Home /News /astrology /

Zodiac Signs: ఈ 5 రాశుల వారు.. ‘నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న’.. అంటూ తొందరపెడతారట..

Zodiac Signs: ఈ 5 రాశుల వారు.. ‘నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న’.. అంటూ తొందరపెడతారట..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Zodiac Signs: పెళ్లి గురించి ఎన్నో కలలు కనే వారు ఉన్నారు. పెళ్లి జరిగే తీరును స్నేహితులతో చెప్పుకునే సమయంలో కూడా.. గ్రాండ్ జరుపుకోవాలని అనుకుంటాం. ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. దాని కోసం ముందుగానే డబ్బులు దాచుకోవడం లాంటివి చేస్తాం.

ఇంకా చదవండి ...
  పెళ్లి గురించి ఎన్నో కలలు కనే వారు ఉన్నారు. పెళ్లి జరిగే తీరును స్నేహితులతో చెప్పుకునే సమయంలో కూడా.. గ్రాండ్ జరుపుకోవాలని అనుకుంటాం. ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. దాని కోసం ముందుగానే డబ్బులు దాచుకోవడం లాంటివి చేస్తాం. మన పెళ్లి బాలీవుడ్ స్టైల్‌లో జరగాలని ఆశిస్తాం. లేదు లేదు.. అంత కంటే ఎక్కువగా.. అందరూ మాట్లాడుకునే విధంగా ఉండాలని.. మెహందీ.. సంగీత్.. ఇలా ఒకటేమిటీ వివాహం అంగరంగ వైభవంగా జీవితాంతం గుర్తుండిపోయే రీతిలో జరగాలని కోరుకుంటాం.

  అయితే ఇలాంటి కలలు అందరూ కంటారు అనుకుంటే పొరపాటే.. కొందరు తమ కెరీర్‌పై దృష్టి పెడతారు. వాటి గురించి ఎప్పుడూ ఆలోచన ఉంటుంది. ఎన్నో సాధించాలని అనుకుంటారు. అయితే జోతిష్యశాస్త్రం ప్రకారం.. 5 రాశులవారు కేవలం పెళ్లి గురించే అలోచిస్తారట. వారికి పెళ్లికి బాగా తొందరెక్కువట. ఎన్నో కలలు కంటారట. తొందరగా పెళ్లి చేస్తే బాగుండు అని అనుకుంటారట. మరి ఆ రాశుల వాళ్లు ఎవరో తెలుసుకుందాం..

  Weight Loss Exercise Tips: లావు తగ్గాలని కొత్తగా వ్యాయామం చేస్తున్నారా.. ఈ 9 టిప్స్ పాటిస్తూ చేయండి..


  మేషరాశి:
  మేషరాశి వారు చాలా మంచివారు, విశాల హృదయులు. ఒక్కసారి మీరు గానీ వీరి ప్రేమలో పడినట్లయితే.. ఈ రాశివారు తమ ప్రేమను నిరూపించుకునేందుకు ఏడు సముద్రాలు దాటమన్నా దాటేస్తారు. తన ప్రేమ కోసం ఏం చేయాలన్న చేసేస్తారు. అంతే కాదు తమ ప్రేమను వివిధ రకాలుగా వ్యక్త పరుస్తారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. తమకు ఇష్టమైనవారిని సంతోషపరిచేందుకు ఎంత దూరమైనా వెళ్తారు. పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూడరు. త్వరగా వివాహం చేసేసుకుంటారు. ఇంట్లో వాళ్లను తొందరపెట్టేస్తారు.

  Zodiac Signs: వామ్మో.. క్షమాపణ చెప్పేదాకా ఈ 3 రాశుల వాళ్ల ఇగో ఒప్పుకోదు.. పగను పెంచి పోషిస్తారు..


  వృషభరాశి:
  వృషభరాశి వారు వ్యక్తిత్వంలో చాలా స్ట్రాంగ్. ప్రతీ విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ప్రేమ విషయంలో అయితే ఆలోచించడానికి సుదీర్ఘ సమయాన్ని తీసుకుంటారు. ఒకదానిని ఏదైనా దక్కించుకోవాలని అనుకునప్పుడు.. దాని కోసం దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తారు. ఎక్కడా కూడా వెనకడుగు వెయ్యరు. తమ బంధం పట్ల విధేయతతో ఉంటారు. పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలా ఉండాలి.. అలా ఉండాలని కలలు కంటారు.

  సింహరాశి:
  సింహరాశి వారు గాఢమైన ప్రేమికులు. తమకు నచ్చినవారు జీవితంలోకి వచ్చిన వెంటనే పెళ్లి కోసం తొందరపడతారు. ప్రేమించడమే ఆలసయం.. పెళ్లి పెళ్లి అంటూ గగ్గోలు పెట్టేస్తారు. వీరు ప్రేమపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. ఎక్కువగా కాలం రిలేషన్‌షిప్‌ను కోరుకుంటారు. వీరు చాలా ఓపికతో వ్యవహరిస్తారు. ఒక వేళ వీళ్లు సహనాన్ని కోల్పోతే మాత్రం రిలేషన్ షిప్ ను పెట్టుకోరు.

  Zodiac Signs: ఆనందంలో వీళ్లకు మించిన వాళ్లు లేరు.. ఆ సంతోషం కూడా ఈ రాశుల వారికి ఇలా వస్తుందట..


  తులారాశి:
  తులారాశి వారు ప్రేమ, పెళ్లి గురించి కలలు కంటారు. పగటి కలలు.. రాత్రి కలలు కూడా కంటారు. ఎప్పుడూ అదే ఆలోచన . కానీ చాలా అనిశ్చితతో ఉంటారు. వీరు ఈజీగా ప్రేమలో పడిపోతారు. దీర్ధకాలిక నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశివారికి బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఒక వేళ మీ భాగస్వామి పెళ్లికి ఎక్కువగా తొందర పెడుతున్నారంటే.. వాళ్లు తులా రాశి వారు కూడా కావొచ్చని ఆలోచించండి.

  కుంభరాశి:
  కుంభరాశి వారు ఎవరితోనైనా కూడా డీప్‌గా కనెక్ట్ అవుతారు. ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే.. డిస్ కనెక్ట్ కావడం చాలా కష్టం. పెళ్లి విషయంలో ఎక్కువగా తొందరపడతారు. ప్రతీ క్షణం తన భాగస్వామితోనే గడపాలని కోరుకుంటారు. తమ భాగస్వామితో వరల్డ్ టూర్ వీరి డ్రీమ్. పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని వీళ్లు అనుకోరు. కానీ భాగస్వామిని టూర్లకు తిప్పుతాడు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Astrology, Horoscope, Rasi phalalu, Zodiac sign, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు