హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Ugadi 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం.. తుల రాశికి అన్నీ శుభవార్తలే.. !

Ugadi 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం.. తుల రాశికి అన్నీ శుభవార్తలే.. !

తుల రాశి

తుల రాశి

ఈ రాశి వారికి ప్రధానగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏడాదంతా జీవితం లో కొన్ని ముఖ్యమైన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వివిధ రాశులకు సంబంధించి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఫలితాలను ఇక్కడ అందజేస్తున్నాం. ప్రధాన గ్రహాలైన శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి ఈ రాశుల ఫలితాలను చెప్పడం జరుగుతోంది. అయితే, వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారం చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గమనించాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7:  ఈ రాశి వారికి ప్రధానగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏడాదంతా జీవితం లో కొన్ని ముఖ్యమైన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు. వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలు గడిస్తారు. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి.

శుభ పరిణామాలు

మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏప్రిల్ నెల నుంచి జీవితంలో ముఖ్యమైన శుభపరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది.

ముఖ్యమైన పరిహారాలు

వ్యక్తిగత విషయాలను, బలాలను, బలహీనతలను ఇతరులతో పంచుకోవడం మంచిది కాదని గ్రహించండి. ఈ ఏడాదిలో నాలుగైదు సార్లు డబ్బు మోసపోయే అవకాశం ఉంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం శ్రేయస్కరం కాదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించడం చాలా మంచిది. తరచూ విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కొన్ని నష్టాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది.

First published:

Tags: Astrology, Zodiac Sings

ఉత్తమ కథలు