హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Horoscope: సెప్టెంబర్ 26 రాశిఫలాలు..ఆ మైకంలో మునిగిపోతారు,వారికి ఇంట్లో ప్రశాంతత ఉండదు

Horoscope: సెప్టెంబర్ 26 రాశిఫలాలు..ఆ మైకంలో మునిగిపోతారు,వారికి ఇంట్లో ప్రశాంతత ఉండదు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆయా రాశుల స్థితిని చూసి రాశి ఫలాలు అంచనా వేస్తారు. నక్షత్రాల గమనం ఆధారంగా ఆస్ట్రాలజీ ఎక్స్‌పర్ట్స్ చెప్పే ఈ రాశి ఫలాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి సెప్టెంబర్ 26, సోమవారం నాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆయా రాశుల స్థితిని చూసి రాశి ఫలాలు అంచనా వేస్తారు. నక్షత్రాల గమనం ఆధారంగా ఆస్ట్రాలజీ ఎక్స్‌పర్ట్స్ చెప్పే ఈ రాశి ఫలాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి సెప్టెంబర్ 26, సోమవారం నాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* మేషం

మీరు ఏదైనా వెంచర్‌ పనులను గానీ ప్రాజెక్టు పనులను గానీ మళ్లీ ప్రారంభించాలని అనుకున్నట్లయితే అలా చేయడానికి ఈ రోజు మంచి రోజు. ఆ పనులు చేసే ముందు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మీరు మీపైన వేసుకున్న అంచనా కంటే కూడా మీ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది.

లక్కీ సైన్ - ప్రతిబింబం

* వృషభం

ప్రాథమిక అంశాలపైన శ్రద్ధ వహించడం ద్వారా ఈ రోజు మీకు గొప్పగా ఉంటుంది. ప్రాథమిక అంశాలను గురించి మీరు జాగ్రత్త వహించి వాటినే అమలు చేయాలి. ఫలితంగా మీ అభివృద్ధి జరగడంతో పాటు మీ మనసుకు స్పష్టత వస్తుంది.

లక్కీ సైన్ - వెండి కొవ్వొత్తి

* మిథునం

భాగస్వామి గురించి మీ ఎవరితోనైనా కలిసి ఆలోచన చేస్తున్నట్లయితే అది మంచిదే. అయితే, మీరు సున్నితమైన అంశాలను సమీక్షించుకోవాలి. పెద్ద వేదికలపైన మీకు సంబంధించిన ప్రతి విషయం గానీ ప్రణాళికను గానీ అందరితో పంచుకోవడం మంచిది కాదు. అనవసర ఒత్తిడికి లోను కాకూడదు.

లక్కీ సైన్ - రత్నం

* కర్కాటకం

మీలో దాగిన రహస్య భావోద్వేగాలు ఈ రోజు మిమ్మల్ని చూసిన కొందరికి కనబడుతాయి. మీరు భావోద్వేగాల పరంగా ఇతరులపై అత్యధికంగా ఆధారపడుతారు. కానీ, అది మంచిది కాదు. మీరు అందరినీ విడిచిపెట్టి స్వతంత్రంగా నడుచుకుంటూ సాగాలి.

లక్కీ సైన్- పసుపు రాయి

* సింహం

మీరు కొంత కాలం నుంచి కలవని వ్యక్తి నుంచి మీకు ఈ రోజు సాదర స్వాగతం లభిస్తుంది. ఖరీదైన వస్తువుల మైకంలో మీరు మునిగిపోతారు. అలా మీరు ఆ శక్తుల వైపునకు వెళ్లి ఆ దిశగానే పయనిస్తారు. విదేశీ యాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకోవచ్చు.

లక్కీ సైన్ - కొవ్వొత్తి

* కన్య

మీ నుంచి దూరంగా వెళ్తున్న వారితో మీరు సంబంధం కలిగి ఉన్నట్లయితే వారితో ఉన్న భావోద్వేగాల నుంచి అంత త్వరాగా బయట పడలేరు. ఒకరిపై మరొకరికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. డబ్బుతో డీల్ చేస్తున్నట్లయితే మీ పనులను నిశితంగా పరిశీలిస్తారు కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి. మీకు ఉపయోగపడే వ్యక్తి గురించి ఇవ్వకుండా ఎవరికీ చెప్పకుండా ఉండాలి.

లక్కీ సైన్ - బుద్ధ విగ్రహం

* తుల

మీ నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి. ఫలితంగా మీరు రివార్డులు పొందుతారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే మీరు అలా చేయడం ద్వారా విలువను తీసుకొస్తారు. దూరం నుంచి చూసి కొందరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఇంటి నుంచి చక్కటి శుభవార్త అందుతుంది.

లక్కీ సైన్ - ఇండోర్ ప్లాంట్

* వృశ్చికం

పని ప్రదేశంలో గతంలో మీ పని తీరు పట్ల అభ్యంతరం తెలిపిన ఇద్దరిలో ఈ రోజు మార్పు కనబడుతుంది. మీరు దేనినైతే ఒక అమరికతో గౌరవప్రదంగా ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారో దానిని ప్రజలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ద్రవ్య లాభాలు కొనసాగుతాయి.

లక్కీ సైన్ - చాంబర్

* ధనుస్సు

మీ మానసిక సామర్థ్యం, చురుకుదనంతో పరిమిత సమయంలో మీరు చేసిన సృజన ప్రభావం చూపుతుంది. దానికి అభినందనలు వస్తాయి. నూతన వ్యాపార ఆలోచన వచ్చినట్లయితే కచ్చితంగా అది మీకు లాభం చేకూరుస్తుంది. భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయాలి. ఇంటి వద్ద మీకు ప్రశాంతత దొరకడం సవాలుగానే ఉండొచ్చు.

లక్కీ సైన్ - అధిరోహకుడు

* మకరం

ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు దాచిన సమాచారం గురించి తెలపడానికి గానీ సవాలు స్వీకరించడానికి గానీ మీరు ఉత్సాహం కనబరచకపోవచ్చు. మీరు ఎవరినైతే ప్రగాఢంగా నమ్ముతారో వారు మీ వనరులను ఇతరులకు చెప్పొచ్చు. ఇతరులపైన ఆధారపడటం తగ్గించుకుంటే మంచిది. అతి త్వరలో రోడ్డు మార్గంలో మీరు ట్రిప్ వెళ్తారు.

లక్కీ సైన్ - సీతాకోకచిలుక

* కుంభం

ఈ రోజు మీరు పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడానికి విస్తృతమైన ప్రణాళికను రచించుకుంటారు. కానీ, అది మళ్లీ వాయిదా పడొచ్చు. సరైన సమయం కోసం వేచి చూడాలి. కుటుంబ సభ్యుల నుంచి గానీ జీవిత భాగస్వామి నుంచి గానీ మీకు వచ్చే సలహాలను పాటించడం ఈ రోజు మంచిది కాదు.

లక్కీ సైన్ - కాన్వాస్

* మీనం

కష్టతరమైన పని పూర్తి చేయడం కోసం ఎదురు చూసే వారికి ఈ రోజు అక్కడి నుంచి స్పందన రావచ్చు. మీ గత చర్యల గురించి మీరు ఈ రోజు బాధపడుతుంటారు. మీతో భాగస్వామ్యంలో ఉన్న వారు కూడా ఈ భావనను వ్యక్తపరచొచ్చు.

లక్కీ సైన్ - రెండు ఈకలు

Published by:Venkaiah Naidu
First published:

Tags: Astrology, Horoscope, Zodiac signs

ఉత్తమ కథలు