Home /News /astrology /

SAGITTARIUS TO TAURUS THESE FOUR ZODIAC SIGNS ICE HEARTED AND KEEP THEMSELVES EMOTIONALLY ABSENT UMG GH

Sagittarius to Taurus: ఈ నాలుగు రాశుల వారు చాలా డిఫరెంట్.. ఎలాంటి ఎమోషన్స్ ఉండవు.. కఠినులు కూడా అంటా..! మరి మీరు ఆ రాశిలో ఉన్నారా..!

ఈ నాలుగు రాశుల వారి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

ఈ నాలుగు రాశుల వారి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

ఎమోషన్స్‌(Emotions), ఫీలింగ్స్‌(Feelings)ను నియంత్రించుకోవడం అందరికీ సాధ్యం కాదు. కొందరు తమ భావాలను బయట పెడుతారు. కొందరి ముఖంలో ఎలాంటి భావాలు కనిపించవు. ఎలాంటి ఎమోషన్స్‌కు స్పందించిన నాలుగు రాశిచక్రాలు ఇవే..

ఎమోషన్స్‌(EMotions), ఫీలింగ్స్‌(Feelings)ను నియంత్రించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఎమోషనల్‌ అయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో తీరులో స్పందిస్తారు. కొందరు వ్యక్తులు బిగ్గరగా కేకలు వేయవచ్చు, కొంతమంది తలుపుల వెనుక లేదా బెడ్‌ షీట్ కింద ఏడుస్తారు. ఇంకొందరు యాక్టివ్‌గానే ఉంటారు. వారి ముఖంలో ఎలాంటి భావాలు కనిపించవు. అలాంటి వ్యక్తులు ఎలాంటి ఆందోళన కలిగినా స్పందించకుండా ఉంటారు. అలా ఉండే వ్యక్తుల ఎమోషన్స్‌ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారి మనసు కఠినం (Ice Hearted)గా ఉంటుంది. ఎలాంటి ఫీలింగ్స్‌ను బయటపెట్టకూడదని వారు తమ మనసుకు శిక్షణ ఇస్తారు. అలానే ప్రవర్తిస్తుంటారు. ఈ వ్యక్తులు ఎమోషనల్ కోషెంట్‌లో చాలా తక్కువగా ఉంటారు. వారు తమ నిఘంటువు నుంచి సానుభూతి అనే పదాన్ని పూర్తిగా తొలగిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనసును కఠినంగా చేసుకుని, ఎలాంటి ఎమోషన్స్‌కు స్పందించిన నాలుగు రాశిచక్రాలు ఇవే..

ఇదీ చదవండి: చిన్నారి ప్రాణాలు తీసిన ఐదు రూపాయల కాయిన్.. అసలేం జరిగిందంటే..
* ధనుస్సు
ధనుస్సు రాశి వారు ఎటువంటి హద్దులు లేకుండా సంచరించడానికి ఇష్టపడే ఓపెన్-స్పిరిట్ వ్యక్తులు. అందుకే వారు ఎల్లప్పుడూ ప్రాక్టికాలిటీకి కట్టుబడి ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి సున్నితమైన వైపును దాచడానికి కూడా అదే కారణం. ఈ వ్యక్తులు స్థలాలు, వస్తువులు, వ్యక్తులతో ఎలాంటి అనుబంధాన్ని కోరుకోరు. ఎందుకంటే ఈ వ్యక్తులు చాలా సెల్ఫ్‌ సెంటర్డ్‌గా ఉంటారు. తమ అభిరుచి, ఆశయంపై దృష్టి పెట్టాలని కోరుకుంటారు.


* కుంభ రాశి
వాయు సంకేతం అయినందున, కుంభం అసాధారణమైనది, నియంత్రించలేనిది. కుంభ రాశికి చెందిన వారి హృదయం చాలా క్రూరంగా ఉంటుంది. ఈ రాశిచక్రానికి చెందిన వ్యక్తులు చాలా ప్రతిభావంతులు, వారి జీవిత బాధలన్నింటినీ పరిష్కరించడానికి వారి లాజికల్‌ థింకింగ్‌ను ఉపయోగిస్తారు. బాధాకరమైన కథనాలను వినడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే ఎమోషనల్‌ కంటెంట్‌కు దూరంగా ఉంటారు. తమ భావోద్వేగాలను పూర్తిగా తొలగిస్తారు.



* కన్య
ఈ భూమి గుర్తు విశ్లేషణాత్మకమైనది, బలమైంది, భూమి వలె కఠినమైంది. కన్య రాశి వారు తమను ఎవరైనా నియంత్రించడాన్ని ఇష్టపడరు. అందువల్ల వారు తమ మనస్సును ఎల్లప్పుడూ తమ అదుపులో ఉంచుకునేలా శిక్షణ ఇస్తారు. ఈ రాశిచక్రం ఉన్న వ్యక్తులు చిన్న చిన్న విషయాలను కూడా ప్లాన్ చేస్తారు. వారి కెరీర్, లక్ష్యం, ఆశయంపై దృష్టి పెట్టాలని కోరుకుంటారు. అందుకే వారు ఎల్లప్పుడూ ఆర్గనైజ్డ్‌గా, స్థిరంగా ఉంటారు.

* వృషభం
వృషభ రాశికి చెందిన వారు ఎవరైనా తమ మార్గంలో జోక్యం చేసుకుంటే ఇష్టపడరు. ఈ రాశిచక్రం ఉన్న వ్యక్తులు బలంగా, మొండిగా ఉంటారు. ఒక నిర్దిష్ట మార్గంలో చేయవలసిన పనులను ఇష్టపడతారు. వారికి ఎవరి గురించి అయినా ఆలోచించడం నచ్చదు. వారు ప్రాక్టికల్‌గా, మెటీరియలిస్టిక్‌గా ఉంటారు.. దీంతో ఎదుటి వారి సెంటిమెంట్స్‌ గురించి ఆలోచించరు. తమ లక్ష్యానికి ఎవరైనా అడ్డుగా వస్తే వీలైనంత త్వరగా దాటుకుని వెళ్లిపోతారు.
Published by:Mahesh
First published:

Tags: Astrology, Zodiac, Zodiac sign

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు