Home /News /astrology /

RASI PHALALU TODAY 28TH MAY 2022 HOROSCOPE TODAY IN TELUGU KNOW YOUR ASTROLOGY ZODIAC SIGNS GH PJC MKS

Rasi Phalalu : (మే 28) దిన ఫలాలు : మిమ్మల్ని కలవరపెడుతున్న దశ ముగియబోతోంది..

దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు నేటి దిన ఫలాలు అంచనా వేశారు. మే 28వ తేదీ శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

ఇవాళ (28 మే, 2022, శనివారం) ఓ రాశివారికి కాంట్రాక్ట్‌ క్లోజ్‌ చేయడానికి మార్గం లభిస్తుంది. ఆర్థిక అంశాల్లో ఉపశమనం లభిస్తుంది. మరో రాశికి చెందిన వారి కోసం స్నేహితుడు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకొనే వారికి అనుకూల సమయం. నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు నేటి దిన ఫలాలు అంచనా వేశారు. మే 28వ తేదీ శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)
మీరు కాంట్రాక్ట్‌ను క్లోజ్‌ చేయడానికి కష్టపడుతూ ఉండవచ్చు, ఇప్పుడు అలా చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. మీ మనస్సును ఒత్తిడి నుంచి దూరంగా ఉంచడానికి ఎక్కువ పనుల్లో నిమగ్నమవడానికి ప్రయత్నించండి. మీరు మీ ఆర్థిక విషయాలలో కొంత ఉపశమనం పొందవచ్చు.
లక్కీ సైన్- క్లియర్‌ క్వార్ట్జ్‌ క్రిస్టల్‌

* వృషభం (ఏప్రిల్ 20-మే20)
మీరు నమ్ముతున్న వ్యక్తి గురించి అనుకోకుండా నిజం తెలుసుకుంటారు. సన్నిహిత మిత్రుడు మీ కోసం ఒక సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తూ ఉండవచ్చు. కార్యాలయంలో కోపం ప్రదర్శిస్తే భవిష్యత్తులో పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి.
లక్కీ సైన్- ఈక

* మిథునం (మే 21- జూన్ 21)
మిమ్మల్ని కలవరపెడుతున్న తాత్కాలిక దశ ఇప్పుడు ముగియబోతోంది. మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడే ముందడుగు వేయవచ్చు. మీ గురించి, ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకునేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారు.
లక్కీ సైన్- షైనింగ్‌ స్టార్‌

* కర్కాటకం (జూన్ 22- జూలై 22)
మీరు నిజమైన ప్రయత్నం చేసినట్లయితే, చింతించాల్సిన అవసరం లేదు. మీ పనిని అంచనా వేసే ఎవరైనా బయటి వ్యక్తికి.. మీ గురించి మంచి అభిప్రాయం కలుగుతుంది. మీకు మేలు చేయని వారందరికీ కర్మ తిరిగి వస్తుంది.
లక్కీ సైన్- డీప్‌ బ్లూ స్కై

* సింహం (జూలై 23- ఆగస్టు 22)
గతంలో చేసిన చిన్న చిన్న పనులు ఇప్పుడు పెద్ద ఫలితాలను ఇవ్వవచ్చు. మీ హృదయం ఏదైనా అంశం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే.. మీ మనసు చెబుతున్న సూచనలను విశ్వసించండి. మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబం సపోర్ట్‌ ఉంటుంది.
లక్కీ సైన్- న్యూ రోడ్

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)
మీ భయాలను అణచివేయడం మానేయండి, ఇప్పుడు వాటిని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. మీరు వదిలేసిన పనులను అక్కడి నుంచి తిరిగి ప్రారంభించండి. మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటే, మీరు ఆ సమాచారాన్ని పొందే అవకాశం ఉంది.
లక్కీ సైన్- ఎల్లో స్టోన్‌

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23)
మీ మనస్సులో పరిష్కారం కాని సమస్య ఉంటే, దాని నుంచి దూరం అయ్యే మార్గం వెతకండి. ఇది అనవసరమైన ఒత్తిడిని, పరధ్యానాన్ని దూరం చేస్తుంది. మీ జ్ఞాపకాల్లో నుంచి మీరు తీసేసిన వ్యక్తి, మిమ్మల్ని తిరిగి కలవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.
లక్కీ సైన్- మెరిస్తే వస్త్రం

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21)
మీరు గతంలో సాధించిన దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని ఆశించవచ్చు. మీరు దాని గురించి మరచిపోయి ముందుకు సాగడం మేలు. జీవితం మీకు ఓ సర్‌ప్రైజ్‌ను ఇస్తుంది, అది మీకు శుభవార్తే అవుతుంది. ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య ఉన్నట్లు అనిపిస్తుంది.
లక్కీ సైన్- సిల్క్‌ పౌచ్‌

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఒక కొత్త ప్రేరణ అసాధారణమైన పని చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇటీవల మీరు ప్రెజెంట్‌ చేసిన దానికి మిశ్రమ ప్రతిస్పందన ఉండవచ్చు. మీరు అదే పనిలో మళ్లీ పని చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
లక్కీ సైన్- చిమ్నీ

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
అసూయ సంకేతాలను విస్మరించవద్దు. ఆఫీసులో మీ పని గురించి విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, దానిని మరికొంత కాలం వాయిదా వేయడానికి ప్రయత్నించండి. వారసత్వ సమస్య ఇప్పుడు పరిష్కారమవుతుంది.
లక్కీ సైన్- సీ సాల్ట్‌

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18)
సింపుల్‌ పద్ధతిలో అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. మీ వెనుక ఎవరైనా మీ గురించి ఫిర్యాదు చేస్తే.. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. చిన్న చిన్న దొంగతనం కేసులు ఎదురయ్యే అవకాశం ఉంది.. నిశితంగా గమనించాలి. తల్లికి భావోద్వేగ మద్దతు అవసరం.
లక్కీ సైన్- ల్యాంప్‌ షేడ్‌

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ఇది మార్పుల సీజన్, ఉద్యోగంలో మార్పు కావచ్చు, ఛాయిస్‌లలో మార్పు లేదా అలవాటు మార్పు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, అది మంచి కోసం ఉంటుంది. మీరు స్వీయ ప్రేరణ పొందుతారు. ఆర్థిక లాభాలకు సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- నెమలి
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు