Home /News /astrology /

RASI PHALALU TODAY 2ND JULY 2022 THESE ZODIAC SIGNS DO NOT GIVE ANY GUARANTEES THIS DAY ASTROLOGY PREDICTION GR SRD

Rasi Phalalu : (జూలై 2, 2022) దినఫలం : ఈ రోజు వీరికి ఆకస్మిక ధనలాభం.. వారు మాత్రం అనవసర హామీలు ఇవ్వొద్దు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rasi Phalalu : నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జూలై 2 శుక్రవారం నాడు.. మేషం నుంచి మీనం వరకు ఏ రాశికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం..

    Today horoscope (2nd July 2022) ఇవాళ (2 జులై 2022, శనివారం). జ్యోతిష్యం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంది. వీటిని నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జూలై 2 శనివారం నాడు.. మేషం నుంచి మీనం వరకు ఏ రాశికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం.

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : సానుకూల వాతావరణం నెలకొని ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకు౦టారు. రుణాలు తీరుస్తారు. వృత్తి నిపుణులు సునాయాసంగా లాభాలు ఆర్జిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా వస్తాయ్.

    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఉద్యోగపరంగా మీరిప్పుడు తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూల సమయం. అరోగ్యం పరవాలేదు. హామీలు ఉండొద్దు.

    మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబపరంగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే
    మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్నివిధాలా అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. తగినంత ప్రయత్నం చేస్తే అదృష్టం మీదవుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ప్రశాంతత చేకూరుతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులకు చాలా బాగుంది.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. అరోగ్యం జాగ్రత్త వ్యాపారం నిలకడగా సాగిపోతుంది.

    కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : ఉద్యోగంలో ఉత్సాహంతో పని చేస్తారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు డబ్బు లభిస్తుంది. ఆదాయానికి సంబంధించి మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో సమస్యలెదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. చదువులో పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది.

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. కుటుంబపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనలాభ సూచనలున్నాయి. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య౦ పట్ల జాగ్రత్త.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) :ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ప్రయత్నాల్ని కొనసాగిస్తే విజయం సిద్ధిస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నాంది పలుకుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంది.

    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయ్. కాలం అనుకూలంగా ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబ సమస్యల పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 1,2) : ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. సంపద పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

    కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. సమయం అంతగా అనుకూలంగా లేదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య కార్యాలు వాయిదా వేయడ౦ మంచిది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తారు. అనుకూలమైన సమయం ఇది. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి
    వస్తుంది. మీ నుంచి సహాయం కోరీ వారుంటారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashi Phalalu, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు