హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : దిన ఫలం : విచిత్ర వైఖరితో దినచర్యకు ఆటంకం ఏర్పడుతుంది..

Rasi Phalalu : దిన ఫలం : విచిత్ర వైఖరితో దినచర్యకు ఆటంకం ఏర్పడుతుంది..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 27 బుధవారం మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోండి..

Today horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశి ఫలాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 27 బుధవారం మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోండి..

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : మానసిక ఒత్తిడిని ఎదుర్కొవడంలో మీరు శక్తివంతమైన స్థితిలో ఉండవచ్చు. కొత్త ప్రాజెక్ట్‌ను నెమ్మదిగా ప్రారంభించడం, త్వరలో ఆశాజనకంగా మారవచ్చు. ఈరోజు ఇంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

లక్కీ సైన్ - దాల్చిన చెక్క బెరడు

వృషభం (ఏప్రిల్ 20-మే20) : తాత్కాలిక సంబంధాలు మసకబారే అవకాశం ఉంది. మీరు గత తాలుకు విషయాలను వదిలేసినట్లు నిర్ధారించుకోండి. అది మీ జీవితాలను ప్రభావితం చేయకూడదు. ప్రయాణ ప్రణాళికలు రెడీగా ఉండవచ్చు.

లక్కీ సైన్ - టెంట్

మిథునం (మే 21- జూన్ 21) : ఆఫీస్‌కు సంబంధించిన విషయంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసిన సంభాషణ చాలా అంతర్దృష్టిని తీసుకురావచ్చు. మీ వృత్తి జీవితంలోని కొన్ని గాసిప్‌ల గురించి మీకు తెలియక ఉండవచ్చు. విచిత్రమైన వైఖరితో రోజువారీ దినచర్యకు ఆటంకం ఏర్పడవచ్చు.

లక్కీ సైన్ - ఇంద్రధనస్సు

కర్కాటకం (జూన్ 22- జూలై 22) : సవాళ్ల సమయంలో మీ ఆలోచనలపై నమ్మకం ఉంచితే, మీరు కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. ఒక శృంగార ప్రతిపాదన మీ ముందుకు రావచ్చు. భవిష్యత్తు కోసం ఏదైనా యాదృచ్ఛిక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం.

లక్కీ సైన్- సరస్సు

సింహం (జూలై 23- ఆగస్టు 22) : మీరు ఏదైనా పోటీ పరీక్ష లేదా ప్రవేశ పరీక్షలో పాల్గొనాలని ప్రయత్నిస్తుంటే, ఫలితాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఇప్పటి వరకు మీలో ఉన్న కొంచెం అలజడి కూడా పోతుంది. బయటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం తగ్గిస్తే మంచిది.

లక్కీ సైన్ - ఫెర్రీ

కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : రాబోయే వారం గురించి మీరు బలమైన ప్రణాళికలతో ఉంటారు. త్వరలో జరగబోయే పెద్ద ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కలిసి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. నైపుణ్యం ఉన్న అంశాల్లో మీకు త్వరలో కొత్త అవకాశం రావచ్చు.

లక్కీ సైన్ - తలపాగా

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : సాధారణంగా కొందరు అలా చేస్తాం, ఇలా చేస్తామంటూ వాగ్దాలను ఇస్తుంటారు. అయితే వాటిని అసలు పట్టించుకోకపోవచ్చు. దీనిబట్టి వారిపై ఓ అంచనాకు రావడం సరికాదు. నగదు ప్రవాహాన్ని ఇప్పుడు అంచనా వేయవచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

లక్కీ సైన్ - బ్లూ టూర్మాలిన్

వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : మీరు స్టార్ట్-అప్‌లో ఉన్నట్లయితే, అవసరమైన ఫైనాన్స్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కొంత ఇంటర్‌నేషనల్ డెవలప్‌మెంట్ రెడీగా ఉంది. ఒక పాత ఫ్రెండ్ పాత క్షణాలను తిరిగి పొందేందుకు మీ దగ్గరకు రావచ్చు.

లక్కీ సైన్- సముద్రపు షెల్

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : కుటుంబం లేదా సన్నిహితుల నుంచి మీరు కొంత ఆశ్చర్యానికి గురి కావచ్చు. వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా మీరు సౌమ్యంగా ఉండటమే ప్రాధాన్యతగా ఎంచుకోవాలి.

లక్కీ సైన్ - పాషన్ ఫ్రూట్

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) : కొంతమంది పాత స్నేహితులు కొత్త వ్యాపారానికి ఏదైనా ఐడియా కోసం మిమ్మల్ని ఒప్పించవచ్చు. జ్ఞాపకశక్తి విలువైన క్షణాలు కొన్ని రోడ్ ట్రిప్‌లో జరగవచ్చు. ప్రభుత్వ అధికారులకు కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు.

లక్కీ సైన్ - స్పష్టమైన క్వార్ట్జ్

కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : మీరు ఒక రకమైన ఆరోపణపై పోరాడవలసి రావచ్చు. వ్యక్తులతో మీ అవగాహన కూడా సానుకూలంగా మారవచ్చు. కుటుంబం నుంచి తగినంత మద్దతు ఉండవచ్చు. మీరు అతిగా ఖర్చుపెట్టే అలవాటును నియంత్రించుకోవలసి రావచ్చు.

లక్కీ సైన్ - మల్లె

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : ప్రస్తుతం మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న పరిస్థితులను సరిచేయడానికి మీరు కొన్నిసార్లు ఫౌండేషన్‌ను సందర్శించాల్సి రావచ్చు. మాజీ సహోద్యోగి, పనిలో మీకు మంచి సలహా ఇవ్వవచ్చు. ప్రతి విషయాన్ని అందరితో చర్చించవద్దు.

లక్కీ సైన్- గులకరాయి

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు