Home /News /astrology /

TAKE THESE PRECAUTIONS PREGNANT WOMEN ON SOLAR ECLIPSE 2021 RNK

Solar eclipse 2021:సూర్యగ్రహణం 2021 జాగ్రత్తలు.. గర్భిణీ స్త్రీలు ఈ 4 పనులు చేస్తే ఏమవుతుందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Solar eclipse 2021: సూర్యగ్రహణం (solar eclipse ) డిసెంబర్ 4న శనివారం ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.07 గంటకు ముగుస్తుంది.

2021 డిసెంబర్ 4న రాబోయే సూర్యగ్రహణం  (solar eclipse 2021) ఈ ఏడాది చివరి గ్రహణం. ఈరోజు శనివారం ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.07 గంటకు ముగుస్తుంది. సూర్యగ్రహణం (solar eclipse ) సమయంలో ఆలయాలు మూసివేస్తారు. పూజలు, భజన కీర్తనలపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ, శుభకార్యాలను నిషేధిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో సూర్యదేవునిపై రాహు-కేతుల గ్రహణం ఉంటుందని నమ్ముతారు.

అందుకే ఈ సమయాల్లో దైవాన్ని ఎక్కువగా స్మరించుకుంటారు. అయితే, గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు (Pregnant women)  కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యగ్రహణం సమయంలో కడుపులో పెరుగుతున్న శిశువుపై దుష్ప్రభావాలు ఉండవచ్చు. కాబట్టి కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భిణీలు ఈ సమయంలో ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీలు గమనించాల్సిన విషయాలు..

  • మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లడం నిషేధించాలి. అలాంటి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడం వల్ల సూర్యుడి హానికరమైన కిరణాల వల్ల తల్లి, బిడ్డపై ప్రభావం పడుతుందని చెబుతారు. అందుకే స్త్రీలు సూర్యగ్రహణం ఛాయలకు దూరంగా ఉండాలి.


ఇది కూడా చదవండి: వాచ్.. ఇలా వాడితే ప్రమాదం తప్పదట..

  • గ్రహణం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారిచడానికి గర్భిణీ స్త్రీలు గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి.

  • సూర్యగ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం నిషద్ధంగా పరిగణిస్తారు. ఈ పరిస్థితు్లో గర్భిణీ స్త్రీలు పండ్లు తినవచ్చు. ఎందుకంటే బిడ్డ ఆరోగ్యం, తల్లికి కూడా మంచిది.

  • గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం సమయంలో పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. గ్రహణం సమయంలో బ్లేడ్లు, కత్తులు, కత్తెరలు, పిన్నులు, సూదులు వంటి వస్తువులను ఉపయోగించడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావాలు పడతాయని నమ్మకం.


ఇది కూడా చదవండి:  లక్ష్మీదేవి కరుణకు తులసి వద్ద ఈ ఒక్క ఉపాయం చేయాలి...

  • గ్రహణం కాలంలో సూర్యుడిని చూడటం కూడా నిషేధిస్తారు. ఎందుకంటే దాని హానికరమైన కిరణాలు కళ్లపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. గ్రహణం సమయంలో మీరు సూర్య భగవాణుడి మంత్రాలను జపించవచ్చు. లేదా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించవచ్చు.

Published by:Renuka Godugu
First published:

Tags: Solar Eclipse 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు