Home /News /astrology /

Shani Amavasya: శనివారం అమావాస్య.. శనిదోషం కలుగకుండా చేయాల్సని పరిహారాలు..

Shani Amavasya: శనివారం అమావాస్య.. శనిదోషం కలుగకుండా చేయాల్సని పరిహారాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Shani dosham: మన హిందూ ధర్మంలో అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. సోమవారం, మంగళవారం లేదా శనివారం ఈ అమావాస్య వస్తే.. మరింత ప్రత్యేకంగా భావిస్తారు.

శని దోషం (shani dosham) నుంచి తప్పించుకోవడానికి ఆ దేవతలకే సాధ్యం కాదు. శని ప్రభావం వల్ల దేవతలు కూడా అనేక బాధలు పడాల్సి వచ్చిన సందర్భాలు మన పురాణాల్లో వివరించారు. అయితే రాబోయే శనివారం అమావాస్య కూడా కలిసి రానుంది. ఈ నేపథ్యంలో శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు పండితులు సూచించారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఈ సారి మార్గశిరమాస అమావాస్య శనివారం వచ్చింది. దీన్ని శనిఅమావాస్య అని కూడా అంటారు. ఇదే రోజు 4న సూర్యగ్రహణం (solar eclipse 2021)  కూడా అయితే, శనిదోష నివారణకు ఈ శనివారం అనుకూలమైన రోజు.

జాతకంలో శనిదోషం ఉంటే దాన్ని నివారించడానికి తప్పకుండా ముందుకు రావాలి. లేకపోతే వారికి ఇబ్బందులు తప్పవు. శనిదోషం ఉన్నవారు ఈరోజు స్నానం, దానం తప్పకుండా చేయాలి. దానివల్ల శనిదోషం నుంచి వారు తప్పకుండా ఉపశమనం పొందుతారు. అంతేకాదు అనుకున్న విజయాలను కూడా సాధించవచ్చు.
శనిదోషం లేనివారు కూడా శని చెడు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కొన్నిపరిహారాలు చేయడం మేలు.

ఇది కూడా చదవండి: వాచ్.. ఇలా వాడితే ప్రమాదం తప్పదట..

ఎప్పుడు శనిఅమావాస్య ..
హిందూ కేలండర్ ప్రకారం మార్గశిర అమావాస్య తేదీ డిసెంబర్ 3 సాయంత్రం 4.55 నుంచి 4 శనివారం మధ్యాహ్నాం 1.12 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిల్లో శనైశ్వర అమావాస్య డిసెంబర్ 4న రానుంది.

శనిదోషాన్ని పోగొట్టడానికి పరిహారాలు...
శనైశ్వర అమావాస్య ఉపవాసం చేయాలి. ఈ రోజు శనిదేవుడిని శాస్త్రోక్తంగా పూజించాలి. శనైశ్వర అభిషేకం నువ్వుల నూనె, నల్ల నువ్వులు, శనిదేవాలయానికి వెళ్లి వారి దర్శనం పొంది ఆశీర్వాదం పొందండి. తర్వాత శనిదోషం నుంచి ముక్తిని కలిగి ఉండాలంటే శనిని పూజించాలి.

శనిదోషాన్ని పోగొట్టడానికి శనైశ్వర అమావాస్య శని దేవాలయంలో నీటితో అభిషేకం చేయాలి. శనిదేవుడు హనుమంతుడి భక్తులకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించడు. అమావాస్య రోజు మల్లెపూవులు, దీపదానం చేయాలి. ఈ రోజు హనుమాన్ చాలీసా, సుందర కాండ పఠించడం వల్ల శనిదోషం కలుగదు.

ఇది కూడా చదవండి: సూర్యగ్రహణం 2021 జాగ్రత్తలు.. గర్భిణీ స్త్రీలు ఈ 4 పనులు చేస్తే ఏమవుతుందో తెలుసా?


దానధర్మాలతో దేవతలు ప్రసన్నం అవుతారని మన పురాణాలు తెలుపుతున్నాయి. శనిదోషం వల్ల వచ్చే శనైశ్వర అమావాస్య పూజ తర్వాత నువ్వుల నూనె, బట్టలు ఇతర వస్తువలను దానం చేయాలి. దీంతో శని దేవుడు కరుణిస్తాడు.

శనిదోషం నుంచి విముక్తి పొందడం..
నల్ల నువ్వుల కొన్ని, నీరు తీసుకుని శనిదేవుడికి అభిషేకం చేస్తూ 21 సార్లు ఉచ్చరించాలి. ఇలా చేయడం వల్ల శని దుష్పరిణామాలు దూరం అవుతాయి.
Published by:Renuka Godugu
First published:

తదుపరి వార్తలు