హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : దిన ఫలం : కమిట్‌మెంట్‌ ఇవ్వండి.. కలిసొస్తుంది..

Rasi Phalalu : దిన ఫలం : కమిట్‌మెంట్‌ ఇవ్వండి.. కలిసొస్తుంది..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 31వ తేదీ ఆదివారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోండి..

Today horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశి ఫలాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 31వ తేదీ ఆదివారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోండి..

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : మీరు ఓ స్ట్రేంజర్‌ నుంచి మంచి గైడెన్స్‌ పొందవచ్చు. సహకరించే, టీమ్‌ స్పిరిట్‌ ప్రదర్శించే మంచి వ్యక్తులతో కలిసి పని చేయడం మీ అదృష్టం. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు స్లో పీరియడ్‌ను అనుభవించే అవకాశాలు ఉన్నాయి. మీరు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, బుకింగ్ ప్రక్రియ వెంటనే జరగాలి.

లక్కీ సైన్- గాలిపటం

వృషభం (ఏప్రిల్ 20-మే20) : మీరు కొన్ని నెలల క్రితం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు సానుకూల ఫలితాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. మీ కార్యాలయంలోని కొంతమంది వ్యక్తులు మీ గురించి తప్పుడు అభిప్రాయాలను సృష్టిస్తున్నారు. మీరు వాదనలకు దూరంగా ఉంటారు, కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఆలోచనాత్మకమైన బహుమతి మిమ్మల్ని మానసికంగా కదిలించవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, జాగ్రత్తలు తీసుకోండి.

లక్కీ సైన్- ఎర్ర జెండా

మిథునం (మే 21- జూన్ 21) : మీరు ఇంతకు ముందు పనిచేసిన ఉత్సాహంతో పని చేయాలి. ఇన్నర్‌ రిఫ్లెక్షన్‌ ఎక్సెర్‌సైజ్‌ నిజంగా సహాయపడవచ్చు. జరిగిన కొన్ని దురదృష్టకర ఎపిసోడ్‌లు అసంభవమైనవి. మీరు ప్రతిచోటా సహాయం, సపోర్ట్‌ సేకరించడం కొనసాగించాలి. మీ తల్లిదండ్రులు మీరు త్వరలో చూడగలిగే ఆశ్చర్యాన్ని ప్లాన్ చేసి ఉండవచ్చు. విహారయాత్ర చికిత్సలా పని చేస్తుంది, పునరుత్తేజం లభిస్తుంది.

లక్కీ సైన్- ఫేవరెట్‌ స్నాక్‌

కర్కాటకం (జూన్ 22- జూలై 22) : గత సంవత్సరం కలగా అనిపించినది రియాలిటీగా మారడం ప్రారంభించాలి. మీరు నమ్మదగిన సహకారులను కూడా కనుగొంటారు. సందేహాలను పెట్టుకోవడం.. మీ పని వేగాన్ని నాశనం చేస్తుంది. కుటుంబం, స్నేహితులతో ఆధ్యాత్మిక యాత్రలు చాలా ముఖ్యమైనవి. గతంలో జరిగిన కొద్దిపాటి జాప్యాలు మిమ్మల్ని కలవరపెట్టి ఉండవచ్చు, కానీ కమిట్‌మెంట్‌ ఇవ్వండి, విషయాలు సజావుగా సాగుతాయి. ప్రాజెక్ట్ ఆలోచన ఉత్తేజకరమైనదిగా అనిపించవచ్చు.

లక్కీ సైన్- బ్లూ ట్రక్‌

సింహం (జూలై 23- ఆగస్టు 22) : సాధారణ వివేకానికి బదులుగా మరింత ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, యాక్షన్‌ ఓరియంటెడ్‌ ప్లాన్‌ అవసరం. ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకుంటే, దాని కోసం ఛేజ్ ఇప్పుడు ప్రారంభించాలి. మీరు మరింత మంది వ్యక్తులతో నెట్‌వర్క్ చేయాల్సి రావచ్చు. కుటుంబం సపోర్ట్‌ కొనసాగుతోంది. మీ ఆలోచనలను అమలు చేయడానికి, బయటి వ్యక్తులతో ఎక్కువ విషయాలను పంచుకోకూడదు. మీ స్వీట్‌ టూత్‌ను కంట్రోల్‌ చేసుకోవాలి.

లక్కీ సైన్- ఎమెరాల్డ్‌

కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : మీ రాబడిని పెంచుకోవడానికి, మీరు పనిలో, పెట్టుబడులలో స్థిరంగా ఉండాలి. యాక్టివ్ ప్లాన్‌లలోకి రావడానికి ముందు బ్లూప్రింట్‌ను రూపొందించడం కచ్చితంగా సహాయపడుతుంది. ఇతరులు మీ సలహా కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. గతంలో వారి కోసం పనిచేసినట్లు తెలుస్తోంది. నక్షత్రాలు వివిధ సోర్సెస్‌ నుంచి మల్టిపుల్‌ బెనిఫిట్స్‌ను సూచిస్తున్నాయి. కుటుంబంలో ఎవరైనా ప్రతిఘటనను సృష్టించవచ్చు. గృహ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏవైనా సమస్యలను పరిష్కరించగలరు.

లక్కీ సైన్- బ్రాస్‌ ఆర్టికల్

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : మీరు ఏదైనా ముఖ్యమైన దాని గురించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నది ప్రస్తుతానికి నిలిపేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇప్పుడు తీసుకున్న కఠినమైన నిర్ణయం మిమ్మల్ని తర్వాత పశ్చాత్తాపపడేలా చేస్తుంది. మీరు చాలా కాలంగా పని చేస్తున్నది ఇప్పుడు రూపుదిద్దుకోవచ్చు. రోజూ ధ్యానం చేయడం వల్ల మీకు అవసరమైన సమాధానాలు లభిస్తాయి.

లక్కీ సైన్- బాస్కెట్‌ బాల్‌

వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : ఇతర రోజుల మాదిరిగా కాకుండా ఈ రోజు చాలా కచ్చితమైంది. శక్తులు మీ ప్రణాళికలకు సపోర్ట్‌ ఇస్తున్నాయి. సమయాన్ని వృథా చేయకుండా, మీరు తప్పక పనినలో మునిగిపోవాలి. షాపింగ్, ఏదైనా పేపర్‌ని ప్రెజంట్‌ చేయడం వంటి అన్నింటినీ సాధించగలరు. మీకు ఇష్టమైన క్రీడ మిమ్మల్ని ఆక్రమించవచ్చు. స్నేహితుడిని కలుసుకోవడం వల్ల తప్పిపోయిన స్పార్క్ రోజులోకి వచ్చే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్న దాని కోసం ఇంకా కొంత సమయం పట్టవచ్చు.

లక్కీ సైన్- వయొలెట్‌ ఫ్లవర్స్‌

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : మీ హానెస్టీ, సిన్సియర్‌ కన్‌సర్న్‌తో చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తారు. ఎటువంటి కారణం లేకుండా అయినా సరే కొన్నిసార్లు ఎదుటివారిని పలకరించడం మంచిది. మీ స్నేహపూర్వక వైఖరి మీకు చోటు కల్పించవచ్చు. పనిని అతిగా చేయకుండా ప్రయత్నించండి, ఎందుకంటే ఇది సమయ పరిమితి, ఆలస్యానికి దారితీయవచ్చు. మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవారు మీ నుంచి ఏదైనా వినడానికి వేచి ఉండవచ్చు. మీరు వంటగదిలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది.

లక్కీ సైన్- సీతాకోక చిలుక

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) : చెల్లాచెదురుగా ఉన్నవి, దూరంగా కనిపించినవన్నీ ఒకచోట చేరినట్లు అనిపించవచ్చు. వివాహ మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ రావాలి. విచ్ఛిన్నమైన సంబంధాలు కూడా కదలికను చూడవచ్చు. ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ గ్యాప్ సరిదిద్దవచ్చు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకోవచ్చు, వారు రాబోయే కాలంలో చాలా ఉపయోగకరంగా మారవచ్చు. మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి సంకోచించకండి. మీరు హై ప్రొఫైల్ గెట్ టుగెదర్ కోసం ఆహ్వానాన్ని అందుకోవచ్చు.

లక్కీ సైన్- క్యాండిల్‌ స్టాండ్‌

కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : మీరు ఇప్పటికి చాలా టెక్నిక్‌లలో ప్రావీణ్యం సంపాదించి ఉండవచ్చు కానీ మీకు ఇంకా కావలసింది వినయపూర్వకమైన వైఖరి. కొన్ని సమయాల్లో మీరు వినయం గురించి మరచిపోయి దూకుడుగా వ్యవహరిస్తారు. ఈ రోజు మిమ్మల్ని మీరుగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, కానీ రియలైజేషన్‌ కావాలి. భౌతిక సంపదను కూడబెట్టుకోవడం ద్వారా, బాల్యం కంటే మెరుగైన జీవనశైలిని గడపడం ద్వారా, అన్నీ సాధించినట్లు కాదు. నిర్మాణాత్మక విమర్శలను వినండి.

లక్కీ సైన్- ప్రశాంతమైన సంగీతం

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : సోషల్‌ లైఫ్‌ మీ ప్రైమరీ కన్‌సర్న్‌ అయితే.. మీరు ప్రతి రెండవ రోజు బయటకు వెళ్లాలనుకుంటున్నారు, దానిని పరిమితం చేయాల్సిన సమయం వచ్చింది. మీరు మీ ఇమేజ్‌ని రఫ్ఫ్లింగ్ చేస్తూ ఉండవచ్చు కానీ మీ పని దెబ్బతింటోంది. మీ నైపుణ్యం సెట్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి, జ్ఞానాన్ని విస్తరించడానికి పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఒక జూనియర్ మీ నుంచి ప్రేరణ పొందవచ్చు. మీకు రాయడం అంటే ఇష్టమైతే, అధికారిక ప్రచురణ గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సృజనాత్మకంగా నైపుణ్యం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలను కూడా చూడవచ్చు. ఏవైనా బ్రేక్‌డౌన్స్‌ను నివారించడానికి ఎమోషనల్‌గా ఉన్నప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.

లక్కీ సైన్- థ్రిల్లింగ్‌ నావల్‌

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు