మనలో చాలా మందికి శరీరంపై నల్లటి మచ్చలు ఉంటాయి. పుట్టినప్పటి నుంచే శరీరంపై అవి కనిపిస్తాయి. వాటినే మనం పుట్టు మచ్చలని (Birth Mark) పిలుస్తాం. పుట్టు మచ్చలు శరీరంలో కొన్నిభాగాల్లో ఉంటే మంచిదని.. మరికొన్ని భాగాల్లో ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురువుతాయని మనలో చాలా మంది విశ్వసిస్తారు. పలనా చోట పుట్టు మచ్చ ఉంటే అదృష్టమని.. ఆ ప్రాంతం ఉంటే అరిష్టమని నమ్ముతుంటారు. ఐతే శరీరంపై ఉండే పుట్టు మచ్చల గురించి సాముద్రిక శాస్త్రంలో వివరించారు. ప్రతి పుట్టు మచ్చకు సొంత ప్రాముఖ్యత, అర్థం ఉంటుంది. వాటి ఆధారంతా వ్యక్తుల స్వభావాన్ని, భవితవ్యాన్ని కొంత వరకు అంచనా వేస్తుంటారు. మరి సాముద్రికశాస్త్రం ప్రకారం.. ఏ శరీరం భాగంలో పుట్టు మచ్చలు (Birth mark indication)ఉంటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టమంటే...
నుదుటిపై పుట్టు మచ్చ ఉన్న వారి మైండ్ చాలా షార్ప్‌గా ఉంటుంది. ఏదైనా నేర్చుకునే స్వభావం ఉంటుంది. ఈ రకమైన వ్యక్తులు వ్యాపారం, ఉద్యోగం.. రెండింటిలోనూ విజయాలు సాధిస్తారు. వీరు అందరికీ ప్రియమైన వారిగా ఉంటారు.
ఎవరికైనా నుదిటికి సరిగ్గా మధ్యలో పుట్టు మచ్చ ఉంటే.. వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుందని నమ్ముతారు. ఈ వ్యక్తులు ఎంతో సంతోషంగా ఉంటారు. అందువల్ల ప్రతి వ్యక్తితోనూ వీరి సంబంధం చాలా బలంగా ఉంటుంది.
ఒక వ్యక్తి తన చెంపపై మచ్చతో జన్మిస్తే... అలాంటి వ్యక్తులు ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా ఉత్సాహంగా ఉంటారని సాముద్రిక శాస్త్రంలో చెప్పారు. వీరు తన లక్ష్యాలను సాధించడానికి ఎంతకైనా వెళ్లవచ్చు. లక్ష్యం కోసం అహర్నిశలు పనిచేస్తారు.
ఎవరికైనా కుడి చెంపపై పుట్టుమచ్చ ఉంటే... వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ స్త్రీకి కుడి చెంపపై పుట్టు మచ్చ ఉంటే వారు అదృష్టవంతులు. అలాంటి మహిళలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తిని వివాహం చేసుకుంటారు.
సాముద్రికశాస్త్రం ప్రకారం... ఒక వ్యక్తికి మెడ వెనుక భాగంలో పుట్టిన గుర్తు ఉంటే.. ఈ రకమైన వ్యక్తులు చాలా దూకుడుగా ఉంటారు. వీరు అన్ని విషయాల్లో దూకుడుగా ఉంటారు. ఆవేశపూరితంగా వ్యహరిస్తారు. కోపం ఎక్కువగా ఉంటుంది.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.