Horoscope Today May 16 : ఇవాళ (16 మే, 2022, సోమవారం). నేడు ఒక రాశి వారికి దివ్యమైన అనుభవం కారణంగా రోజుల తరబడి ఆనందంగా ఉంటారు. మరో రాశివారిలో నిజమైన భావోద్వేగాలు అసలు దాగి ఉండవు. వాటిని పంచుకుంటారు. ఇంకోరాశి వారు సవాళ్లు ఎదుర్కొంటారు. నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్య నిపుణులు ఈ అంచనా వేశారు. మే16, సోమవారం నాడు దినఫలాలు ఎలా ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)
రోజు మొత్తం పనుల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీ శక్తి స్థాయిలు పెరిగినట్లు అనిపించవచ్చు. మీరు ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు.
లక్కీ సైన్- రూబీ క్రిస్టల్
* వృషభం (ఏప్రిల్ 20-మే20)
నిజమైన భావోద్వేగాలు ఇప్పుడు దాగి ఉండకపోవచ్చు. మీరు వాటిని పంచుకోవడానికి, వ్యక్తీకరించడానికి పరిసరాల్లో ఎవరన్నా ఉన్నారా అని చూస్తారు. మీ చుట్టూ సృష్టించుకున్న ఏదైనా మంచి ఇప్పుడు ఉపయోగకరంగా అనిపించవచ్చు.
లక్కీ సైన్ - వెండి ఉంగరం
* మిథునం (మే 21- జూన్ 21)
మీరు సహకరించడానికి ఒక ఆఫర్ను స్వీకరించినట్లయితే, ఆ ఆఫర్ ఉన్నత స్థాయి సిఫారస్సు అయి ఉంటుంది. కొత్త ఆలోచన రూపుదిద్దుకోవడానికి సమయం పట్టవచ్చు.
లక్కీ సైన్ - గిఫ్ట్ బ్యాగ్
* కర్కాటకం (జూన్ 22- జూలై 22)
మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని పని మార్గాలను తెరుస్తుంది లేదా వ్యాపార ఆలోచనను కూడా పెంచుతుంది. ఏదైనా పెండింగ్ కమ్యూనికేషన్ ఉంటే, మీరు దాన్ని పూర్తి చేశారని నిర్ధారించుకోండి.
లక్కీ సైన్- పెంపుడు జంతువు
* సింహం (జూలై 23- ఆగస్టు 22)
మీరు మంచి ఉపాధ్యాయుడిని లేదా మిమ్మల్ని ఆకట్టుకునే ప్రభావశీలిని కలుస్తారు. ఇంటి విషయాలు రోజంతా మీ మనస్సులో తారాడతాయి. సమయ నిర్వహణ ఒక సవాలుగా అనిపించవచ్చు.
లక్కీ సైన్- తోట
* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)
కొన్ని రోజులు మిగిలిన వాటి కంటే చాలా సవాలుగా ఉంటాయి. ఈ రోజు అలాంటి రోజుల్లో ఒకటి. అది మీకు అలా అనిపించేలా చేస్తుంది. శక్తులు కొంచెం భారీగా ఉంటాయి. కానీ మధ్యాహ్నం నాటికి ఈ దశ మెరుగుపడుతుంది.
లక్కీ సైన్ - ఫెంగ్షుయ్ గుర్తు
* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23)
ప్రతి చిన్న విషయానికి అనవసరమైన ఒత్తిడికి గురికావద్దని మీకు సూచిస్తారు. ప్రాముఖ్యత విషయంలో మీకు మరింత అవగాహన అవసరం కావచ్చు. మీ జీవిత భాగస్వామి పరిగణనలోకి తీసుకోవలసిన అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు.
లక్కీ సైన్- మైలురాయి
* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21)
మీపట్ల ఆకర్షితులైన ఎవరైనా త్వరలో మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మీ పని మరింత ఉధృతంగా ఉంటుంది. ఒక దివ్య అనుభవం కారణంగా మీరు రోజుల తరబడి ఆనందించవచ్చు.
లక్కీ సైన్ - స్విచ్వర్డ్
* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
సకాలంలో సరిదిద్దుకోకపోతే సోమరితనం హానికరంగా మారుతుంది. ఈ రోజు మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు నెట్టండి. ఒక సబార్డినేట్ రోజులో గణనీయమైన మీ సమయాన్ని వినియోగించుకోవచ్చు.
లక్కీ సైన్- గుత్తి
* మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ఆలస్యం, వాయిదాలు రోజులోని మీ శక్తిని శాసిస్తాయి. మీరు కొన్ని ముఖ్యమైన పనులను రీషెడ్యూల్ చేయాల్సి రావచ్చు. కొత్త నిబంధనలను అనుసరించడం లాభదాయకంగా కనిపించకపోవచ్చు.
లక్కీ సైన్ - తెల్ల గులాబీ
* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18)
ఈ రోజు నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మధ్యాహ్నం నాటికి క్రమంగా పుంజుకోవచ్చు. బంధువు అత్యవసరమైనదాన్ని నిరంతరం అనుసరించవచ్చు. మీరు ఏదైనా ప్రత్యేక సందర్భం కోసం వేదికను బుక్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇప్పుడు సమయం ఆసన్నమైంది.
లక్కీ సైన్- గాజు టంబ్లర్
* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
పాత సంఘటన మరోసారి మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. త్వరలో స్నేహితులతో కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేయాలనే కోరిక మీకు ఉండవచ్చు. పనిలో అంతర్గతంగా స్పష్టమైన కమ్యూనికేషన్ ఉంచండి.
లక్కీ సైన్ - సైన్ లాంగ్వేజ్
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.