శాంతి, ధ్యానానికి ప్రతీక.

ఎరుపు..
దుర్గామాత ఆరో రూపం కాత్యాయని అంటారు. ఈమె అత్యంత శక్తివంతమైన దేవత. ఈమెను భద్రకాళి అని కూడా పిలుస్తారు. దుర్గామాత ఎరుపు రంగుకు ప్రాతినిధ్యం వహిస్తుందని అంటారు. శత్రువుల పట్ల దేవత కోపానికి సూచిస్తుంది.

రాయల్‌ బ్లూ..
కాళరాత్రి నవదుర్గ ఏడో అవతారం. కాళరాత్రి అంటే మరణం అని అర్థం. దేవి అపారశక్తి ముదురు నీలం రంగు ద్వారా సూచిస్తారు. దుర్గామాత ఈ రూపంలోనే అందరు రాక్షసులను సంహరిస్తుందని నమ్ముతారు. రాయల్‌ బ్లూ రంగుకు అపారమైన శక్తి ఉంటుంది.

పింక్‌..
నవరాత్రుల్లో మొదటి ఎనిమిది రోజులు మహాగౌరీ దేవికి అంకితం చేశారు. అష్టమి రోజు దుర్గాష్టమి రూపం. తన భక్తుల కోరికలను తీర్చే శక్తి దుర్గాదేవికి ఉంది. అమ్మను పూజించడం వల్ల బాధల నుంచి విముక్తి పొందుతాం. ఈరోజు గులాబీ రంగుతో ముడిపడి ఉంటుంది. ఆశ, సామాజిక ఉద్దరణను సూచిస్తుంది.

పర్పుల్‌..
నవరాత్రి చివరి రోజు సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. సిద్ధి అంటే అతీంద్రియ, ధాత్రి అంటే ఇచ్చేది అని అర్ధం. ఈ రూపం జ్ఞానాన్ని ఇచ్చేది. మీ ఆశయాలను సాధించడానికి సహాయపడుతుంది. ఈరోజు పర్పుల్‌ రంగుతో ముడిపడి ఉంటుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు