Garba with PPE Kits: పీపీఈ కిట్లతో గార్భ నృత్యం... వైరల్ వీడియో

Garba with PPE Kits: దేశీ నవరాత్రులు మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో పండుగ శోభ కనిపిస్తోంది. గుజరాత్ విద్యార్థులు తమ సంప్రదాయ గార్భా నృత్యాన్ని పీపీఈ కిట్లతో చేశారు.

news18-telugu
Updated: October 17, 2020, 7:52 AM IST
Garba with PPE Kits: పీపీఈ కిట్లతో గార్భ నృత్యం... వైరల్ వీడియో
పీపీఈ కిట్లతో గార్భ నృత్యం (credit - twitter - ANI)
  • Share this:
Garba with PPE Kits: కరోనా ఉందని పండుగలు, ఆచారాలూ మానేస్తామా... వైరస్ వైరస్సే... పండుగ పండుగే అంటున్నారు గుజరాత్ ప్రజలు. దేశీ నవరాత్రులప్పుడు గుజరాత్ ప్రజలు తమ సంప్రదాయ నృత్యం గార్భా ఆడి తీరతారు. మరి ఇప్పుడు కరోనా కాలం కదా... ఈ సమయంలో గార్భా చేస్తే... వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కొందరు యువ విద్యార్థులు ఇదిగో ఇలా పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ - PPE) కిట్లతో గార్భా ఆడారు. గార్భా డాన్సులో కాస్ట్యూమ్స్ కలర్‌ఫుల్‌గా ఉంటాయి. మరి పీపీఈ కిట్లు అలా ఉండవు కదా... అందువల్ల పీపీఈ కిట్లకు ప్రత్యేకంగా కుట్లు, అల్లికలూ వేశారు. చేతులతో పెయింటింగ్స్ వేశారు. కలర్ ఫుల్ గా మార్చేశారు. దాంతో నవరాత్రి శోభ కనిపించింది. ఈ తరహా గార్భాకి ప్రజలు జై కొట్టారు.

దేవీ నవరాత్రుల్లో రోజూ సాయంత్రం వేళ గార్భా నృత్యం చేయడం అన్నది గుజరాతీలకు అత్యంత ముఖ్యమైన ఆచారం. ఓ కుండలో ప్రమిదను ఉంచి... దీపం వెలిగిస్తారు. ఆ దీపాన్నే అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఆ కుండను మధ్యలో ఉంచి... చుట్టూ తిరుగుతూ... గార్భా నృత్యం చేస్తారు. ఈ ఏడాదంతా తమ కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని కోరుతారు. ఇలా ఓ మంచి ఉద్దేశంతో చేసే నృత్యం కావడంతో... గార్భాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ (IDT) మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ కొత్త తరహా కొవిడ్ గార్భ డ్రెస్ తయారుచేశారు. ఇందులో పీపీఈ కోసం వాడిన క్లాత్... పాలీప్రోపిలీన్ ఫ్యాబ్రిక్... దీనితో పీపీఈ కిట్లు తయారు చేయవచ్చని సౌత్ ఇండియా టెక్స్ టైల్ రీసెర్చ్ అసోసియేషన్ (SITRA) తెలిపింది. విద్యార్థులు చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

"విద్యార్థులు సేఫ్ డిస్టాన్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. అందరూ మాస్కులు ధరించారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ గార్భా చేశారు. వాళ్లు వాడిన గార్భా ఔట్ ఫిట్స్ చాలా తక్కువ ధరే. పైగా అవి కరోనా రాకుండా పూర్తి రక్షణ ఇస్తాయి. వాటిని వేసుకోవడం, తీసివేయడం అన్నీ తేలికే" అని తెలిపారు కాస్ట్యూమ్ తయారు చేసిన విద్యార్థుల్లో ఒకరైన దిశా పటేల్.


కరోనా కారణంగా గార్భా నృత్యాన్ని ఈసారి ప్రభుత్వం నిషేధించింది. ఐతే... సూరత్ లోని సివిల్ ఆస్పత్రిలో చేస్తున్న కోవిడ్ కేర్ వాలంటీర్లకు ఈ పీపీఈ కిట్లను గిప్టుగా ఇవ్వబోతున్నారు. గార్భాను నిషేధించిన గుజరాత్ ప్రభుత్వం ఆలయాలు తెరచుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చింది.
Published by: Krishna Kumar N
First published: October 17, 2020, 7:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading