Home /News /astrology /

RASI PHALALU TODAY 26TH JUNE 2022 HOROSCOPE TODAY ASTROLOGY PREDICTIONS FOR ZODIAC SIGNS GH PJC MKS

Rasi Phalalu : (జూన్ 26) దిన ఫలం : ధన ప్రవాహం ఉంటుంది..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

జూన్ 26, ఆదివారం నాడు కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి డబ్బు ప్రయోజనాలు అందుతాయి. వివిధ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

Today horoscope (26 June 2022) ఇవాళ (26 జూన్ 2022, ఆదివారం). జ్యోతిష్యం ప్రకారం వివిధ రాశుల వారికి ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయవచ్చు. జూన్ 26, ఆదివారం నాడు కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి డబ్బు ప్రయోజనాలు అందుతాయి. వివిధ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : నిరాడంబరంగా ఉంటే ఇతరుల విశ్వాసాన్ని పొందడం ప్రారంభిస్తారు. మీరు దీన్ని అనుసరిస్తుంటే ఎక్కువ ప్రతిఘటన లేకుండానే విషయాలు జరుగుతాయి. మీ పిల్లలు మీ సంతోషానికి ప్రధాన కారణం కావచ్చు. ఉద్యోగం కోసం ప్రయాణం వాయిదా పడుతూ ఉంటే, అది నేడు కార్యరూపం దాల్చవచ్చు. ప్రస్తుతానికి దినచర్యకు కొద్దిగా విరామం ఇచ్చి ఇతర బాధ్యతలకు హాజరు కావచ్చు. క్యాష్ ఫ్లో ఉంటుంది, ఒత్తిడి నియంత్రణలో ఉండవచ్చు.
లక్కీ సైన్- బ్లాక్ టూర్మాలిన్

* వృషభం (ఏప్రిల్ 20-మే20) :  జీవితం తక్కువ సవాలుగా అనిపించవచ్చు, మీరు ఎత్తుకు ఎగరడానికి కొత్త స్ఫూర్తిని పొందవచ్చు. ఒక మాజీ సహోద్యోగి వ్యక్తిగత పని కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. పరిమిత అవకాశాలు ఉన్నాయి, మీ కోసం ఒకదాన్ని కనుగొనవచ్చు. ఇది రిసీవింగ్ టైమ్, మీరు దానిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అణచివేసుకున్న భావోద్వేగాలు బహిరంగంగా ప్రదర్శితం కావచ్చు, ఇతరుల దృష్టిని మరల్చవచ్చు. గతంలోని ఆర్థిక పురోగతి కొంత కాలానికి స్థిరంగా మారవచ్చు.
లక్కీ సైన్ - క్లియర్ క్వార్ట్జ్

* మిథునరాశి (మే 21- జూన్ 21) :  విశ్వం ప్రస్తుతం మీ అవసరాలు, కోరికల ఆధారంగా తగిన సర్దుబాట్లు చేయడానికి ప్రయత్నిస్తోంది. అది జరిగిన తర్వాత మీరు కృతజ్ఞతతో నిండి ఉండవచ్చు. ఒక చిన్న సమస్యపై చిన్న గొడవ లేదా అసమ్మతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి మీతో ప్రాథమిక అవగాహన లేకపోవచ్చు, పూర్తిగా విరుద్ధంగా ఏదైనా సూచించవచ్చు. మీకు కొంత సమయం కావాలని లేదా ఎక్కువ స్పేస్ ఉండాలని భావించవచ్చు. ఆధ్యాత్మిక సాధన ప్రశాంతంగా ఉండవచ్చు.
లక్కీ సైన్- పసుపు నీలమణి (yellow sapphire)

* కర్కాటకం (జూన్ 22- జూలై 22) :  దేనిగురించైనా ఎక్కువగా ఊహించుకుంటే, మీరు భయపడే అవకాశాలు నిజమయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి ఉత్తమ మార్గం దానికి శక్తిని ఇవ్వడం ఆపేయడం. మానసిక శక్తిపై దృష్టి పెడితే, ఎనర్జీస్ సాధారణం కంటే మెరుగైన రోజుని సూచిస్తాయి. మీ స్నేహితులు ఒకరిద్దరు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీరు కలవడానికి ఇష్టపడకపోవచ్చు. మీకు కొత్త కొలాబొరేషన్ ఆలోచన ఉంటే, పార్ట్నర్‌ను ఎన్నుకోవడంపై పునరాలోచించాలి.
లక్కీ సైన్ - నీలం నీలమణి (blue sapphire)

* సింహ (జూలై 23- ఆగస్టు 22) : మీకు ముఖ్యమైన వారితో అపాయింట్‌మెంట్ ఉంటే, వారి సమయాన్ని, మెంటల్ స్పేస్‌ను గౌరవించాలి. మీరు అమలు చేయలేని ఆలోచనల గురించి మాట్లాడకూడదు. కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం త్వరలో ముగుస్తుంది, ఇది చాలా విశ్రాంతిని అందిస్తుంది. సీనియర్లు మీ గురించి చాలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, వారిని నిరాశపరచకుండా జాగ్రత్తపడండి. ఒక వృద్ధుడు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. తల్లిదండ్రులు ఏదైనా ముఖ్యమైనది ప్లాన్ చేసి ఉండవచ్చు, దానికి మీ అభిప్రాయం అవసరం.
లక్కీ సైన్ - అమెథిస్ట్

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాదనకు దిగవచ్చు, ప్రతిఘటించడం మంచిది. టెంపర్‌మెంట్ మీ సమస్య కావచ్చు, కానీ రోజులో రెండో సగం నాటికి మీరు దానిని శాంతింపజేయడానికి మార్గాలను కనుగొనవచ్చు. ఇతరులు పని ఒత్తిడితో మీపై భారం వేయడానికి ప్రయత్నించవచ్చు. మీ మనసులో చాలా విషయాలు ఉండవచ్చు, ప్రతిదాని గురించి మాట్లాడటం ముఖ్యం కాదు. గతంలోని సమస్యను పరిష్కరించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఆరుబయట సమయం గడపడం మీకు అవసరమైన మార్పును తీసుకురావచ్చు.
లక్కీ సైన్ - గ్రానెట్ స్టోన్

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) :  మీరు ఒక ప్రణాళికను రూపొందించుకుని ఉండవచ్చు, కానీ అది నిజం కావడానికి మరికొంత కాలం వేచి ఉండాలి. సాధారణ రోజువారీ పనులు ఆలస్యంగా మారవచ్చు. మీరు సంతృప్తికరమైన సమయం వైపు వెళుతున్నారు, గతంలో చేసిన వాటికి ప్రతిఫలాన్ని పొందవచ్చు. చాలా విషయాల గురించి ఆలోచించడం గందరగోళానికి, అనవసరమైన ఒత్తిడికి దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక బ్రేక్ కోసం ప్లాన్ చేయవచ్చు.
లక్కీ సైన్- గ్రీన్ ఒనిక్స్

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) :  మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా ప్రైవేట్ కన్వర్జేషన్స్ మానుకోండి. కొన్ని అవాంఛిత భావోద్వేగాలలో చిక్కుకోవచ్చు. ఇది మిశ్రమ భావాలు, భావోద్వేగాలతో కూడిన రోజు. గతంలో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. మీరు మానసికంగా కూడా బలహీనంగా ఉండవచ్చు. యాదృచ్ఛిక నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతం ఏదైనా విషయంలో గందరగోళంగా ఉంటే, దాన్ని వదిలేయండి.
లక్కీ సైన్ - లాపిస్ లాజులి

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : మిమ్మల్ని మీరు విలాసపరుచుకోండి, మీ మనసు పునరుజ్జీవనం పొందాలి. ఎలాంటి రిలాక్సేషన్ అయినా మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడవచ్చు. ఇంతకు ముందు అప్పీల్ లేని వ్యక్తి ఇప్పుడు ఆసక్తికరంగా కనిపించవచ్చు. స్నేహితులతో తక్కువ సమయం, మీతో మీరు ఎక్కువ సమయం గడపాలని అనుకోవచ్చు. మీపై భారంగా ఉన్న ఒక నిర్దిష్ట కుటుంబ ఒత్తిడి ఇప్పుడు పరిష్కారమవుతుంది. అనవసరమైన సహాయాలు అడగడం మానుకోండి.
లక్కీ సైన్- పులి కన్ను

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 1) :  ఇటీవలి ప్రెజెంటేషన్‌తో పనిలో ఉన్న వ్యక్తులపై మంచి అభిప్రాయాన్ని సృష్టించవచ్చు. మిమ్మల్ని గమనిస్తున్న ఎవరైనా మీ కోసం సానుకూల మార్పు తీసుకురావాలని ప్లాన్ చేయవచ్చు. మీపై మీకున్న నమ్మకం చాలా కాలం తర్వాత పునరుద్ధరణ అవుతుంది. మీ గత విజయాలు తిరిగి వస్తాయి. ఏవైనా పెట్టుబడులు పెడితే, అవి నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం ప్రారంభించవచ్చు. మీ ప్రస్తుత రిలేషన్‌షిప్‌ నుంచి టాక్సిన్స్ తొలగించడానికి ప్రయత్నించండి.
లక్కీ సైన్- మలాకైట్ (malachite)

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : మరొకరి ఉద్దేశాన్ని అంచనా వేయడం అంత తేలికైన పని కాకపోవచ్చు కానీ మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను విశ్వసించడం సులభం. మీరు ప్రస్తుత ప్లాన్‌కు ఇంకా బ్యాకప్‌ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. త్వరలో ప్రయాణాలు జరగవచ్చు. మీరు విస్మరించడానికి ప్రయత్నిస్తున్న ఎవరైనా అనుకోకుండా ల్యాండ్ కావచ్చు. మీ సన్నిహితులను తెలివిగా ఎన్నుకోండి.
లక్కీ సైన్- బ్లాక్ అబ్సిడియన్

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) :  మీరు ఏదైనా విషయం గురించి సంప్రదాయవాదంగా ఆలోచించవచ్చు. త్వరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో సింపుల్ అప్రోచ్ మీకు సహాయపడవచ్చు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. వారి ద్వారా కొత్త ఒప్పందంలోకి అడుగుపెడతారు. ధైర్యం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏదో ఒక రకమైన గుర్తింపు పొందవచ్చు.
లక్కీ సైన్- సిట్రిన్
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు