Horoscope Today May 21: నేడు (21 మే, 2022, శనివారం). నేడు ఓ రాశివారు వేడుకలు జరుపుకొనే అవకాశం ఉంది. కొందరికి గతంలో ఉన్న మానసిక ఇబ్బందులు తొలగుతాయి. మరికొందరికి ఈవెంట్‌లలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొందరు అప్రయత్నంగానే ఇతరులను అధిగమించి ప్రశంసలు అందుకొంటారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 21వ తేదీ శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.
* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)
ఆశ్చర్యాలను ఎదుర్కొనే, వేడుకలు జరుపుకొనే అవకాశం ఉంది. కొత్త భాగస్వాములను ఎంచుకోవడం, పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. చర్చల సమయంలో ప్రశాంతంగా ఉండండి. క్రిటికల్ అనాలసిస్‌లో సమయాన్ని వెచ్చించండి.
లక్కీ సైన్- మాన్నెక్విన్
* వృషభం (ఏప్రిల్ 20-మే20)
మీరు గతంలో చాలా మానసిక ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నట్లయితే.. ఇప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఫీల్ అవుతారు. గతంలోని కొన్ని సంప్రదాయాలు అడ్డంకిగా మారవచ్చు.
లక్కీ సైన్- రోల్ మోడల్
* మిథునం (మే 21- జూన్ 21)
ప్రణాళిక ఆకస్మిక మార్పు మీ కోసం రోజును పూర్తిగా మార్చవచ్చు. మీకు ఓ ఈవెంట్‌కి ఆహ్వానం లభిస్తుంది. కొత్త వారిని పరిచయం చేసుకోవచ్చు. ఈ పరిచయం దీర్ఘకాలికంగా కూడా మారవచ్చు. బయట తినడం మానుకోండి.
లక్కీ సైన్- సిల్వర్ స్ట్రింగ్
* కర్కాటకం (జూన్ 22- జూలై 22)
కొత్తదాన్ని ప్రారంభించే ముందు మీరు కొంచెం భయాందోళన చెందుతారు, కానీ శక్తులు మీతో ఉంటాయి. ఒక నిర్దిష్ట నిర్ణయం తీసుకోవడం గురించి మీ మనస్సులో గందరగోళం ఉంది. మీరు స్పష్టత పొందడానికి మరింత సమయం పట్టవచ్చు.
లక్కీ సైన్- రోజా మొక్క
* సింహం (జూలై 23- ఆగస్టు 22)
ఇది కీర్తిని సంపాదించడానికి, సొంత నిబంధనల ప్రకారం పనులను సాధించడానికి అనువైన రోజు. మీరు అప్రయత్నంగానే ఇతరులను అధిగమిస్తారు. ప్రశంసలను కూడా పొందుతారు. ఈరోజు మీరు చేస్తున్న దానికి మీరు త్వరలో రివార్డ్‌లను పొందవచ్చు.
లక్కీ సైన్- సూర్యోదయం
* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)
రోజు నెమ్మదిగా ప్రారంభం కావచ్చు కానీ ద్వితీయార్థంలో వేగం పెరగవచ్చు. మీరు సాధారణ ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. దాన్ని పరిష్కరించడానికి మీకు కొంత మానసిక ప్రశాంతత అవసరం. ఒక ఆహ్లాదకరమైన సాయంత్రం అనుభవించే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- టాల్ బిల్డింగ్
* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23)
మీరు చాలా సంవత్సరాలలో మెచ్యూరిటీ సాధించారు. ఇప్పుడు పరిస్థితిని బాగా అర్థం చేసుకొనే, విశ్లేషించే సామర్థ్యాన్ని సాధించారు. మిమ్మల్సి మీరు ఆవిష్కరించుకొనేందుకు ఏదైనా మంచి ఆశిస్తున్నారు. మీకు సన్నిహితంగా ఉండే వాళ్లు బాధలో ఉండే అవకాశం ఉంది.
లక్కీ సైన్- టాన్ వ్యాలెట్
* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21)
మీరు కమిట్‌మెంట్ ఇచ్చిన వారి కోసం అక్కడ ఉండటమే మీ ప్రాథమిక పని. కానీ అది లేకపోవడం మీ ఇద్దరి మధ్య చిరాకు కలిగించవచ్చు. మీరు ఆస్తి లావాదేవీలో ఉన్నట్లయితే, మీరు మంచి సమయాల కోసం వేచి ఉండవచ్చు.
లక్కీ సైన్- ఎమరాల్డ్
* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఈ రోజు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అందుకొంటారు. అవి ప్రస్తుతానికి చిన్నవిగా ఉండవచ్చు, కానీ ఆసక్తికరంగా ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న నిర్ణయాలపై మీరు ఇప్పుడే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తిరిగి మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం, కాల్ చేయడం మేలు.
లక్కీ సైన్- గోల్డెన్ ఎంబ్రాయిడరీ
* మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ప్రత్యేక దృష్టితో ఒక సాధారణ రోజును గడపడానికి శక్తి బాగా కనిపిస్తుంది. ముందస్తు ప్లానింగ్‌తో మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అనుకోకుండా స్నేహితురాలు కలవడానికి వస్తుంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
లక్కీ సైన్- తేనెటీగ
* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18)
మీరు చాలా కలలు కంటున్న అనుభూతి చెందుతారు, ఒకరిని చాలా ఎక్కువగా మిస్ అవుతున్నారు. కానీ మీరు రియాలిటీలోకి వచ్చి.. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మీ జీవితానికి కొత్త దిశను అందించే ఆసక్తికరమైన అవకాశం రావచ్చు.
లక్కీ సైన్- జ్యూట్ బ్యాగ్
* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
మీలోని భావాలను వ్యక్తపరిస్తే.. గాయపడతారేమో అనే భయం మీకు ఉంటుంది. కానీ మీరు చేయకపోతే అది మీకు ఆందోళన కలిగిస్తుంది. రాతపూర్వకంగా భావాలను తెలియజేయవచ్చు. మీ రహస్యం తెలిసిన అత్యంత సన్నిహిత మిత్రుడు ఆధారపడటానికి సరైన వ్యక్తి.
లక్కీ సైన్- సరస్సు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs