హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Sabarimala: నేటి నుంచి శబరిమల మండల పూజ... భక్తులు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే

Sabarimala: నేటి నుంచి శబరిమల మండల పూజ... భక్తులు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే

Sabarimala: నేటి నుంచి శబరిమల మండల పూజ... భక్తులు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Sabarimala: నేటి నుంచి శబరిమల మండల పూజ... భక్తులు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Sabarimala | శబరిమలలో మండల పూజ (Sabarimala Mandala Pooja) నేటి నుంచి ప్రారంభం కానుంది. అయ్యప్ప భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించింది కేరళ ప్రభుత్వం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

శబరిమలలో మండల పూజ (Sabarimala Mandala Pooja) నేటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 27 వరకు మండల పూజ కొనసాగుతుంది. ఇప్పటికే ట్రావెన్‌కోర్ దేవోసమ్ బోర్డ్ (Travancore Devaswom Board) వర్చువల్ క్యూ టోకెన్ల జారీని ప్రారంభించింది. అయ్యప్ప భక్తులు https://sabarimalaonline.org/ వెబ్‍‌సైట్‌లో టోకెన్లు బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ క్యూ టోకెన్లు బుక్ చేసిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుందని ట్రావెన్‌కోర్ దేవోసమ్ బోర్డ్ గతంలోనే వెల్లడించింది. మరోవైపు కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి.

చేయాల్సినవి ఇవే...

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు కొంత దూరం కాలినడకన వెళ్తుంటారు. కాలినడకన వెళ్లే భక్తులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 10 నిమిషాలు కొండ ఎక్కిన తర్వాత 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. మరకూట్టం, సారంకూతి, నడపంతాల్ మార్గంలోనే అయ్యప్ప భక్తులు వెళ్లాలి. పతినెట్టంపాడి చేరుకోవడానికి క్యూ పద్ధతి పాటించాలి. తిరుగు ప్రయాణంలో నడపంతాల్ ఫ్లైఓవర్ ఉపయోగించాలి. దేవస్థానం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ మాత్రమే ఉపయోగించాలి. రద్దీని దృష్టిలో పెట్టుకొని పంపా నుంచి సన్నిధానం వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.

Sabarimala Trains: హైదరాబాద్ , నర్సాపూర్ నుంచి శబరిమలకు మరో 14 ప్రత్యేక రైళ్లు

డోలీ ఉపయోగించేవాళ్లు ట్రావెన్‌కోర్ దేవోసమ్ బోర్డ్ కౌంటర్‌లో డబ్బులు చెల్లించి రిసిప్ట్ తీసుకోవాలి. ఏదైనా సాయం అవసరమైతే పోలీసుల్ని ఆశ్రయించాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లైసెన్స్‌డ్ ఔట్‌లెట్స్ నుంచే ఆహారపదార్థాలు కొనాలి. పంపా, సన్నిధానం, ట్రెక్కింగ్ మార్గాలను శుభ్రంగా ఉంచాలి. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలపాలి. చెత్తను కుండీల్లోనే వేయాలి. అవసరమైతే వైద్య కేంద్రాలు, ఆక్సిజన్ పార్లర్లను ఉపయోగించాలి. చిన్న పిల్లలు, వృద్ధుల్ని తీసుకెళ్తే వారి మెడలో అడ్రస్, ఫోన్ నెంబర్లతో ఐడీ కార్డుల్ని వేయాలి. ఎవరైనా తప్పిపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

Sabarimala: శబరిమల భక్తులకు శుభవార్త... నిమిషానికి ఓ బస్సు నడపనున్న కేరళ ఆర్‌టీసీ

ఇవి చేయకూడదు

అయ్యప్ప భక్తులు ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు. పంపా, సన్నిధానంతో పాటు దారిలో పొగ త్రాగకూడదు. మద్యం, డ్రగ్స్ తీసుకోకూడదు. క్యూలైన్ జంప్ చేయకూడదు. క్యూలో ఉన్నప్పుడు హడావుడిగా ముందుకు వెళ్లకూడదు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను తీసుకెళ్లొద్దు. గుర్తింపు లేని వ్యాపారుల నుంచి ఏమీ కొనకూడదు. ఏ సర్వీసుకైనా అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. పతినెట్టంపాడిపై కొబ్బరికాయలు కొట్టకూడదు. పతినెట్టంపాడి పరిసరాల్లో నిర్దేశిత స్థలాల్లో తప్ప ఇతర చోట్ల కొబ్బరికాయలు కొట్టకూడదు. పద్దెనిమిది మెట్లను మోకాలిమీద ఎక్కకూడదు. అప్పర్ తిరుమట్టం, తంత్రినాడలో విశ్రాంతి తీసుకోకూడదు. సన్నిధానంలో స్టవ్, కుకింగ్ గ్యాస్ ఉపయోగించకూడదు. మంటలు అంటుకుంటే వెంటనే ఆర్పేయాలి.

First published:

Tags: Ayyappa devotees, Ayyappa mala, Sabarimala, Sabarimala Temple

ఉత్తమ కథలు