హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu: (మే 9) దిన ఫలాలు: మీ సమయాన్ని వృథా చేయడం మంచిది కాదు..

Rasi Phalalu: (మే 9) దిన ఫలాలు: మీ సమయాన్ని వృథా చేయడం మంచిది కాదు..

దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 9వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తెలుసుకోండి.

Rasi Phalalu Today (9 మే, 2022, సోమవారం). ఓ రాశివారికి ప్రస్తుతం ప్రతికూల సమయం నడుస్తోంది. కొందరు చేసిన చిన్న పొరపాటు మూలంగా చేసినదంతా వృథా అయ్యే సూచనలు ఉన్నాయి. కొందరికి మర్చిపోలేని మార్పులు జరుగుతాయి. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 9వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తెలుసుకోండి.

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)

మీ గత కార్యాలలో ఏదైనా ప్రస్తుతం ప్రభావం చూపుతుండే అవకాశం ఉంది. మీరు ప్రతికూల సమయం నడుస్తోంది. మీరు ఇప్పుడు కొత్త బంధాలు, సంబంధాలను పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి.

లక్కీ సైన్- డైమండ్‌ రింగ్‌

* వృషభం (ఏప్రిల్ 20-మే20)

ఓ చిన్న పొరపాటుతో చేసినదంతా వృథా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్‌స్ట్రక్షన్స్‌ పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఎవరైనా థ్రిల్లింగ్ వార్తను అందుకుంటారు.

లక్కీ సైన్- మస్టర్డ్‌ కుషన్‌

* మిథునం (మే 21- జూన్ 21)

చాలా కాలం తర్వాత మీ ఫ్యామిలీ గెట్‌ టుగెదర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణంలో కొంచెం ఆలస్యం లేదా అసౌకర్యం కలిగే సూచనలు ఉన్నాయి. స్ట్రీట్‌ స్మార్ట్‌గా మారాల్సిన అవసరం ఉంది.

లక్కీ సైన్- సిల్క్‌ స్కార్ఫ్‌

* కర్కాటకం (జూన్ 22- జూలై 22)

సరికొత్త ప్రయాణానికి సిద్ధం కండి. మీరు ఎప్పటికీ మీ హృదయానికి దగ్గరగా ఉండాలని కోరుకునే సందర్భాలు ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. ఉద్యోగ మార్పు లేదా పని స్థానంలో కొంత మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

లక్కీ సైన్- పంజరం

* సింహం (జూలై 23- ఆగస్టు 22)

మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీలాంటి మనస్తత్వం ఉన్నవారితో పొరపాట్లు చేసే బలమైన అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలను మీతోనే ఉంచుకోవడాన్ని మీరు తప్పక నేర్చుకోవాలి. అందరితో అన్నీ పంచుకోకూడదు. ఒక మంచి తోడు అన్ని మార్పులను తీసుకొస్తుంది.

లక్కీ సైన్- గ్రానైట్‌ స్టోన్‌

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)

ఒకరి పట్ల సానుభూతితో కూడిన సంజ్ఞలు వారిని కలవరపెట్టవచ్చు. మీపై పని చేస్తున్న వ్యక్తితో మీరు నిజాయితీగా ఉండాలి. మీరు బలంగా కోరుకుంటున్న దాన్ని అనుసరించడం ద్వారా కొత్త అవకాశాలు వచ్చి అదృష్టవంతులుగా మారే సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్- క్రిస్టల్‌ జార్‌

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23)

ఎవరైనా మీపై నమ్మకాన్ని కోల్పోయినట్లయితే, చర్యలు మాత్రమే వారిలో మీపై నమ్మకాన్ని పెంచగలవు, మాటలు కాదు. మీరు ఆఫీసు రాజకీయాలను సీరియస్‌గా చూస్తే క్లిష్టపరిస్థితులు తప్పవు. మీ గురించి ఎవరో వెనుక ఉండి మాట్లాడుతున్నారు. లక్కీ సైన్- కాస్ట్‌ ఐరన్‌

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21)

కొత్తగా పరిణతి చెందిన వ్యక్తి ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ అది మోసపూరితంగా ఉండవచ్చు. మీరు పత్రంపై సంతకం చేసే ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం నేర్చుకోవాలి. మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఉంది.

లక్కీ సైన్- సిల్వర్‌ జ్యూయలరీ

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

మీలో చాలా మంది ఈ రోజు ఎలాంటి ఫలితాలు సాధించకుండా ఉండవచ్చు. కానీ అసలు పని ప్రారంభించడానికి ముందు ఇది విరామంగా భావించవచ్చు. చాలా కాలం తర్వాత అయినా చదవడం ప్రారంభిస్తే మంచిది.

లక్కీ సైన్- మనీప్లాంట్‌

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)

మీరు ఒక వ్యక్తి లేదా లక్ష్యం కోసం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు క్లుప్తంగా కొంత సానుకూల ప్రభావం కనిపించవచ్చు. దాని తర్వాత కూడా మీ సమయాన్ని వృథా చేయడం మంచిది కాదు. మీకు వాస్తవాలను మీ మనసే తెలియజేస్తుంది.

లక్కీ సైన్- సిలికాన్‌ మౌల్డ్‌

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18)

కొందరు వ్యక్తులను సంతోషపెట్టడంలో మీరు విజయవంతం కాకపోవచ్చు. మీ చుట్టూ ఉన్న కొంతమంది ఆసక్తికరమైన వ్యక్తుల కోసం మీ సమయాన్ని వెచ్చిస్తారు. మీ లక్ష్యం ప్రస్తుతానికి అస్పష్టంగా కనిపించినా.. కొంతకాలం తర్వాత స్పష్టంగా ఉంటుంది.

లక్కీ సైన్- తేనెటీగ

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)

లాభం, నష్టాల పరిస్థితి వర్క్‌ రిలేషన్‌షిప్‌లో అంతరాయం కలిగించవచ్చు. మీరు ఏదో ఒకవైపు ఉండేందుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీతో పంచుకోవడానికి ముఖ్యమైనది ఏదైనా ఉండవచ్చు. డిమాండ్‌ చేయడం అవతలి వ్యక్తిని కలవరపెడుతుంది.

లక్కీ సైన్- పిరమిడ్‌

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు