Home /News /astrology /

RASI PHALALU TODAY 27TH MAY 2022 HOROSCOPE TODAY IN TELUGU KNOW YOUR ASTROLOGY ZODIAC SIGNS GH PJC MKS

Rasi Phalalu : (మే 27) దిన ఫలాలు : మానసిక స్థితిని శారీరక శ్రమకు అనుగుణంగా ఉంచండి..

దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా నేటి దిన ఫలాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 27వ తేదీ శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తెలుసుకోండి.

ఇవాళ (27 మే, 2022, శుక్రవారం). ఓ రాశివారు ఓ వ్యక్తి వల్ల డిస్‌ట్రాక్ట్‌ అవుతారు. ఫ్యూచర్‌ప్లాన్‌ చేసుకోవడానికి కొంత సమయం కావాలి. మరికొందరికి ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొందరి జీవితంలో తదుపరి అధ్యాయం త్వరలో ప్రారంభం కానుంది. నక్షత్రాల గమనం ఆధారంగా నేటి దిన ఫలాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 27వ తేదీ శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తెలుసుకోండి.

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)
ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. మీ చుట్టూ ఇటీవల జరిగిన కొన్ని అంశాల కారణంగా మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీకు తెలిసిన వ్యక్తి న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకొనే అవకాశం ఉంది.
లక్కీ సైన్- సస్మాల్‌ ప్లాంటెర్‌

* వృషభం (ఏప్రిల్ 20-మే20)
ఒక కొత్త వ్యక్తి డిస్‌ట్రాక్షన్‌ తీసుకురావచ్చు. మీరు గందరగోళాన్ని ఎదుర్కోవాల్సిన వైపు ఉన్నట్లు భావించే సూచనలు ఉన్నాయి. మీరు చేయలేని పనులకు సంబంధించిన హామీలు ఇవ్వకపోవడం మంచిది.
లక్కీ సైన్- రఫుల్‌

* మిథునం (మే 21- జూన్ 21)
ఇటీవల పూర్తి అయిన కొన్ని పనుల కారణంగా మీరు బాగా అలసిపోయినట్లు ఫీల్‌ అవుతారు. మీ ఫ్యూచర్‌ను ప్లాన్‌ చేసుకోవడానికి మీకు కొంత సమయం అవసరం. అవసరంలో ఉన్న ఎవరైనా మీ సహాయం కోసం వేచి ఉండవచ్చు.
లక్కీ సైన్- సిల్వర్‌ స్ట్రింగ్‌

* కర్కాటకం (జూన్ 22- జూలై 22)
షాపింగ్‌లో ఈ రోజు మీరు పూర్తిగా నిమగ్నమవ్వచ్చు. పనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన డెడ్‌లైన్స్‌ ఉన్నాయి. ఇంట్లో చిన్న చిన్న అంశాల్లో అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ సైన్- గోల్డెన్‌ స్పూన్‌

* సింహం (జూలై 23- ఆగస్టు 22)
మీరు ఇంతకు ముందు వదులుకున్న అవకాశం తిరిగి లభించే సూచనలు ఉన్నాయి. ఏదైనా విషయానికి సంబంధించి అతిగా ఆలోచించడం మంచిది కాదు. మీరు కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవచ్చు. బ్యాకప్ తీసుకోవడం మర్చిపోకండి.
లక్కీ సైన్- డైమండ్‌ రింగ్‌

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)
చాలెంజింగ్‌ టైమ్‌లో మీకు సపోర్ట్‌ లభించే అవకాశం ఉంది. కానీ ఎవరినైనా అనుకోకుండా కలవడం అనుకూల ఫలితాను ఇస్తుంది. మీకు కొంచెం హడావిడిగా అనిపించవచ్చు కానీ విషయాలు చివరికి సర్దుకుంటాయి.
లక్కీ సైన్- మట్టి కుండ

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23)
ఒక గెట్‌ టుగెదర్‌ మీకు ఆసక్తికరమైన సంభాషణలకు అవకాశం ఇస్తుంది. మిమ్మల్ని అడ్మైర్‌ చేసే వ్యక్తి ఇప్పుడు మీ దృస్టిని ఆకర్షించవచ్చు. సుదీర్ఘ నడక మీరు వెతుకుతున్న చాలా అవసరమైన సమయాన్ని ఇస్తుంది.
లక్కీ సైన్- ఫిష్‌నెట్‌

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21)
మీరు అధికారం చెలాయించే స్థానంలో ఉన్నట్లు ఫీల్‌ అవుతారు. అవసరాలకు డబ్బు దగ్గర ఉన్నట్లు అనిపించవచ్చు. మీరు దృఢమైన ఉద్దేశ్యంతో ఉన్న ఏదైనా త్వరలో మీకు అనుకూలంగా కనిపించవచ్చు. కుటుంబ సభ్యులలో ఎవరితోనైనా ఘర్షణకు దూరంగా ఉండండి.
లక్కీ సైన్- స్టోరేజ్‌

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
మీకు కేటాయించిన పని వాయిదా పడవచ్చు లేదా మీకు సమయం తక్కువగా ఉండవచ్చు. ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. మీ తండ్రి మీకు ఏదైనా పని అప్పజెబితే, మీరు దానితో పరుగెత్తాలి. మీ మానసిక స్థితిని మీ శారీరక శ్రమకు అనుగుణంగా ఉంచండి.
లక్కీ సైన్- ఉప్పునీటి సరస్సు

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
విభిన్నమైన ప్రయాణం చాలా ప్రశాంతతను కలిగిస్తుంది. కొంతమంది పాత స్నేహితులు ఈ వారం మీతో కలవాలని చూస్తున్నారు. మీరు తప్పనిసరిగా ప్రయత్నించాలి. మీ చెల్లాచెదురైన ఆలోచనలను సేకరించి, ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలి.
లక్కీ సైన్- పేపర్‌ ప్లేట్‌

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18)
మీ పని కొత్త వ్యక్తి నుంచి ప్రశంసలు అందుకోవచ్చు. మీరు మీ రిలేషన్‌లో ఇబ్బందులు పడిఉంటే.. పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఒకరి నష్టం మరొకరికి లాభంగా మారవచ్చు.
లక్కీ సైన్- తెల్ల రోజాపూలు

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
మీరు కొన్ని వైద్య సమస్యల వల్ల డిస్‌ట్రాక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. మీతో చాలా సన్నిహితంగా పనిచేస్తున్న భాగస్వామికి కొన్ని కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంది. మీ జీవితంలోని తదుపరి అధ్యాయం త్వరలో ప్రారంభం కానుంది.
లక్కీ సైన్- పసుపు వస్త్రం
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు