హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : దిన ఫలం : ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువ లాభం పొందుతారు..

Rasi Phalalu : దిన ఫలం : ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువ లాభం పొందుతారు..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. ఆగస్టు 7వ తేదీ ఆదివారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోండి..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam

Today horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశి ఫలాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. ఆగస్టు 7వ తేదీ ఆదివారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోండి..

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : ఇతర వ్యక్తుల ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న తర్వాత కూడా, మీరు రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ఆలస్యంగానైనా ఇతరులను నమ్మడం మీకు చాలా సులభం. మీరు ప్రస్తుత ప్లాన్‌కు బ్యాకప్ పెట్టుకున్నారో.. లేదో నిర్ధారించుకోండి. త్వరలో ఒక ట్రిప్‌కు వెళ్లవచ్చు. మీరు కలవడానికి ఇష్టపడని వ్యక్తి.. అనుకోకుండా వచ్చి కలవొచ్చు. మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి.

లక్కీ సైన్- ఇండోర్‌ ప్లాంట్‌

వృషభం (ఏప్రిల్ 20-మే20) : మీరు కొన్ని విషయాలపై కన్జర్వేటివ్‌గా ఉండవచ్చు.. కానీ పబ్లిక్‌లో మీ కోణం మారవచ్చు. సమయానుకూలమైన విధానం త్వరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో మీకు సహాయపడవచ్చు. మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త పనులను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో ధైర్యం దొరకడం అంత కష్టం కాకపోవచ్చు. సుదూర ప్రాంతం నుంచి ఎవరైనా మీ కోసం కొన్ని శుభవార్తలను తీసుకొస్తారు.

లక్కీ సైన్- పువ్వులు

మిథునం (మే 21- జూన్ 21) : మీ మనస్సుకు ప్రశాంతత అవసరం కాబట్టి మీ సెన్సెస్‌ను ప్యాంపర్‌ చేయండి. మీ భవిష్యత్తును మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి విశ్రాంతి సహాయపడవచ్చు. మీరు ఇప్పుడు కొంత సమయం ఒంటరిగా గడపాలని అనుకోవచ్చు. మీకు భారంగా అనిపిస్తున్న కుటుంబ ఒత్తిడి త్వరలో దూరమవుతుంది. ప్రస్తుతానికి రుణాలు అడగడం మానుకోండి.

లక్కీ సైన్- సిరామిక్‌ వేజ్

కర్కాటకం (జూన్ 22- జూలై 22) : మీరు ఓ స్థాయిలో ఉన్న వ్యక్తులకు మీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తారు. మిమ్మల్ని గమనిస్తున్న ఎవరైనా.. ఏదైనా పని కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. మీపై మీకున్న నమ్మకం అనేక విధాలుగా తిరిగి వస్తుంది. మీ అంతర్గత సామర్థ్యం, గత వైభవం గురించి మరొకరు మీకు భరోసా ఇవ్వవచ్చు. మీరు ఏవైనా పెట్టుబడులు పెడితే.. ఇప్పుడు రాబడి అందుకునే సూచనలు ఉన్నాయి. మీ ప్రస్తుత రిలేషన్‌లో కొంత ఫ్రెష్‌నెస్‌ను తీసుకురావడానికి ప్రయత్నించండి.

లక్కీ సైన్- పింక్‌ ఫ్లవర్‌

సింహం (జూలై 23- ఆగస్టు 22) : మీరు ఒక ప్రణాళికను రూపొందించి ఉండవచ్చు కానీ అమలు చేయడం కష్టంగా అనిపించవచ్చు. సాధారణ రోజువారీ పనులు మీ మైండ్‌ను ఆక్రమించవచ్చు. మీరు సంతృప్తికరమైన సమయం వైపు పయనిస్తున్నారు. గతంలో చేసిన వాటికి ప్రతిఫలాన్ని పొందవచ్చు. ఒక రోజులో ఒక పని గురించి ఆలోచించడం మేలు, చాలా విషయాలను ముందేసుకుంటే గందరగోళానికి గురై, ఒత్తిడికి దారితీయవచ్చు. తిరిగి ఉత్తేజం పొందడానికి బ్రేక్‌ అవసరం.

లక్కీ సైన్- న్యూ పెర్ఫ్యూమ్‌

కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : పబ్లిక్‌గా ప్రైవేట్ అంశాలను మాట్లాడటం మానుకోండి. మీకు తెలియకుండానే కొన్ని విషయాల్లో మీరు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఇది మిక్స్‌డ్‌ ఎమోషన్స్‌తో కూడిన రోజు. మీపై ఆకర్షణ ఉన్న ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. మీరు మానసికంగా కూడా బలహీనంగా ఉండవచ్చు. తొందరపాటు లేదా త్వరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీరు గందరగోళంగా ఉన్నట్లయితే, ఆ పనిని ప్రస్తుతానికి వదిలివేయండి. డీప్‌ బ్రీతింగ్‌ వ్యాయామాలను ప్రాక్టీస్ చేయండి.

లక్కీ సైన్- వైట్‌ బోర్డ్‌

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : మీకు ముఖ్యమైన వారితో అపాయింట్‌మెంట్ ఉంటే, మీరు వారి సమయాన్ని గౌరవించాలని నిర్ధారించుకోండి. మీరు అమలు చేయలేని ఆలోచనల గురించి మాట్లాడకుండా ఉండవచ్చు. కొంతకాలంగా కొంత ఆర్థిక సంక్షోభం ఉండవచ్చు, కానీ మీరు దానిని త్వరలో అధిగమించవచ్చు. సీనియర్లు మీ గురించి మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. వారిని నిరాశపరచకుండా ఉండటానికి మీరు ప్రయత్నించాలి.

లక్కీ సైన్- సిలికాన్‌ మౌల్డ్‌

వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మీతో గొడవకు దిగాలని అనుకోవచ్చు. మీరు తగిన విధంగా, దానిని ప్రతిఘటించాలి. స్వభావమే సమస్య కావచ్చు, కానీ త్వరలో మీరు దానిని శాంతపరిచే మార్గాలను కనుగొనవచ్చు. ఇతరులు మీపై పని భారం , ఒత్తిడి వేయడానికి ప్రయత్నించవచ్చు. మీ మనస్సులో ఎన్ని ఉన్నా.. ప్రతిదాని గురించి మాట్లాడటం ముఖ్యం కాదు. గతానికి సంబంధించిన విషయాలను పరిష్కరించుకునే అవకాశం మీకు లభిస్తుంది. బయట భోజనం చేయడం చాలా అవసరమైన మార్పును తీసుకురావచ్చు.

లక్కీ సైన్- స్ట్రింగ్‌ ఆఫ్‌ లైట్స్‌

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : యూనివర్స్‌ ప్రస్తుతం మీ అవసరాలు, కోరికల ఆధారంగా సరిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. మీరు కృతజ్ఞతతో నిండి ఉండవచ్చు. ఒక చిన్న సమస్యపై చిన్న గొడవ లేదా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామికి మీతో సమన్వయం లోపించవచ్చు, విరుద్ధంగా ఏదైనా సూచించవచ్చు . కొంత విశ్రాంతి అవసరమని భావిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణం ఉపయోగకరంగా ఉండవచ్చు.

లక్కీ సైన్- వలస పక్షి

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) : ఏదైనా జరుగుతుందని మీరు ఊహిస్తే.. మీరు భయపడే అంశాలు నిజమయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి ఉత్తమ మార్గం దానికి శక్తిని ఇవ్వడం ఆపివేయడం. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ దినచర్యను చాలా దగ్గరగా అనుసరించవచ్చు. మీ స్నేహితులు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు కలవడానికి ఇష్టపడకపోవచ్చు. మీకు ఏదైనా బిజినెస్‌ ఐడియా ఉంటే, భాగస్వామిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి,

లక్కీ సైన్- సన్‌ బ్లాక్‌

కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : మీరు ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువ లాభం పొందుతారు. మీరు దీన్ని అనుసరిస్తుంటే, ఎటువంటి ప్రతిఘటన లేకుండానే విషయాలు జరుగుతాయని మీరు గమనించవచ్చు. మీ పిల్లలు ఈ వారం ఆనందానికి ప్రధాన మూలం కావచ్చు. ఫ్యామిలీ గెట్ టుగెదర్‌కు అవకాశం ఉంటుంది. మీరు ప్రస్తుతానికి మీ పనికి కొద్దిగా విరామం ఇవ్వవచ్చు, ఇతర బాధ్యతలకు హాజరు కావచ్చు. ధన ప్రవాహం బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అనుకూలమైన రోజులు ముందు ఉన్నాయి. వీలైతే నలుపు రంగును ధరించకుండా ఉండటానికి ప్రయత్నించండి.

లక్కీ సైన్- మట్టి కుండ

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : జీవితం బోరింగ్‌గా మారవచ్చు, మీరు తిరిగి పుంజుకోవడానికి కొన్ని ఆకాంక్షలు అవసరం. ఒక పాత బాస్ మిమ్మల్ని ఏదైనా సహాయం కోసం సంప్రదించవచ్చు. పరిమిత అవకాశాలు ఉన్నాయి కానీ మీరు మీ కోసం ఒకదాన్ని సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఇది స్వీకరించే సమయం, మీరు దానిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అణచివేసిన భావోద్వేగాలను బహిరంగంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఆర్థిక పురోగతి కొంత కాలానికి స్థిరంగా ఉండవచ్చు. మీ హాబీని తిరిగి ప్రారంభించండి.

లక్కీ సైన్- వెయిటెడ్‌ మెయిల్‌

First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు