ధన్‌తేరాస్ (Dhanteras 2021 ) రోజు ప్రత్యేకంగా కుబేరుడుతోపాటు లక్ష్మిదేవిని (laxmi devi) పూజిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా షాపింగ్ చేయడానికి శుభప్రదమని నమ్ముతారు. ఈ సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలు, పాత్రలు ఇళ్లలో ఉపయోగించే వస్తువులు, కార్లు, మోటార్, భూమి కొనుగోలు చేస్తారు.
ధన్‌తేరాస్ 2021 షాపింగ్‌కు శుభముహూర్తం..
ఐదురోజులపాటు ప్రత్యేకత ఉన్న దీపావళికి (deepavali) మొదటిరోజు ధన్‌తేరాస్ పండుగ జరుపుకుంటారు.హిందూ కేలండర్ ప్రకారం ధన్‌తేరాస్ కార్తీకమాసం కృష్ణపక్షంలో త్రయోదశినాడు నిర్వహించకుంటారు. ధన్‌తేరాస్ రోజు సముద్ర మథనం సమయంలో ధన్వంతరి దేవుడు బంగారు కుండతో దర్శన మిచ్చాడని నమ్ముతారు. ధన్వంతరితోపాటు కుబేరుడు, లక్ష్మిని పూజిస్తారు. ఈరోజు షాపింగ్ కూడా చేయాలని నమ్ముతారు.
ఇది కూడా చదవండి: ధన్‌తేరాస్ రోజు ఈ వస్తువులను దానం చేస్తే.. లక్ష్మీకటాక్షం!
ధన్‌తేరాస్ ప్రాముఖ్యత..
ధన్‌తేరాస్ (Dhanteras) రోజు ప్రజలు ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు ధన్వంతరిని ప్రేత్యేకంగా పూజిస్తారు. ధన్‌తేరాస్ రోజు లక్ష్మీదేవితోపాటు కుబేరుడు, ధన్వంతరిని ఎవరు పూజిస్తారో వారి ఇల్లు ఎల్లప్పుడూ సంపద, సౌలభ్యం,శోభతో నిండి ఉంటుందని నమ్ముతారు. ఈరోజు చాలా మంది బంగారం, వెండి వస్తువులను ముఖ్యంగా కొంటారు. వీటికి అనుకూలమైన సమయం ఇదేనని భావిస్తారు. ఇలా చేయడం వల్ల చాలా శుభ ఫలితాలను ఇస్తుంది.
ధన్‌తేరాస్ పండుగ రోజు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి సాయంత్రం 6.20 నుంచి రాత్రి 8.11 వరకు శుభప్రదం. ఇది కాకుండా ఉదయం మూహూర్తాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఉదయం 11.30 నుంచి షాపింగ్ చేసుకోవచ్చు. రాహుకాలంలో షాపింగ్ చేయకూడదు. అదే సమయంలో ఇంటికి కావాల్సిన పాత్రలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసే సమయం రాత్రి 7.15 నుంచి 8.15 గంటల వరకు ఉంటుంది.
ఇది కూడా చదవండి: దీపావళికి పూజగదిని ఎలా అలంకరించాలని ఆలోచిస్తున్నారా?
ధన్‌తేరాస్ పూజవిధానం..
ధన్వంతరి స్వామిని ధన్‌తేరాస్ రోజు పూజిస్తారు. ఈ స్వామిని దీపావళి రెండు రోజులు షోడశోపచార పద్ధతిలో పూజించాలి. ధన్‌తేరాస్ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం, ప్రాంగణం, ఇంటి దక్షిణం వైపు కచ్ఛితంగా దీపం వెలింగించాలి. ధన్‌తేరాస్ రోజు యమదీపాలను కూడా పెడతారు. దీనివల్ల ఇల్లు సుఖసంతోషాలు, సౌఖ్యాలు సంపదలతో నిండి ఉంటుంది.
ఏ వస్తువులు కొనాలి? ఏవి కొనకూడదు!
ధన్‌తేరాస్ రోజు షాపింగ్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు బంగారం, వెండి, ఇత్తడి వస్తువులు, చీపుర్లు కొనడం శుభప్రదంగా భావిస్తారు. అయితే, ధన్‌తేరాస్ రోజు నలుపు రంగు వస్తువులు, గాజు, అల్యూమినియం, ఇనుముతో చేసిన వస్తువులను అస్సలు కొనకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhanteras 2021, Dhanteras gold, Diwali 2021