Super Pink Moon : సూపర్ పింక్ మూన్ సమయంలో మీ రాశిఫలాలు తెలుసుకోండి...

Super Pink Moon : ఏంటీ సూపర్ పింక్ మూన్ అంటే? ఎప్పుడు కనిపిస్తుంది? భారతీయులు ఎలా చూడొచ్చు? రాశిఫలాలు ఎలా ఉంటాయి? ఆ విశేషాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: April 7, 2020, 5:43 AM IST
Super Pink Moon : సూపర్ పింక్ మూన్ సమయంలో మీ రాశిఫలాలు తెలుసుకోండి...
సూపర్ పింక్ మూన్ సమయంలో మీ రాశిఫలాలు తెలుసుకోండి... (credit - NASA)
  • Share this:
Super Pink Moon : సాధారణం కంటే 14 రెట్లు పెద్దగా ఉండే చందమామ (పింక్ మూన్) ఏప్రిల్ 8న ఉదయం 8.05 గంటల నుంచి కనిపించనుంది. ఐతే... ఆ సమయంలో అమెరికాలో చీకటిగా, ఇండియాలో వెలుతురుగా ఉంటుంది. అందువల్ల భారతీయులకు పింక్ మూన్... కాంతి లేకుండా ఓ మేఘంలా మాత్రమే కనిపిస్తుంది. ఐతే... ఏప్రిల్ 7 రాత్రి కూడా చందమామ దాదాపు అదే సైజులో కనిపిస్తుంది. తెల్లారేసరికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. అందువల్ల భారతీయులు కూడా పింక్ మూన్ చూసినట్లే అవుతుంది. ఐతే... ఏప్రిల్ 8 ఉదయం 8.05 గంటలకు చందమామ భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది. అది పింక్ (గులాబీ) రంగులో ఉండదు కానీ... పసుపు రంగులో 30 శాతం ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.

సూర్యుడు, చందమామ, భూమి మధ్య ఆకర్షణ, వికర్షణ బలాలుంటాయి. వాటి ప్రభావం మనపై పడుతుంది. చందమామ ప్రభావం మన ఆలోచనలు, అంతర్గత భావాలపై ఎక్కువగా ఉంటుంది. ఖగోళాల పయనం వల్ల మనలో మార్పులు వస్తుంటాయి. ఇవాళ రేపు కనిపించే పింక్ మూన్... తుల రాశి నుంచి వెళ్తుంది. ఫలితంగా మనం ఏం ఫీలవుతున్నాం, ఏం ఫీలవ్వాలి అనే అంశాలపై ప్రభావం ఉంటుంది. ఐతే... ప్రస్తుతం చందమామకు దగ్గగగా మార్స్ (అంగారక గ్రహం), శనిగ్రహం, గురుగ్రహం ఉన్నాయి. అలాగే సప్తర్షి మండలంలో ప్రేమకు చిహ్నమైన వీనస్ (శుక్రగ్రహం) పయనిస్తోంది. అందువల్ల వీటన్నింటినీ కలిపి... పింక్ మూన్ సమయంలో మన రాశిఫలాలు ఎలా ఉంటాయో జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

మేష రాశి (Aries)
మీరు ఎవరితోనైతే రిలేషన్‌షిప్ (సత్సంబంధాలు) కొనసాగిస్తున్నారో... వాటి విలువను తెలుుకుంటారు. మీ సంబంధాల్ని బలపరచుకోవడానికీ లేదా వదిలేసుకోవడానికీ ఇదే సరైన సమయం. అంతేకాదు... రిలేషన్‌షిప్‌ను మీరు ఎలా కొనసాగించగలరో తెలుసుకుంటారు. మీరు మరింత బలంగా, మరింత కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్తారు.

వృషభ రాశి (Taurus)
సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీకు ఇదే సరైన టైమ్. మీ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీలో శక్తిసామర్ధ్యాల్ని బయటకు తీసేందుకు ఇది సరైన సమయం. ఐతే, ఒకే విషయంపై మరీ ఎక్కువగా ఆలోచిస్తే... మనస్తాపం చెందుతారు.

మిధున రాశి (Gemini)స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా మీ లోకంలో మీరు ఉంటారు. మీ ఆనందం మీకే ఉంటుంది. ఐతే... ఆ ఆనందాన్ని దూరం చేసే అంశాల్ని మీరు గుర్తించాలి. వాటిని మీ దరి చేరనివ్వకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.

కర్కాటక రాశి (Cancer)
కెరీర్ ఒత్తిళ్లు మీపై ఎక్కువగా ఉంటాయి. వృత్తి పరంగా పేరు వస్తుంది. అదే సమయంలో... మిమ్మల్ని ప్రేమించేవారిని కూడా మీరు గుర్తించాలి. ఆఫీస్ పనులను ఇళ్లలో చేయాల్సి వస్తున్నా... పని రాక్షసుల్లా మారకుండా జాగ్రత్త పడాలి. తద్వారా మీరు సాధించాలనుకున్నదాని కంటే ఎక్కువే సాధిస్తారు.

సింహ రాశి (Leo)
మీరు పొందాల్సింది చాలా ఉంటుంది. చాలా అవకాశాలు మిస్సవుతాయి. మీలో ఉన్న కమ్యూనికేషన్ సామర్ధ్యాల్ని గుర్తించాల్సిన సమయం ఇది. అవసరమైనప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిభావంతులుగా మార్చుకుంటూ ముందడుగు వెయ్యాలి.

కన్యారాశి (Virgo)
మీరు కోరుకునేదానికీ, మీరు పొందే దానికీ చాలా తేడా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే అంశాలపై ఎక్కువగా మీరు ఫోకస్ పెడుతున్నట్లైతే... వాటిని పక్కన పెట్టి... మీ గురించి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. తద్వారా మీకు అద్భుతాలు సాధ్యమవుతాయి.

తుల రాశి (Libra)
మీరు ఏం కావాలనుకుంటున్నారో అది అవ్వరు. ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండరు. కానీ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ముందడుగు పడుతుంది. మీరేంటో ఇతరులు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు. వారికి ఆ అవకాశం ఇవ్వొద్దు. మీ గురించి మీకు మాత్రమే తెలుసు.

వృశ్చిక రాశి (Scorpio)
మీ గురించి ప్రపంచానికి తెలియని విషయాలు మీకు ఉంటాయి. అవి మీకు ప్రయోజనమే కలిగిస్తాయి. మీ రిలేషన్‌షిప్‌తో సమయాన్ని గడపండి. మీ అంతర్గత సద్గుణాలను బయటకు తియ్యండి. మీకు ఉన్న అర్థవంతమైన నమ్మశక్యంకాని అసాధారణ శక్తులను మీరు గుర్తిస్తారు.

ధనుస్సు రాశి (Sagittarius)
మీకు సౌలభ్యంగా ఉండే స్థితికి చేరుకోవడానికీ, ఇతురలతో లోతుగా కలిసిపోవడానికీ ఇదే సరైన సమయం. ఇప్పుడు మీతో ఎవరైనా కలవగలరు. మీరు చెప్పినదే ఫైనల్ అవుతుంది. అన్ని పరిస్థితులను ఉన్నతంగా మార్చేందుకు మీరు సంసిద్ధులు కావాల్సిన సమయం ఇది.

మకర రాశి (Capricorn)
మీరు సాధించే గొప్ప విషయాల్ని ఇతరులు గుర్తిస్తారు. మీరు నెక్ట్స్ ఏం చెయ్యాలనుకుంటున్నారో ఆ వైపుగా అడుగులు వెయ్యాల్సిన సమయం ఇది. కష్టమైనప్పటికీ మీరు వేసే అడుగుల వల్ల మీకు నష్టం మాత్రం కలగదు. ధైర్యంగా వేసే అడుగుల వల్ల విజయాల్ని చూస్తారు. రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడండి.

కుంభ రాశి (Aquarius)
మీ మనసులో ఏమనుకుంటున్నారో గ్రహించగలిగే శక్తి మీకు ఉంది. మీరు సాధించాలనుకునే అంశం కష్టమైనదైనా, ఎక్కువ కాలం పట్టేదైనా ఒక్క అడుగుతో అటుగా ప్రయాణం చెయ్యగలరు. ఐతే... ఆ దిశగా అడుగు వెయ్యడానికి మీరు సిద్ధపడాలి. అందుకు ఉన్న అడ్డంకుల్ని తొలగించుకోవాలి. మీరు ముందుకు కదిలేందుకు అవకాశాలు చక్కగా ఉన్నాయి.

మీన రాశి (Pisces)
త్యాగాలు చెయ్యడం అంత తేలిక కాదు. కానీ అభివృద్ధి కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. దేనికైనా గుడ్ బై చెప్పాల్సి వస్తే.. చెప్పడానికి సిద్ధపడాలి. మార్పు తప్పదు. భవిష్యత్తులో అవసరం లేని అంశాల్ని ఇప్పడు మీరు వదిలించుకోవాలి. అలా చెయ్యగలిగినప్పుడే మీరు భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లగలుగుతారు.
Published by: Krishna Kumar N
First published: April 7, 2020, 5:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading