SOLAR ECLIPSE EFFECTS ON ZODIAC SIGNS AND PRECAUTIONS RNK
Solar eclipse 2021: సూర్యగ్రహణం ప్రభావం ఈ రాశులపై కచ్ఛితం.. పరిహారానికి..
ప్రతీకాత్మక చిత్రం
2021 చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 4 (శనివారం) రానుంది హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర కృష్ణపక్షంలో వచ్యే అమావాస్య చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈరోజు శనిజయంతి. 148 సంవత్సరాలకు ముందు అంటే 1873 మే 26న సంభవించింది. మళ్లీ రేపే ఈ అద్భుతం మనకు కనబడనుంది.
ఈ సూర్యగ్రహణం (solar eclipse) సమయంలో కొన్ని పనులు మనం చేయం. గ్రహాలు,రాశుల స్థాన మార్పులు ఆయా రాశిచక్రాలపై ప్రభావం పడుతుంది. అదేవిధంగా సూర్య, చంద్ర గ్రహణం అన్ని రాశులపై పడుతుంది. ఇది కొందరికి శుభం, మరికొందరి అశుభాలను తీసుకువస్తుంది. అయితే, ఈ సూర్యగ్రహణం ప్రభావం ఏయే రాశులపై ఏ ప్రభావం ఉంటుందో, దాని పరిహారాలు ఏంటో తెలుసుకుందాం.
రాశులపై ప్రభావం.. పరిహారాలు.. మేషరాశి వారు తమ జీవిత భాగస్వామి ఆనందాన్ని పొందుతారు. కానీ, కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ గ్రహణం మీ తల్లి ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. ఇది మీ కుటుంబంలో పూర్తి అసమ్మతికి దారితీస్తుంది.
పరిహారం..
సాయంత్రం సుందరకాండను పఠించాలి. హనుమాంతుడికి మల్లెపూలు సమర్పించి, దీపం వెలిగించాలి.
వృషభ రాశి..
మీ ప్రేమ సంబంధంలో విడిపోవడానికి కూడా కారణం కావచ్చు. ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. వాహన లాభం ఉంటుంది. పరిహారం..
సాయంత్రం వేళ శివలింగానికి గంధపు పరిమళాన్ని అర్పించి, రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి.
మిథున రాశి..
ఈ రాశివారికి సూర్యగ్రహణం తర్వాత ఖర్చులు పెరుగుతాయి. ఎవరైనా మోసపోవచ్చు, కుటుంబంలో చీలికలు, ధన చింత ఉండవచ్చు. శత్రువుత వల్ల నష్టం, వ్యాధులు పెరిగే అవకాశం మెండు. ఉపాయం..
పంచామృతంతో శివునికి అభిషేకం చేయాలి. సాయంత్రం పూట పూర్తీకుల పేరుతో నిరుపేదలకు భోజనం పెట్టాలి.
కర్కాటక రాశి..
భాగస్వామ్యంలో ఆటంకాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుంచి విడిపోయే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యానికి బాధాకరంగా మారుతుంది. దీంతో డబ్బునష్టం కూడా రావచ్చు. బలహీనమైన లేదా అనారోగ్యంతో ఉన్నవారికి ఆపరేషన్ అవకాశం ఉంటుంది.
పరిహారం..
రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి, పచ్చిపాలు, నల్లనువ్వులు, గంగాజలం తేనె కలిపి రావిచెట్టుకు నేరుగా నైవేద్యంగా సమర్పించాలి. సింహ రాశి..
ఈ గ్రహణం వల్ల ఆరోగ్యంలో ఆటంకాలు కలగడంతోపాటు కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. కొత్త పనిలో పెట్టుబడి కారణంగా నష్టం వాటిల్లవచ్చు. కానీ, అదే సమయంలో కొన్ని కొత్త పనులను కూడా ప్రారంభించవచ్చు. మీరు వాహనం నుంచి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాయం..
నిరుపేదలకు ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయాలి. హనుమాన్ చాలీసాను 5 సార్లు చదవాలి.
కన్యారాశి..
ఈ గ్రహణం ఈ రాశివారి తండ్రి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అంతేకాదు వారి పురోగతికి ఆటంకం ఏర్పడుుతంది. ఇది గౌరవ, ప్రతిష్ఠను కూడా భంగపరుస్తుంది. శారీరక నొప్పులు కూడా కొన్ని రోజులు ఇబ్బందులు పెడతాయి.
పరిహారం..
సాయంత్రం సూర్యభగవాణుడిని నమస్కరించి, హనుమంతుడికి బెల్లం, పప్పులను సమర్పించాలి. తులారాశి..
ఈ గ్రహణం కొన్ని మార్పులు తీసుకురావచ్చు. ప్రమోషన్ ఆగిపోవచ్చు. స్త్రీ, పురుషుల వైపు నుంచి పురుషుడు, స్త్రీ వైపు నుంచి ఇబ్బంది పడవచ్చు. అలాగే అప్పులు కూడా పెరగవచ్చు. పరిహారం..
సాయంత్రం సూర్యుడికి రాగిపాత్రతో అర్ఘ్యం సమర్పించి, సూర్యాష్టకం పఠించాలి. మీ పాత వస్త్రాలను దానం చేయాలి.
వృశ్చిక రాశి..
ఈ రాశివారికి అనేక అడ్డంకులు ఏర్పడతాయి. పెద్ద సోదరులతో సంబంధాలు చెడుపోవచ్చు. పిల్లల వైపు నుంచి ఇబ్బందులు, కార్యాలయంలో అనవసరమైన ఒత్తిడి ఉండవచ్చు. ఎటువంటి కారణం లేకుండా ఇతరులతో వివాదాలు ఏర్పడవచ్చు.
ఉపాయం..
పేదలకు గోధుమలు, బెల్లం దానం చేయాలి. ఏదైన మతపరమైన ప్రదేశంలో తప్పనిసరిగా రాగి పాత్రలను దానం ఇవ్వాలి. హనుమంతుని ఆలయంలో లేదా శనిదేవాలంయలో ఇనుము వస్తువులను దానం చేయాలి. ధనస్సు రాశి..
ఇది మీ ఖర్చును పెంచుతుంది. మీ కళ్లకు కూడా హాని కలిగించవచ్చు. మీ శత్రువులు ఓడిపోతారు. మంచి లాభం ఉంటుంది. పని, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.
పరిహారం..
పూర్వీకుల పేరుతో పేదవారికి భోజనం పెట్టాలి. శివుడు, హనుమంతుడిని తప్పనిసరిగా పూజించాలి.
మకర రాశి..
రోగాలు పెరుగుతాయి. నిర్ణయం తీసుకోవడంలో పొరపాటులు ఉండవచ్చు. ఒకరకమైన కళంకం కూడా ఉండవచ్చు. వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావచ్చు. పరిహారం..
నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శని చాలీసా, హనుమాన్ చాలీసా చదవాలి. అవసరమైన వారికి ఆహార ధాన్యాలు దానం చేయాలి.
కుంభ రాశి..
ఈ గ్రహణం వల్ల కుటుంబంలో డబ్బు విషయంలో అసమ్మతి ఏర్పడుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు ఇబ్బందుల్లో పడవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిహారం..
నిరుపేదలకు లేదా నపుంసకులకు మందులు, బట్టలు, ఆహారాన్ని దానం చేయాలి. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. శివాలంయలో పొడి ఆహార పదార్థాలను దానం ఇవ్వాలి.
మీన రాశి..
ఈ గ్రహణం అనేక ఇబ్బందులను పెంచుతుంది. మోసం లేదా అవమానాన్ని కూడా కలిగించవచ్చు. ఏదైనా పని చేయడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ పట్టవచ్చు. వ్యాపారంలో భారీ నష్టాలు ఉండవచ్చు. ఇంట్లో లేదా ఇతర విషయాలపై టెన్షన్ ఉంటుంది. పరిహారం..
సూర్యుడిని పూజించి సూర్య ఓం ఘృణి సూర్యాయ నమ: అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. మీ పాత వస్త్రాలను దానం చేయాలి. శివాలంయలో నెయ్యి దానం చేయడం వల్ల మీకు అనేక పనులు జరుగుతాయి.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.