హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rashi Phalalu Today: జులై 8 దిన ఫలాలు.. ఈ రోజు వీరు ఇతరులపై ఆధారపడకూడదు..

Rashi Phalalu Today: జులై 8 దిన ఫలాలు.. ఈ రోజు వీరు ఇతరులపై ఆధారపడకూడదు..

Rashi Phalalu Today

Rashi Phalalu Today

Rashi Phalalu Today: జులై 8వ తేదీ శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

ఓ రాశివారు గతంలో చేసిన పనులకు సంబంధించి గిల్టీగా ఫీల్‌ అవుతున్నారు. మరోరాశికి చెందిన వారు పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నా వాయిదాలు పడుతూ ఉంటాయి. ఇంకొకరు అనవసరంగా మానసికంగా ఇతరులపై ఆధార పడుతున్నారు. మరొకరి నాయకత్వ లక్షణాలు ప్రశంసలు అందుకుంటాయి. వారి పర్‌ఫెక్షన్‌ దూరం నుంచే కొందరు ఇష్టపడుతారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. జులై 8వ తేదీ శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

* మేషం : ఎదురుచూస్తున్న వారికి ప్రతిస్పందించడం కష్టమైన పని కావచ్చు. మీ గత చర్యలకు సంబంధించి మీకు ప్రస్తుతం చాలా అపరాధభావం ఉంది. మీతో భాగస్వామ్యమైన వ్యక్తి కూడా అదే విషయాన్ని మీకు గుర్తు చేస్తూనే ఉన్నారు.

లక్కీ సైన్- మిర్రర్‌ ఇమేజ్‌

* వృషభం : పెండింగ్‌లో ఉన్న మీ పనిని పూర్తి చేయడానికి మీరు విస్తృతమైన ప్రణాళికలు వేస్తూ ఉండవచ్చు, కానీ అది మరింత వాయిదా పడుతూ ఉండవచ్చు. కుటుంబం లేదా జీవిత భాగస్వామి నుండి వచ్చే ఏవైనా సలహాలు ప్రస్తుతానికి మీకు సంబంధించినవి కాకపోవచ్చు. పెట్టుబడికి మంచి సమయం.

లక్కీ సైన్- సిల్వర్‌ క్యాండిల్‌

* మిథునం : దాచి ఉంచిన సమాచారానికి సంబంధించి లేదా ఏదైనా సవాలును నిర్వహించడానికి మీలోని ఉత్సాహంతో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చాలా సన్నిహితంగా విశ్వసించే వ్యక్తి మీ వివరాలను ఇతరులతో పంచుకునే స్వభావం ఉన్నవారు. మీరు వారిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు.

లక్కీ సైన్- జెమ్‌స్టోన్‌

* కర్కాటకం : ఇంత పరిమిత సమయంలో మీ మానసిక సామర్థ్యం, చురుకుదనంతో మీరు సృష్టించిన ప్రభావం ప్రశంసలు పొందేందుకు అర్హమైంది. మీరు కొత్త వ్యాపార ఆలోచన గురించి ఆలోచిస్తున్నట్లయితే, అది మీకు అనుకూలంగా త్వరలో పని చేస్తుంది. పార్ట్‌నర్‌షిప్‌ ఏర్పరుచుకోవచ్చు.

లక్కీ సైన్- ఎల్లో స్టోన్‌

* సింహం : మీ పని తీరుపై గతంలో ఇద్దరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులు ఇప్పుడు మారాలి. ఆర్థిక లాభాలు కొనసాగుతాయి. మీరు భాగస్వామ్యంతో త్వరలో ఓ కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకునే సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్- క్యాండిల్‌

* కన్య : మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. మీరు దానిని ప్రదర్శించినందుకు సత్కారాలు కూడా అందుకొనే అవకాశం కనిపిస్తోంది. మీరు డీటైల్‌, పర్‌ఫెక్షన్‌ కోసం ఆలోచిస్తారు కాబట్టి, ఎవరైనా మిమ్మల్ని దూరం నుంచే మెచ్చుకుంటారు.

లక్కీ సైన్- బుద్ధుడి విగ్రహం

* తుల : మీ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన, సంబంధిత వార్తలు వేచి ఉండవచ్చు. మీ పరిసరాల్లో ఒక ఊహించని యాక్టివిటీ దృష్టిని ఆకర్షించవచ్చు. బాగా తెలియని వారికి రుణాలు ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నించండి.

లక్కీ సైన్- ఇండోర్‌ ప్లాంట్‌

* వృశ్ఛికం : మీరు కొంతకాలంగా కలుసుకోని వారి ద్వారా మీకు సాదర స్వాగతం లభించే అవకాశం ఉంది. శక్తులు మిమ్మల్ని దాని వైపు మళ్లిస్తున్నందున మీరు విలాసవంతమైన వస్తువులలో మునిగిపోవచ్చు. మీలో కొందరు విదేశాలకు కూడా విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటూ ఉండవచ్చు.

లక్కీ సైన్- ఛాంబర్‌

* ధనస్సు : మీలో దాచిన భావోద్వేగాలు మీ ద్వారా చూడగలిగే వారికి ఇప్పుడు కనిపించవచ్చు. మీరు అనవసరంగా వేరొకరిపై మానసికంగా ఎక్కువగా ఆధారపడుతున్నారు. మీరు అలాంటివి విడిచిపెట్టి స్వతంత్రంగా కదలాలి.

లక్కీ సైన్- క్లైంబర్‌

* మకరం : మీరు ఎవరితోనైనా భాగస్వామి కావాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం సరైనది. పెద్ద ఫోరమ్‌లో ప్రతి ఒక్కరితో, ప్రతి ప్రణాళికను పంచుకోకపోవడమే మంచిది. మీరు కూడా అనవసరంగా ఒత్తిడి పెంచుకోకూడదు.

లక్కీ సైన్- సీతాకోక చిలుక

* కుంభం :ఈ రోజు, బేసిక్స్‌కు కట్టుబడి ఉండటం గొప్ప సహాయంగా కనిపిస్తుంది. మీరు తప్పక ప్రయత్నించాలి. మీరు ప్రాక్టీస్ చేస్తున్న ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఉండాలి. ఆ విధంగా మీరు పురోగతిని సాధించగలరు. మనస్సులో స్పష్టతను పొందగలరు. నిర్ణయం తీసుకోవడం కొంత కాలం వాయిదా వేయవచ్చు.

లక్కీ సైన్- కేన్వాస్‌

* మీనం : మీరు కొత్త వెంచర్ కావచ్చు, ప్రాజెక్ట్ ఓరన్ అసైన్‌మెంట్ కావచ్చు, ఏదైనా కొత్తగా ప్రారంభించాలని ప్రయత్నిస్తుంటే, అలా చేయడానికి ఇది మంచి రోజు. అయితే మీరు మీ హోంవర్క్‌ని బాగా చేశారా? లేదా? పరిశీలించుకోండి. మీరు మీ గురించి అంచనా వేసుకున్న దానికంటే మీ సామర్థ్యం చాలా ఎక్కువ.

లక్కీ సైన్- రెండు ఈకలు

Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Horoscope Today, Rashi Phalalu, Zodiac signs

ఉత్తమ కథలు