Home /News /astrology /

RASI PHALALU HOROSCOPE TODAY 5TH JULY 2022 ASTROLOGY PREDICTIONS FOR ALL ZODIAC SIGNS GH PJC MKS

Rasi Phalalu : (జులై 5 ) దిన ఫలం : గతంలో చేసిన చర్యలు మిమ్మల్ని వెంటాడుతాయి..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా దిన ఫలాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. జులై 5వ తేదీ మంగళవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

Today horoscope (5 July 2022) ఇవాళ (5 జులై 2022, మంగళవారం). ఓ రాశివారు న్యాయపరమైన అంశాలకు సంబంధించి తీవ్రతను అనుభవిస్తారు. మరోరాశికి చెందిన వారు అతిథులను ఎంటర్‌టైన్‌ చేయాల్సి రావచ్చు. నక్షత్రాల గమనం ఆధారంగా దిన ఫలాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. జులై 5వ తేదీ మంగళవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : కెరీర్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్స్ కోసం కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీరు ప్రస్తుతం విషయాలను తేలికగా తీసుకోవచ్చు. మీరు రిలేషన్‌లో ఉన్నట్లయితే, ఇప్పుడు విషయాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
లక్కీ సైన్- మందారం మొక్క

* వృషభం (ఏప్రిల్ 20-మే20) : శ్రేయస్సు, సమృద్ధిని త్వరలో అందుకుంటారు. న్యాయపరమైన విషయాల్లో చిక్కుకున్న వారు ఇప్పుడు తీవ్రతను అనుభవించవచ్చు. ఎవరైనా తమకున్న సమస్యలను మీరు తీరుస్తారని ఎదురుచూస్తూ ఉండే అవకాశం ఉంది.
లక్కీ సైన్- బ్లూ స్టోన్‌

* మిథునరాశి (మే 21- జూన్ 21) : ఇటీవల పరిచయమైన స్నేహితుడు సంబంధిత విషయాలలో సహాయకారిగా ఉండవచ్చు. మీ లవ్‌ ఇంట్రస్ట్‌తో ఉన్న కెమిస్ట్రీ ఇతరులను అసూయ పడేలా చేస్తుంది. ఒక ముఖ్యమైన పత్రం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
లక్కీ సైన్- గ్లాస్‌ బౌల్‌

* కర్కాటకం (జూన్ 22- జూలై 22) : మీరు కొంతమంది అతిథులను అలరించవలసి రావచ్చు. పరిస్థితిలో వచ్చిన మార్పులతో పాత ప్లాన్‌ ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం రావచ్చు. మీరు ప్రభావవంతమైన వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు, అందుకు ఇది సరైన సమయం అవుతుంది.
లక్కీ సైన్- బల్బ్‌

* సింహ (జూలై 23- ఆగస్టు 22) : మీరు మీ సొంత ప్రయోజనం కోసం ఒక నిర్దిష్ట పనిని చేయడంపై దృష్టి కేంద్రీకరించి నట్లయితే, ఇప్పుడు విజయం పొందవచ్చు. బలమైన సంకల్పం రాబోయే కొద్ది రోజులకు మీకు మేలు చేస్తుంది. మీరు సన్నిహితుల నుంచి ఎమోషనల్‌ ఎదురుదెబ్బను అనుభవిస్తారు.
లక్కీ సైన్- జార్‌

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : ప్రణాళిక లేని వాటి మధ్య విరామాలు ఉంటే, మీరు కూడా కొంచెం చిరాకుగా అనిపించవచ్చు. అధికారంలో ఉన్న ఎవరైనా తమ అహంకారాన్ని ప్రదర్శించవచ్చు. అసాధ్యమైన పనిని సాధించాలనే మీ లక్ష్యం ఇప్పుడు కొంత మార్పును చూసే అవకాశం ఉంది.
లక్కీ సైన్- ఈక

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : మీ సృజనాత్మక ప్రతిభ ప్రదర్శనను ఎవరైనా చూడవచ్చు. మీ పని లేదా ప్రతిభ గురించి దూరం నుంచి ఎవరైనా వినే అవకాశాలు ఉన్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ సైన్- సిగ్నేచర్‌ ట్యూన్‌

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : గతంలో చేసిన కొన్ని చర్యలు త్వరలో మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు కొత్త రిలేషన్‌షిప్‌ను ఏర్పరచుకుంటే, వారి కుటుంబం అపార్థం చేసుకొనే అవకాశం ఉంది. కార్యాలయంలో ఒక పనిపై మీరు తక్షణం శ్రద్ధ పెట్టాల్సిన సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- టోడ్‌

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : కొన్ని పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను ప్రాక్టీస్ చేయండి. శక్తి స్థాయి అసాధారణంగా ఎక్కువగా ఉంటుంది. మీరు స్వీయ-ప్రేరణతో, విజయవంతమైన రోజును గడుపుతారు.
లక్కీ సైన్- స్క్వేర్‌ స్లాబ్‌

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 1) : మీరు ఏదైనా పనిలో ముందుకు సాగడానికి ఓ సూక్ష్మమైన సూచన సరిపోతుంది. ఇది మీ మనసు చెప్పే సూచనలను అనుసరించాల్సిన రోజు. రివార్డింగ్ పార్టనర్‌షిప్‌ త్వరలో ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
లక్కీ సైన్- ఇంపీరియల్‌ ఛైర్‌

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : ఒక ముఖ్యమైన సమావేశం వాయిదా పడవచ్చు. మీరు ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన వివరాలను పొందకపోయి ఉండవచ్చు. కొత్త సహోద్యోగి మీకు ముఖ్యమైన సూచనలు అందించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది.
లక్కీ సైన్- రోజా పువ్వు

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : మీ రోజు ఎదురుచూస్తున్న మంచి వార్తలతో ప్రకాశవంతం అయ్యే అవకాశం ఉంది. కొత్త కట్టుబాట్లు చేయకపోవడం మంచిది. మీరు ఇప్పుడు అదే పరిస్థితిని భిన్నంగా చూడవచ్చు.
లక్కీ సైన్- హీప్‌ ఆప్‌ పెబుల్స్‌
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు