Home /News /astrology /

RASI PHALALU TODAY 30TH JUNE 2022 HOROSCOPE TODAY ASTROLOGY PREDICTIONS FOR ZODIAC SIGNS GH PJC MKS

Rasi Phalalu : (జూన్ 30) దిన ఫలం : కొత్త అవకాశం మీకు రాబోతోంది..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జూన్ 30 గురువారం నాడు.. మేషం నుంచి మీనం వరకు ఏ రాశికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం..Today horoscope (30 June 2022) ఇవాళ (30 జూన్ 2022, గురువారం). జ్యోతిష్యం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంది. వీటిని నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జూన్ 30 గురువారం నాడు.. మేషం నుంచి మీనం వరకు ఏ రాశికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం.

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : మీకు దగ్గరగా ఉన్నవారికి మీ మద్దతు అవసరం కావచ్చు. ఇది కొన్ని పాయింట్లపై భిన్నాభిప్రాయాలకు దారితీయవచ్చు. కానీ దాన్ని పరిష్కరించడం విలువైనదే. అధికారంలో ఉన్న వ్యక్తిని సంప్రదించేటప్పుడు మీరు సంకోచించవచ్చు లేదా చిన్న నిరాశను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా కొత్త పొత్తుల కోసమైతే.
లక్కీ సైన్ - మనీ ప్లాంట్

* వృషభం (ఏప్రిల్ 20-మే20) : ఈ రోజు మీరు పాల్గొనే వేడుక ఆనందంతో నిండి ఉంటుంది. అయితే మీరు పాల్గొనకపోతే అది కళ తప్పుతుంది. మీకు ఇక్కడ కచ్చితమైన ఆప్షన్‌ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
లక్కీ సైన్- రెడ్ డెకోర్

* మిథునరాశి (మే 21- జూన్ 21) : నగదు ప్రవాహంలో పెరుగుదల, మీ ఆశలను పెంచుతుంది. మీరు దేనికైనా బానిసలైతే మీ అలవాట్లలో మెరుగుదల కనిపించవచ్చు. గృహిణులకు తీరిక లేకుండా ఉంటుంది. కొత్త షెడ్యూల్‌కు సమయం సర్దుబాటు చేయడంలో కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు.
లక్కీ సైన్ - మృదువైన బొమ్మ

* కర్కాటకం (జూన్ 22- జూలై 22) : గందరగోళంగా ఉన్న మనసుతో వ్యవస్థీకృత ఆలోచనల ప్రవాహం అంతరాయానికి దారితీయవచ్చు. అంతర్గతంగా ప్రతిబింబించేందుకు మీరు కొంత నిశ్శబ్ద సమయంలో గడపాలి. గార్మెంట్స్ వ్యాపారంలో ఉన్న వారు డిమాండ్ పెరగడం వల్ల కొంత పెరుగుదలను చూస్తారు.
లక్కీ సైన్- సిగ్నల్

* సింహ (జూలై 23- ఆగస్టు 22) : తదుపరి ఎలా వ్యవహరించాలో మీకు ఇప్పటికే కొంత క్లూ ఉంది. కానీ మీరు ఇప్పటికీ ఆ ఆలోచనకు వంద శాతం సమయం కేటాయించలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరు గతంలో చేసిన దాని గురించి ఇప్పుడు రివార్డ్ లేదా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
లక్కీ సైన్- బైక్

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న విషయంలో, విస్తరణ ప్రణాళిక ప్రస్తుతం సిద్ధంగా ఉంది. ఎలా అంటే ఒక విత్తనం మొక్కగా ఎదిగినట్లు ఉంటుంది. మీరు పర్యటనలో ఉన్నప్పుడు శృంగార ఆసక్తి ఉన్న వారిని కలుసుకోవచ్చు.
లక్కీ సైన్- ఈక

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : గెట్ టుగెదర్ లేదా విహారయాత్ర లేంటే పార్టీ మీకోసం సిద్ధంగా ఉంది. రోజులోని రెండో సగం మొదటి భాగం కంటే రిఫ్రెష్‌గా, ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బద్దకంగా, రిలాక్స్‌డ్‌గా ఉండే క్షణాలను ఆశించవచ్చు.
లక్కీ సైన్ - కచేరీ

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : మీస్థిర భావనలతో ఇతరులకు సమస్య ఉండవచ్చు. కానీ మీరు వాటి గురించి చాలా నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మీరు మీ అంతర్గత ప్లెక్సిబులిటీపై కొంచెం పని చేయాల్సి రావచ్చు. కొన్ని నెలల క్రితం మీకు మంచి అవకాశం వచ్చింది. అది మళ్లీ రావచ్చు.
లక్కీ సైన్ - కొత్త పుస్తకం

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : చాలాకాలం తర్వాత, మీరు మరింత బ్యాలన్స్డ్‌గా, మీ చుట్టూ జరుగుతున్న చాలా ముఖ్యమైన విషయాల పట్ల స్పష్టతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగడానికి స్పష్టమైన ప్రణాళికను రూపొందించండి. మీరు గతంలో ఎవరికైనా లోన్ ఆఫర్ చేస్తే, అది త్వరలో తిరిగి రావచ్చు.
లక్కీ సైన్- పియానో

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) : కొంతమంది వ్యక్తులు మీ అధికార స్థానం కోసం ప్రయత్నించి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ అయిష్టాన్ని వ్యక్తం చేయవచ్చు. టీనేజర్లు గందరగోళ సమయాన్ని ఎదుర్కోవచ్చు.
లక్కీ సైన్- స్కేర్ బాక్స్

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : మీరు భావోద్వేగ స్వభావాన్ని విడిచిపెట్టి, ప్రాక్టికల్‌గా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉండవచ్చు. జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు తటపటాయించవచ్చు. కొన్ని సర్దుబాట్లను కోరే కొత్త అవకాశం మీకు రాబోతోంది.
లక్కీ సైన్ – గిఫ్ట్ బాక్స్

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : మీరు కొత్తదాన్ని అంగీకరించడానికి, తదుపరి వచ్చే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న మానసిక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మీ మనసు స్థిరంగా ఉండట్లేదు. ఇప్పుడు మీ భయాలను విడిచిపెట్టి ముందుకు సాగాలి. కాస్మిక్ డిజైన్ ప్రకారం ప్రతిదీ జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
లక్కీ సైన్- క్లాక్ టవర్

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac Sings

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు