Home /News /astrology /

SOLAR ECLIPSE 2021 TIMINGS AND PLACES RNK

Solar eclipse 2021: సూర్యగ్రహణం 2021.. ఎక్కడెక్కడా..ఏ సమాయం.. భారత్ పై..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Solar eclipse 2021: సూర్యగ్రహణం (solar eclipse ) డిసెంబర్ 4న శనివారం ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.07 గంటకు ముగుస్తుంది.

2021 డిసెంబర్ 4న రాబోయే సూర్యగ్రహణం  (solar eclipse 2021) ఈ ఏడాది చివరి గ్రహణం. ఈరోజు శనివారం ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.07 గంటకు ముగుస్తుంది. సూర్యగ్రహణం (solar eclipse ) సమయంలో ఆలయాలు మూసివేస్తారు. పూజలు, భజన కీర్తనలపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ, శుభకార్యాలను నిషేధిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో సూర్యదేవునిపై రాహు-కేతుల గ్రహణం ఉంటుందని నమ్ముతారు.ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం 2021 డిసెంబర్ 4న రానుంది. అంటార్కిటికా ఖండంలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. ఈ సమయంలో చంద్రుడు, సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంటాడు. దీంతో సగం సూర్య కిరణాలు మాత్రమే భూమిపై పడనున్నాయి.

ఇది కూడా చదవండి:  లక్ష్మీదేవి కరుణకు తులసి వద్ద ఈ ఒక్క ఉపాయం చేయాలి...

మన దేశంలో ఉందా?
ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. సౌత్ ఆఫ్రికా, నమీబియా ఇతర ప్రాంతాల్లో పార్శిక సూర్యగ్రహణం సంభవించనుంది.

సౌత్ ఆస్ట్రేలియా, ఆఫ్రీకా, ఉత్తర అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికలో కనిపించనుంది.

ఇది కూడా చదవండి: వాచ్.. ఇలా వాడితే ప్రమాదం తప్పదట..

సూర్యగ్రహణ సమయం..
శనివారం (రేపు) డిసెంబర్ 4 న ఈ ఏడాది సూర్యగ్రహణం సంభవించనుంది. సూర్యగ్రహణం ఉదయం 10.59 నుంచి ప్రారంభం కానుంది. సంపూర్ణ గ్రహణం మధ్యాహ్నం 12.30 న చోటు చేసుకుంటుంది.దాదాపు గంటా మూడు నిమిషాలపాటు సంభవిస్తుంది. సూర్యగ్రహణం సమయం మొత్తం 4 గంటల 8 నిమిషాలు పడుతుంది. ఈ సమయంలో కొన్ని పనులను నిషేధిస్తారు. కొన్ని పనులను ప్రత్యేకంగా చేస్తారు.

సూర్యగ్రహణం వీక్షించాలనుకునేవారు నాసా లైవ్ బ్రాడ్ కాస్టింగ్లో చూడవచ్చు. నాసా లైవ్ యూట్యూబ్ చానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. కానీ, గ్రహణాన్ని నేరుగా కళ్లతో చడకూడదని అంటారు. లేకపోతే కళ్లకు శాశ్వతంగా హాని కలిగే ప్రమాదం ఉంటుంది. కళ్లు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సూర్యుడిని పూర్తిగా చంద్రుడు కవర్ చేసి ఉన్న సమయంలో కూడా నేరుగా చూడకూడదు.
Published by:Renuka Godugu
First published:

Tags: Solar Eclipse 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు